Horoscope Today 21 May 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మే 21వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
ఇతరులకు సలహాలు ఇవ్వడానికి మీరు సిద్దంగా ఉంటారు. కానీ అవతలి వ్యక్తులు అందుకు సిద్ధంగా ఉన్నారో లేదో గమనించి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. ప్రయాణాలు చేయడానికి తగిన సమయం కాదు.


వృషభ రాశి
ఈరోజు మీరు పనిలో బిజీగా ఉంటారు. ఉత్పాదకతలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయి. గత కొంతకాలం నుంచి వాయిదా వేసుకుంటున్న పనుల జాబితా సిద్ధం చేసుకుంటారు. చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోతాయి. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. బయట తిరగడం అంత మంచిది కాదు.


Also Read: Garuda Vahana Seva: తిరుమలలో వేడుకగా శ్రీవారి గరుడ వాహన సేవ Photos


మిథున రాశి
ప్రేమకు సంబంధించి ఈ రోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ కళ్లతో చూసిన వాటిని మాత్రమే నమ్మండి. దాంతో మీ ఆలోచన దృక్పథం మారుతుంది. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. చాలా రోజుల తరువాత కొందరు మిత్రులు మిమ్మల్ని కలుసుకుంటారు.


కర్కాటక రాశి 
మీరు ఈ రోజు అత్యంత సన్నిహితుడు లేదా స్నేహితుడి నుంచి ఊహించని వార్తలను వింటారు. కుటుంబ సభ్యులు, బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయాలి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కొందిరికి మీ సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగులకు పనిభారం అధికం కానుంది. 


సింహ రాశి
కొన్ని విజయాలు మీ దారిలోకి రానున్నాయి. శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేయనున్నారు.
ఈ రోజు ఎవరిని కలుసుకున్నారనే దానిపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. నేడు మీకు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. మీ జ్ఞానాన్ని అవసరమైనవారికి పంచండి, మీకు కూడా అంతా మేలు జరుగుతుంది. ఆర్థిక సమస్యలు తీరతాయి.


Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి


కన్య రాశి
నేడు మీ ఇంటి పరిస్థితులను అదుపులోకి తెచ్చుకోవడానికి యత్నిస్తారు. కొన్ని విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. అంత తేలికగా ఇతరుల మాట వినవద్దు మరియు వారి ఉచ్చులో పడకండి. మీరు భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం శ్రేయస్కరం. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. 


తులా రాశి
మీకు కష్టానికి తగిన ఫలితం వస్తుంది. గతంలో చేపట్టిన పనులలో మార్పులు చోటుచేసుకుంటాయి. చుట్టుపక్కల వారికి మీ సామర్థం ఏంటన్నది తెలుస్తుంది. అవసరమైతే ఇతరుల సహాయం కోరడంలో తప్పులేదు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు పనికి తగిన గుర్తింపు, వ్యాపారులకు లాభాలు ప్రాప్తిస్తాయి. 


వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. కష్టానికి దూరంగా జల్సాలకు దగ్గరగా వెళ్తున్నారు. దీని వల్ల మీకు సమస్యలు ఎదురవుతాయి. మీ వ్యవహారశైలి మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. కనుక నేడు ఇంటి నుంచి కాలు బయటక పెట్టవద్దు. తగినంత విశ్రాంతి తీసుకోండి. తద్వారా చెడు ఆలోచనలు దూరమవుతాయి. ఉద్యోగులకు తగిన గుర్తింపు, హోదా లభిస్తాయి.


ధనుస్సు రాశి
ఈరోజు మీకు సహాయం తీసుకోవడం ఇష్టం లేదు, కానీ సహాయం కచ్చితంగా అవసరమవుతుంది. కుటుంబసభ్యులు, స్నేహితుల సలహా తీసుకుని సమస్యలను పరిష్కరించుకుంటారు. మీ ఆలోచనలు మాత్రం ఇతరులకు భిన్నంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారులకు నష్టాలు, ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. 


Also Read: Rainbow In Dreams: మీ కలలో ఇంద్రధనస్సును చూశారా, దాని అర్థం ఏంటంటే


మకర రాశి
ఈ రోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి తగిన సమయం కాదు. చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కనుక మీరు ఇదివరకు చేయని పనులపై మనసు పెట్టాలి. తద్వారా మీ ఆలోచనల్లో మార్పు రానుంది. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు తలెత్తుతాయి.


కుంభ రాశి
మీ వ్యక్తిగత జీవితంపై ఎక్కువగా దృష్టి సారించారు. అదే సమయంలో మీ కెరీర్, వ్యాపారం లాంటి భవిష్యత్తుకు సంబంధించిన విషయాలపై సైతం ఆలోచించాలి. ఏ ఆశయం లేకుండా ఖాళీగా కూర్చుంటే గౌరవం కోల్పోతారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు ఒత్తిడి తగ్గుతుంది. 


మీన రాశి
మీరు చాలా ప్రణాళికాబద్ధమైన నడుచుకుంటారు. నేడు కొన్ని విషయాలలో ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. గత కొంతకాలం నుంచి మీరు చేయని పనిని చేయండి. ఈరోజు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం శ్రేయస్కరం. వ్యాపారులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook