Horoscope Today 23 August 2022: మేషం ( Aries): శుభకాలం. ధనం చేతికి అందుతుంది. భవిష్యత్ ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. సొంతింటి పనుల్లో ముందంజ వేయగలుగుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులను కలుస్తారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దుర్గా ధ్యానం శుభప్రదం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus): మిశ్రమ కాలం. మొదలుపెట్టే పనుల్లో ఆటంకాలు ఉన్నాయి. మనో ధైర్యంతో పనిచేస్తే విజయం సాధిస్తారు. కీలకమైన పనులను వాయిదా వేయడమే మంచిది. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. దుర్గరాధన శుభప్రదం.


మిథునం (Gemini): పై అధికారుల నుంచి మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. కీలక పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. మహాలక్ష్మీ అష్టోత్తరం చదవండి.


కర్కాటకం (Cancer): తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ముందుచూపుతో వ్యవహరించి పనులు పూర్తిచేసుకోవాలి. ముఖ్య విషయాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. కుటుంబంతో సరదాగా గడుపుతారు. ప్రయాణాలు చేస్తారు. శివ స్తోత్రం పఠించడం మంచిది.


సింహం (Leo): సానుకూల సమయం. చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయంలో పొదుపు పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధిస్తారు. వేంకటేశ్వర స్వామిని పూజించాలి.


కన్య (Virgo): ఒక శుభవార్త వింటారు. ఆర్ధికంగా కలిసొస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ పని ద్వారా అందరి ప్రశంసలను అందుకుంటారు. ప్రయాణాలు చేస్తారు. ఇష్టదైవారాధన మంచిది.  


తుల (Libra): శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. మనో ధైర్యంతో ముందుకు సాగాలి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువులను కలుస్తారు. ఇష్టదైవారాధన చేస్తే ఆర్థిక ఇబ్బందులు నుంచి బయటపడవచ్చు. 


వృశ్చికం (Scorpio): మనో ధైర్యంతో ముందుకు సాగితేనే.. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. డబ్బు చేతికందే అవకాశం ఉంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త. వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.


ధనస్సు (Sagittarius): అనుకూల ఫలితాలున్నాయి. చేపట్టే పనిలో విజయం సాధిస్తారు. బంధువుల సహకారం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ముందుచూపు అవసరం. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.


మకరం (Capricorn): ఓర్పు చాలా అవసరం. బంధువులతో వాదనలకు దిగడం వలన విబేధాలు వస్తాయి. అవసరానికి మించిన ఖర్చులు ఉన్నాయి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. నవగ్రహ ఆలయ సందర్శనం శుభప్రదం.


కుంభం (Aquarius): ఆర్థిక విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వృత్తిపరంగా మీ ప్రయత్నాలు గుర్తించబడతాయి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. కుటుంబంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆంజనేయ స్వామి దర్శనం మంచిది.


మీనం (Pisces): శుభకాలం. స్థిరమైన ఆలోచనలతో పనులు పూర్తిచేస్తారు. ఒక వ్యవహారంలో మీకు సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. దైవబలం బలంగా ఉంది. బంధువులను కలుస్తారు. ఇష్టదైవారాధన శుభప్రదం.


Also Read: Shubman Gill, Sara Tendulkar: శుభ్‌మన్ గిల్, సారా టెండుల్కర్ ఇంకా డేటింగ్‌లో ఉన్నారా


Also Read: IND vs ZIM: మూడో వన్డేలో శుభ్‌మన్ గిల్ సూపర్ షో..24 ఏళ్ల నాటి రికార్డు బద్ధలు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook