Shubman Gill, Sara Tendulkar: శుభ్‌మన్ గిల్, సారా టెండుల్కర్ ఇంకా డేటింగ్‌లో ఉన్నారా ?

Sara Tendulkar, Shubman Gill: సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండుల్కర్ ఓ బ్యూటీఫుల్ ఏంజిల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ బ్యూటీఫుల్ ఏంజిల్ సారా టెండుల్కర్ యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో ప్రేమలో పడిందా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 23, 2022, 12:20 AM IST
Shubman Gill, Sara Tendulkar: శుభ్‌మన్ గిల్, సారా టెండుల్కర్ ఇంకా డేటింగ్‌లో ఉన్నారా ?

Sara Tendulkar, Shubman Gill: సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండుల్కర్ ఓ బ్యూటీఫుల్ ఏంజిల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ బ్యూటీఫుల్ ఏంజిల్ సారా టెండుల్కర్ యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో ప్రేమలో పడిందా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. తరచుగా సారా టెండుల్కర్, శుభ్‌మన్ గిల్ డేటింగ్‌ వ్యవహారం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతూనే ఉంది. జింబాబ్వే vs ఇండియా జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సెంచరీ కొట్టి ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. దీంతో ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో శుభ్‌మన్ గిల్ పేరు మార్మోగిపోతోంది.

శుభ్‌మన్ గిల్‌ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తొలి సెంచరీ నమోదు చేసుకున్న సందర్భంగా సీనియర్ క్రికెటర్స్ అతడికి విషెస్ చెబుతూ అభినందనల్లో ముంచెత్తుతున్నారు. కేవలం 82 బంతుల్లో 14 బౌండరీలు, ఒక సిక్సర్ బాదడం ద్వారా శుభ్‌మన్ గిల్ ఈ సెంచరీని పూర్తిచేశాడు. శుభ్‌మన్ గిల్‌ సెంచరీ బాదిన కొద్దిసేపటికే పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో సారా టెండుల్కర్ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. శుభ్‌మన్ గిల్‌ సెంచరీ కొట్టడానికి సారా టెండుల్కర్ పేరు ట్రెండింగ్‌లోకి రావడానికి కారణం ఏంటనే కదా మీ సందేహం... ? అక్కడికే వస్తున్నాం.

శుభ్‌మన్ గిల్‌, సారా టెండుల్కర్ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నట్టు కొంతకాలంపాటు వార్తలొచ్చాయి. అందుకు కారణం ఒకరినొకరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఫాలో అవుతూ.. ఒకరి పోస్టులపై మరొకరు పరస్పరం లైక్స్, కామెంట్స్, కాంప్లిమెంట్లతో రియాక్ట్ అవడమే. అందుకే శుభ్‌మన్ గిల్‌ సెంచరీ కొడితే, సారా టెండుల్కర్ కూడా ఆనందంగా ఫీల్ అవుతుందని కొందరు, గర్వంగా ఫీల్ అవుతుందేమో అని ఇంకొందరు సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో వైరల్ చేస్తున్నారు. దీంతో శుభ్‌మన్ గిల్‌‌తో పాటు సారా టెండుల్కర్ పేరు కూడా కాసేపు ట్రెండ్ అవుతూ కనిపించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో సారా టెండుల్కర్ కుటుంబాన్ని శుభ్‌మన్ గిల్‌ ఫాలో అయితే.. శుభ్‌మన్ గిల్‌ కుటుంబాన్ని సారా టెండుల్కర్ ఫాలో అవడం వీళ్లిద్దరి ఎఫైర్ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చినట్టయింది. ఇదిలావుంటే, శుభ్‌మన్ గిల్‌, సారా టెండుల్కర్ ఇద్దరూ బ్రేకప్ అయ్యారనే వార్తలు కూడా ట్రెండ్ అయిన సందర్భాలున్నాయి. ' డోంట్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఏంజిల్స్ ' అంటూ శుభ్‌మన్ గిల్ గతంలో ఓ పోస్ట్ పెట్టాడు. అది చూసిన నెటిజెన్స్.. శుభ్‌మన్‌కి సారాకు బ్రేకప్ అయినట్టుంది... అందుకే ఇలాంటి పోస్ట్ పెట్టాడంటూ చర్చించుకున్నారు. మొత్తానికి శుభ్‌మన్ గిల్ చేసిన తొలి ఇంటర్నెషనల్ సెంచరీ (Shubman Gill First Maiden international Century) కూడా అతడికి, సారా పేరును ముడిపెడుతూ మీమ్స్ వైరల్ అవుతుండటంతో మరోసారి వీళ్లిద్దరి పేరు తెరపైకొచ్చిందన్నమాట.

Also Read : IND vs ZIM: మూడో వన్డేలో శుభ్‌మన్ గిల్ సూపర్ షో..24 ఏళ్ల నాటి రికార్డు బద్ధలు..!

Also Read : IND vs ZIM: ఆఖరి వన్డేలో చెమటోడ్చి గెలిచిన టీమిండియా..సిరీస్ క్లీన్‌స్వీప్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News