Horoscope Today 23 May 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మే 23వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
నేడు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఇది ఇంట్లో మరియు పనిచేసే చోట మీకు సానుకూల ఫలితాలను అందిస్తుంది. త్వరగా సమస్య పరిష్కారం చేసుకుంటారు. మీ సృజనాత్మకత చూసి ఇతరులు ఆశ్చర్యానికి లోనవుతారు. ఆస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.


Also Read: Garuda Vahana Seva: తిరుమలలో వేడుకగా శ్రీవారి గరుడ వాహన సేవ Photos


వృషభ రాశి
ఈరాశి వారికి నేడు పనులు చాలా నెమ్మదిగా పూర్తవుతాయి. కొన్ని పనులు మధ్యలోనే నిలిచిపోయే అవకాశం ఉంది. మీకు అత్యంత సన్నిహితులైన వారితో విభేదాలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. మీరు కొంచెం భిన్నంగా వ్యవహరించే వ్యక్తిని కలుసుకుంటారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితం రాదు.


మిథున రాశి
మీకు ఇష్టమైన కొందరు వ్యక్తులకు దూరంగా ఉన్నందున, వారితో తగినంత సమయం గడపడం లేదని భావిస్తున్నారు. నేడు మీరు బయటకు వెళ్లి స్నేహితులు మరియు కుటుంబసభ్యులతో గడపాలని కోరుకుంటారు. మీరు ఈ రోజు ఉత్సాహంగా పనులు పూర్తి చేయాలని భావిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా బాగుండదు. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది.


కర్కాటక రాశి 
ఈ రోజు మీరు మరియు మీ కుటుంబసభ్యులు కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తారు. ఏం చేసినా సాధ్యాసాధ్యాలను పరిశీలించి చేయాలని మరిచిపోరాదు. ఉద్యోగులు, వ్యాపారులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. 


సింహ రాశి
నేడు సింహరాశి వారికి ఖర్చులు అధికం కానున్నాయి. ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. మీరు కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి మీరు ఏం చేయగలరు అనే విషయాలపై ఆలోచిస్తారు. ఇతరులకు భిన్నమైన కెరీర్‌ను ఎంచుకునే దిశగా అడుగులు పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాలకు ఇది తగిన సమయం కాదు.


కన్య రాశి
ఈ రోజు కన్యారాశి వారు మాటలు చాలా విలువైనవని తెలుసుకుంటారు. మీ మనసులో మాటలను, అభిప్రాయాలను పూర్తిగా వ్యక్తపరచాలని నిర్ణయం తీసుకుంటారు. కొన్ని పనులు పూర్తి చేసేందుకు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చేపట్టిన పనులలో జాప్యం తలెత్తుతుంది. ఖర్చులు అధికం కానున్నాయి. వ్యాపారులకు లాభాలు గోచరిస్తున్నాయి. 


Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి


తులా రాశి
మీరు ఈ రోజు ఏవైనా విలువైనవి, ఖరీదైనవి కొనుగోలు చేయాలని భావిస్తుంటే, అందుకు నేడు సరైన సమయం. ఆర్థికంగా ఏ ఇబ్బంది లేదని నిర్ధారించుకున్న తరువాతే కొనుగోళ్ల జోలికి వెళతారు. మీ మీద కొంత నమ్మకం ఉంచి ముందుకు సాగండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును అవసరమైన సందర్భాలలో ఖర్చు చేస్తారు. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది. అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. 


వృశ్చిక రాశి
మీ కెరీర్‌పై దృష్టి సారించడానికి ఇది సరైన సమయం. మీరు కొంతకాలంగా ఏదో విషయంలో వెనకడుకు వేస్తున్నారు. చేతికి అందివచ్చే అవకాశాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే ఇది మీకు అద్భుతమైన అవకాశంగా మారనుంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. కొన్ని కీలక విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారులకు లాభదాయంగా ఉంటుంది.


ధనుస్సు రాశి
మీ చుట్టూ ఉన్న విషయాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోరాదు. మీ మీద మీరు నమ్మకం ఉంచాలి. ఇతరులతో నమ్మకంగా వ్యవహరించడం సమస్యలకు పరిష్కారం చూపుతుంది. విద్యార్థులు తమ కెరీర్ గురించి ఆలోచిస్తారు. నూతన పరిచయాలు స్నేహంగా మారతాయి. ఉద్యోగులకు పని భారం తగ్గడంతో ఉత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. 


మకర రాశి
ఓ విషయం ఈ రోజు జీవితంపై, మీ దృక్పథంపై ఆధారపడి ఉంటుంది. మీరు ఆశాజనకంగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. లేదంటే ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం ధ్యానం చేయడం ఉత్తమం. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. 


Also Read: Rainbow In Dreams: మీ కలలో ఇంద్రధనస్సును చూశారా, దాని అర్థం ఏంటంటే


కుంభ రాశి
ఈరోజు పనులు వేగంగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తారు. అదే సమయంలో ఇతరులపై ఆధిపత్యం, అధికారం చెలాయించవద్దు. ఇది మీకు సమస్యలను మాత్రమే సృష్టిస్తుంది. మీ జీవిత భాగస్వామి మాటలు వినడం ద్వారా సమష్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆర్థిక సమస్యలు అలాగే ఉంటాయి. అన్ని రంగాల వారికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి.


మీన రాశి
నేడు మీనరాశి వారు కొన్ని శుభకార్యాలకు హాజరవుతారు. మీరు గత కొంతకాలం నుంచి లోలోపల బాధ పడుతున్నారు. ఇతరులతో మీ సమస్యను పంచుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత దొరుకుతుంది. నూతన పరిచయాలకు ఇది తగిన సమయం. తద్వారా మీ కెరీర్‌లో మెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగులకు సానుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో పునరాలోచించడం శ్రేయస్కరం. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook