Horoscope Today 24 May 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మే 24వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
ఈ రోజు మీ జీవితంలో ఊహించని వ్యక్తి మీ పట్ల ప్రేమను వ్యక్తం చేస్తారు. ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రతి విషయం తెలుసుకుని పనులను సకాలంలో పూర్తి చేయడానికి యత్నిస్తారు. వేడుకలు, శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.


Also Read: Fertility Myths: సంతానలేమిపై మగవారిలో 5 ముఖ్యమైన సందేహాలు, వాటి సమాధానాలు


వృషభ రాశి
మీరు ఎవరితోనూ బయటకు వెళ్లకుండా ఉండాలని అనుకుంటారు. అదే సమయంలో ఇంట్లో ఉండి ఒక్కరే పనులు మొత్తం పూర్తి చేయడం వీలుకాదు. పరిశుభ్రమైన దుస్తులు ధరిస్తారు. కొన్ని శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. నేడు మీకు వస్తులాభం గోచరిస్తుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.


మిథున రాశి
చిన్నప్పటి నుంచి మీరు కుటుంబంతో ఉన్నారు. కానీ ప్రస్తుతం అనుకోని పరిస్థితులలో ఒంటరిగా ఉండటం మిమ్మల్ని ఆవేదనకు గురిచేస్తుంది. అయితే మీ చుట్టూ జరిగే విషయాలను ఆస్వాదించడం అలవాటు చేసుకుంటారు. ఖర్చులు అధికం కానున్నాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కొన్ని విషయాల కారణంగా మానసిక ప్రశాంతత కరువవుతుంది.


కర్కాటక రాశి 
మీరు ఎల్లప్పుడూ నేర్చుకోవాలనుకునేదాన్ని ఎంచుకోండి. తద్వారా మీరు కెరీర్‌లో ఏం కావాలనుకుంటున్నారో అందరికీ తెలిసేలా చేయండి. మిమ్మల్ని ఆకర్షించే వ్యక్తులను కలుసుకోనున్నారు. చేపట్టిన పనులు చాలా నెమ్మదిగా జరుగుతాయి. స్నేహితులు, కుటుంబసభ్యులతో వివాదాలు చికాకు తెప్పిస్తాయి. వ్యాపారులకు సాధారణ ఫలితాలు, ఉద్యోగులకు పని భారం అధికం కానుంది. 


Also Read: Garuda Vahana Seva: తిరుమలలో వేడుకగా శ్రీవారి గరుడ వాహన సేవ Photos


సింహ రాశి
సామాజిక కార్యక్రమాలలో ఎక్కువ సమయం గడుపుతున్నారు మరియు మీ జీవిత భాగస్వామి విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. నేడు మీకు ధనలాభం గోచరిస్తుంది. తద్వారా నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. జీవిత భాగస్వామితో ఏకాంతంగా గడపేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు పనికి తగిన గుర్తింపు లభిస్తుంది.


కన్య రాశి
రిస్క్ లేకుండా పనులు జరగాలని భావించే మనస్తత్వం మీది. కానీ  ప్రస్తుతం మీరు రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొత్తగా రుణ యత్నాలు మొదలు పెడతారు. మిమ్మల్ని గౌరవించే వ్యక్తులతో మాత్రమే ఉండేందుకు ఇష్టపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరగడంతో దైవదర్శనాలు చేసుకోవాలని ప్లాన్  చేస్తారు.


తులా రాశి
మీరు చేసే పనులలో కొన్ని నూతన నియమాలు తీసుకొస్తారు. దాని వల్ల పనులు సకాలంలో పూర్తవుతాయి. నేడు కొంత సమయం విశ్రాంతి తీసుకునేందుకు కేటాయిస్తారు. కుటుంబసభ్యులతో కూడా సమయాన్ని గడపేందుకు ప్లాన్ చేస్తారు. కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. 


వృశ్చిక రాశి
మీ సమస్యల పరిష్కారం కోసం యత్నిస్తారు. ప్రస్తుతం చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. బంధువులతో వివాదాలు జరుగుతాయి. అయినా మీరు వెనక్కి తగ్గరు. అనారోగ్య సమస్య బాధిస్తుంది. ఇంట్లో, పనిచేసేచోట కొన్ని అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. వ్యాపారులకు సాధారణంగా ఉండనుంది.


Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి


ధనుస్సు రాశి
భార్యాభర్తల మధ్య ఏకాంతానికి అడ్డంకులు ఎదురవుతాయి. అయితే చింతించకండి, కొంతకాలం పరిస్థితులు మీకు అనుకూలించవు. మీ కెరీర్ మీద దృష్టిసారించాలి. మీకు నచ్చిన పనులు మరియు మీరు ఆనందించే పనులు చేయండి. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. జీవిత భాగస్వామి మిమ్మల్ని కచ్చితంగా అర్థం చేసుకుంటుంది. నిరుద్యోగులకు ఓ ముఖ్య సమాచారం అందుతుంది. 


మకర రాశి
మీరు సంతోషంగా జీవించాలంటే జీవిత భాగస్వామితో ఏ సమస్యా లేకుండా ఉండాలి. అందుకోసం వారితో చర్చించి భేదాభిప్రాయాలను పరిష్కరించుకోవాలి. ప్రతి పనిని మీరే చేయలేరని మీరు అర్థం చేసుకోవాలి. కొన్ని పనులలో ఇతరుల మద్దతు తీసుకోవాలని గ్రహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగవడంతో ఏదైనా కొనుగోలు చేయాలని భావిస్తారు. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది.


కుంభ రాశి
ప్రపంచం ప్రేమ చుట్టూ తిరగదని గుర్తుంచుకోండి. మీరు ప్రేమే ప్రపంచంగా తిరుగుతారు. దీని వల్ల మీకు సమస్యలు తప్ప, ఏ ప్రయోజనం ఉండదు. మొదట మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీపై నమ్మకం పెంచుకుని జీవిత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిపై దృష్టిసారించాలి.


మీన రాశి
చేపట్టిన పనులు వాయిదా పడతాయి. మీ జీవిత భాగస్వామి మీకు ఆశ్చర్యం కలిగించే విషయాన్ని చెబుతుంది. అందులో పాజిటివ్ విషయాన్ని గ్రహిస్తే ఏ సమస్యా ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సమీపంలోని ఆలయాలు సందర్శిస్తారు. నూతన పెట్టుబడులకు వ్యాపారులు శ్రీకారం చుడతారు. ఉద్యోగులు తమ శ్రమకు తగిన గుర్తింపు కోసం ఎదురుచూస్తారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook