Horoscope Today 26 April 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 26వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
ఈరోజు మీకు చంద్రుని ఆశీర్వాదం లభిస్తుంది. చంద్రుడి ప్రభావంతో మీరు ఆనందంగా గడుపుతారు. పనిచేసే చోట మరింత ఉత్పాదకతను  మీ వంతుగా అందజేస్తారు. మీరు నగదు అవసరమయ్యే కొన్ని ఇంటి నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది.


Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి


వృషభ రాశి
ఆఫీసు పని మీద ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. కానీ మీరు ఈ సమయంలో ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని ఆలోచించుకోవాలి. మీ తల్లిదండ్రులలో ఒకరు ఆరోగ్యం బారిన పడటంతో మీరు కలత చెందుతారు. తోబుట్టువులు ఈ రోజు మీ సహాయం కోసం ఎదురుచూస్తారు. పనులను పూర్తి చేయడంలో సహోద్యోగులు మీకు సహాయం చేస్తారు. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.  


మిథున రాశి
గతంలో చేసిన పెట్టుబడులు ఈ రోజు కొంతమేర నష్టాన్ని తెచ్చే అవకాశం ఉంది. మీరు రోజంతా స్నేహితులతో గడపాలని భావిస్తారు.  మరియు పనిని నిర్లక్ష్యం చేసి ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతారు. వివాహితులు ఒకరితో ఒకరు భవిష్యత్తును ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల కారణంగా కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. వ్యాపారులకు ఆశించిన మేర ఫలితాలు రావు.


కర్కాటక రాశి 
మీ పనిలో ప్రయోజనాలను తీసుకువచ్చే కొత్త వ్యక్తిని మీరు ఈ రోజు కలిసుకునే అవకాశం ఉంది. ఈ రోజు విద్యార్థులు తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ రోజు ఆనందంగా గడుపుతారు. వ్యాపారులకు గతంలో చేసిన పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది. నేడు మీకు వస్తులాభాలు గోచరిస్తున్నాయి. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వకపోతే అనారోగ్య సమస్యలు తప్పవు.


సింహ రాశి
ఈ రోజు ఆరోగ్య సమస్యలు అదుపులోకి వస్తాయి. తల్లిదండ్రులతో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నగదు సంబంధిత ఆర్థిక సమస్యలను పెద్ద విషయంగా భావించనందున, పనిలో ముందడుగు పడుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు సానుకూల ఫలితాలు రానున్నాయి. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అయితే చివరి నిమిషంలో మార్పులు జరగవచ్చు.


Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!


కన్య రాశి
తగినంత నిద్ర లేకపోవడం వల్ల మీకు నీరసంగా అనిపించవచ్చు. ఇది మీ పనిని ప్రభావితం చేస్తుంది. కింద పనిచేసే వారి నుండి సహాయం తీసుకోండి, తద్వారా మీ ప్రాజెక్ట్ గందరగోళంగా ఉండదు. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు అభిప్రాయ భేదాలు ఉన్నందున ఇంట్లో ప్రశాంతత కరువవుతుంది. దీర్ఘకాలం నుంచి ఎదురుచూస్తున్న కొన్ని ఆస్తులు చేతికి అందుతాయి. వ్యాపారులకు లాభాలు గోచరిస్తున్నాయి.


తులా రాశి
నేడు మిమ్మల్ని అదృష్టం వరించనుంది. నూతన ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు శుభవార్తలు అందుకుంటారు. పెట్టుబడులు వ్యాపారులకు లాభాలను అందిస్తాయి. ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు గతంలో కన్నా అధికంగా తమ కెరీర్‌పై దృష్టిసారిస్తారు. ఖర్చులు అధికం అవుతాయి. ఉద్యోగుల పనికి తగ్గ గుర్తింపు లభించదు.


వృశ్చిక రాశి
బంధువుల నుండి అందుకునే శుభవార్త ఈ రోజు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. పనిలో సహోద్యోగులు మీ పనులను కష్టతరం చేయవచ్చు. మీ జీవిత భాగస్వామి ఇబ్బందుల్లోకి నెట్టివేసే నిర్ణయాలు తీసుకుంటారు. నేడు కొందరు మీ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రోజు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై పెట్టుబడులు పెట్టకుండా ఉండటం శ్రేయస్కరం.


Also Read: Kumbh Mela 2021 Photos: ఘనంగా ప్రారంభమైన హరిద్వార్ కుంభమేళా, ఫొటో గ్యాలరీ


ధనుస్సు రాశి
కుటుంబ సమస్యలతో ఈ రోజు మీరు తీరిక లేకుండా గడుపుతారు. ఇల్లు మారడం లాంటివి కుటుంబంలో వివాదానికి సంబంధించిన అంశంగా మారవచ్చు. పనిచేసే చోట మీకు అంతా సజావుగా  జరుగుతుంది. మీ కింద పనిచేసేవారు శక్తి వంచన లేకుండా మీకు సహాయం చేస్తారు. వ్యాపారులు స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో పెట్టుబడి పెట్టినట్లయితే, అది నష్టానికి దారితీసే అవకాశం ఉంది.


మకర రాశి
మీరు పని చేయడానికి ప్రశాంతకరమైన వాతావరణం కనుగొంటారు.
సంగీతం ఈ రోజు మిమ్మల్ని రక్షిస్తుంది. దాని వల్ల మీరు ప్రయోజనం సైతం పొందనున్నారు. ఈ రోజు మీరు కుటుంబానికి దూరంగా ఉంటారు. అదే సమయంలో కొందరు స్నేహితులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు. కొన్ని విషయాలలో అభిప్రాయభేదాలు వివాదాలకు దారితీస్తాయి. వ్యాపారులు కొన్ని మార్పులు కోరుకుంటారు.
 
కుంభ రాశి
మీరు ఈ రోజు ఛారిటీ ప్రాజెక్టుతో తీరిక లేకుండా గడుపుతారు. మీరు ఇటీవల మీ కెరీర్‌లో ఏమి చేస్తున్నారో తల్లిదండ్రులకు చెబుతారు. మీ విజయం పట్ల వారు సంతోషంగా ఉంటారు. మీ యజమాని మీకు మరిన్ని బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. మీ సృజనాత్మకతతో మీకు నేడు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఖర్చులు అధికం అవుతాయి. ఎంతగా శ్రమించినా మీ పనులకు ప్రతికూల ఫలితాలు రానున్నాయి.


మీన రాశి
కుటుంబ వ్యాపారం ఈ రోజు ఇంట్లో కొంత ఘర్షణ వాతావరణాన్ని తెస్తుంది. మీ తల్లిదండ్రులు మీ నిర్ణయాలకు మద్దతు ఇవ్వకపోవచ్చు. ఈ రోజు పరిశోధన నుండి కాస్త విరామం తీసుకోవడం తీసుకుంటే మంచి ఉద్యోగాలు లభిస్తాయి. తోబుట్టువుల మధ్య తగాదాలు పరిష్కారం అవుతాయి. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. వ్యాపారులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook