Horoscope Today 27 April 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 27వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
ఇతరులతో మీరు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. అయినప్పటికీ మీరు నాటకీయంగా వ్యవహరించవచ్చు. మీకు కావాల్సిన విషయాన్ని చెప్పకపోతే అపార్థం చేసుకునే అవకాశాలున్నాయి. కొందరు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. నేడు మీ చేతికి ఆస్తి దక్కనుంది. చాలా కాలం తరువాత స్నేహితులను కలుసుకోనున్నారు. ఉద్యోగులకు అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.


Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి


వృషభ రాశి
మీరు సాధారణంగా జీవితంలో వెలుగు వైపు మాత్రమే గమనిస్తారు. అయితే ఈ రోజు నిజాన్ని తెలుసుకుని ఆశ్చర్యానికి లోనవుతారు. మీకు తెలియని నెగెటివ్ విషయాలను తెలుసుకుని, వాటిని పరిష్కరించుకునేందుకు దృష్టిసారిస్తారు. మీరు ఓ శుభవార్త అందుకుంటారు. కొన్ని రంగాల వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 


మిథున రాశి
ఈ రోజు మీరు నగదుకు సంబంధించిన విషయాలలో సూటిగా, స్పష్టంగా వ్యవహరించాలి. సహచరులు లేదా కుటుంబసభ్యులు అధికంగా ఖర్చు చేస్తుంటే, వారిని నియంత్రించే ప్రయత్నం చేస్తారు. చేపట్టిన పనులలో అవాంతరాలు తలెత్తుతాయి. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా లాంటివి చేయడం శ్రేయస్కరం. ఉద్యోగులకు పని భారం పెరగనుంది.


కర్కాటక రాశి 
ఈ రోజు మీరు పనులు వేగంగా చేయాల్సి వస్తుంది. కొందరు ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. కుటుంబసభ్యుల మధ్య కొన్ని విషయాలలో విభేదాలు తలెత్తుతాయి. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. వ్యాపారులకు అంతగా కలిసిరాదు. ఉద్యోగులకు పనులలో అవాంతరాలు తలెత్తుతాయి.


Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!


సింహ రాశి
దుబారా ఖర్చులు మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే అవకాశం ఉంది. అత్యంత ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయాలన్న ఆలోచనను విరమించుకోండి. నేడు మీ విలువను అందరు గుర్తిస్తారు. ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. తెలివిగా నిర్ణయాలు తీసుకుని కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. 


కన్య రాశి
కొందరు మీ స్థలాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారా.. నేడు దాని గురించి ఆలోచించి పరిష్కారాన్ని తెలుసుకుంటారు. లేనిపక్షంలో ఇది భవిష్యత్ సమస్యలకు దారి తీస్తుంది. కొన్ని పనులలో ఆటంకాలు తలెత్తుతాయి. అందుకు మీకు దగ్గరి వారే కారణం అవుతారు. వ్యాపారులకు సాధారణ ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు శ్రమకు గుర్తింపు దక్కదు.


తులా రాశి
మీరు కొన్ని ఆచారాలను సజీవంగా ఉంచడానికి పోరాడం చేస్తున్నారు. ప్రతి వ్యక్తి దానిని ఇష్టపడరని మీరు అర్థం చేసుకుని వ్యవహరిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొందరు వ్యక్తుల సలహా ద్వారా వ్యాపారులకు లాభాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యక్తులతో పరిచయం మీకు క్షేమదాయకం. 


వృశ్చిక రాశి
మీరు పర్వతం లాంటి సమస్యను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. మీ పనిలో న్యాయం ఉంటే మీకు మేలు జరుగుతుంది. ఆకాశం నుంచి ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. నేడు ఎత్తైన ప్రదేశాలు సందర్శించాలన్న ఆలోచన మానివేయాలి. ఖర్చులు పెరగడంతో రుణాల కోసం యత్నాలు మొదలుపెడతారు. చేపట్టినన పనులలో జాప్యం ఏర్పడుతుంది.


Also Read: Rainbow In Dreams: మీ కలలో ఇంద్రధనస్సును చూశారా, దాని అర్థం ఏంటంటే


ధనుస్సు రాశి
మీరు నెమ్మదిగా చేసే పనులను, విధానాలను ఈ రోజు మార్చుకోవాల్సి ఉంటుంది. మీరు కొన్ని అసాధారణ ఆలోచనలను కార్యరూపం దాల్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. ఉద్యోగులు ఫలితాల కోసం నిరీక్షిస్తారు. వ్యాపారులకు అంతా లాభసాటిగా ఉంటుంది.


మకర రాశి
గత కొన్నిరోజులుగా ఎదురుచూస్తున్న వేతనం మీ చేతికి అందనుంది. మరియు చుట్టుపక్కల వ్యక్తులు మీ ధైర్యాన్ని ప్రశంసిస్తారు. భూములు కొనుగోలు చేయాలని ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆర్థిక సమస్యలు తీరతాయి. వ్యాపారులు నూతన పెట్టుబడులకు యోచన మొదలవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తగవు.
 
కుంభ రాశి
మీ ఆలోచనల్ని ఇంట్లో బహిర్గతం చేయడం మంచిది, అయినప్పటికీ మీ తోటివారు అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవదర్శనాలు చేయాలని ప్లాన్ చేసుకుంటారు. కొన్ని విషయాలలో విభేదాలు తలెత్తడంతో కుటుంబంలో గానీ, బంధువులతో గానీ వివాదాలకు దారితీస్తుంది. ఉద్యోగులు పని ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.


మీన రాశి
మీ ఆలోచనలు అమలు చేయడం కష్టతరం అవుతున్న కారణంగా మద్దతు కోల్పోతారు. ఓ పని పూర్తి చేసేందుకు ఎంత సమయం, ఎంతగా శ్రమించారో గుర్తించి మసలుకోవాలి. ప్రయాణాల కారణంగా ధనవ్యయం పెరుగుతుంది. చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేయడంలో జాప్యం తలెత్తుతుంది. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు రావు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook