Horoscope Today 5 September 2022: మేషం ( Aries): మిశ్రమ కాలం నడుస్తోంది. నూతనంగా చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కీలక వ్యవహారంలో పెద్దలను కలిస్తే మంచింది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. బంధుమిత్రులను కలుస్తారు. దత్తాత్రేయ స్తోత్రం చదివితే మంచిది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus): చేపట్టే పనులలో అశ్రద్ధ వద్దు. అన్ని పనుల్లో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. పై అధికారులతో జాగ్రత్త. దుర్గాదేవిని పూజిస్తే మంచి ఫలితాలు ఉన్నాయి.


మిథునం (Gemini): శుభకాలం నడుస్తోంది. కీలక సమస్యలను సులభంగా పరిష్కరించుకుంటారు. మీ పనితో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ట్రిప్ ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఇష్ట దైవారాధనను మానవద్దు.


కర్కాటకం (Cancer): ప్రయత్నాలు చేస్తే పనులు పూర్తవుతాయి. కీలక విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు అవసరం. ఓ నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. కుటుంబ సహకారం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచింది. ఇష్టమైన దేవుడిని పూజించండి. 


సింహం (Leo): శుభాకాలం నడుస్తోంది. ఓ శుభవార్త ఇంట్లో ఆనందాన్ని ఇస్తుంది. మీ పనితో అందరి ప్రశంసలను అందుకుంటారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణ సూచన ఉంది. కృష్ణాష్టకం పఠిస్తే బాగుంటుంది.


కన్య (Virgo): అన్ని రంగాల ఎవరికి అనుకూల సమయం. చేపట్టిన పనులను అనుకున్న సమయానికే పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ వాతావరణం బాగుంటుంది. శివాస్తోత్రం పఠిస్తే బాగుంటుంది


తుల (Libra): శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారులు మీకు అనుకూలమైననిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. ప్రేమ విషయంలో తొందరపాటు వద్దు. ఉమామహేశ్వరస్తోత్రముం పటించండి.


వృశ్చికం (Scorpio): శ్రమకు తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక విషయాల్లో ఓర్పు అవసరం. ఉద్యోగం విషయంలో ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సూర్య ఆరాధన చేయండి.  


ధనస్సు (Sagittarius): పట్టుదలతో చేసే పనులు లాభాలను ఇస్తాయి. అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణంలో జాగ్రత్త. పంచముఖ ఆంజనేయుడిని పూజించండి. 


మకరం (Capricorn): శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. దగ్గరివారి నుంచి మద్దతు లభిస్తుంది. వాయిదా పడిన పనులు త్వరగా పూర్తవుతాయి. ప్రేమ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. వేంకటేశ్వరుడిని ఆరాధించండి.


కుంభం (Aquarius): ఓ శుభవార్త వార్త వింటారు. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. కీలక బాధ్యతలను సమర్థంగా పూర్తిచేస్తారు. మీ పనితో అందరి ప్రశంసలూ పొందుతారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శివారాధన చేయండి.


మీనం (Pisces): అన్ని రంగాల వారు అంచనాలను అందుకుంటారు. కుటుంబంతో కలిసి విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ఆధ్యాత్మిక చింతన అవసరం. ఇష్ట దైవారాదన మానవద్దు.


Also Read: IND vs PAK: నిరాశపరిచిన భారత బౌలర్లు.. ఉత్కంఠ మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం!


Also Read: Rain Alert: ఉత్తర, దక్షిణ ద్రోణి ఎఫెక్ట్..తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook