Horoscope Today 9 February 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ప్రతి సంకేతాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఫిబ్రవరి 9న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మేష రాశి
మాట్లాడటం, చర్చించటం కీలకంగా కనిపిస్తోంది. కానీ ఈరోజు మేషరాశి వారికి ఇది సమస్యగా మారనుంది. మీరు తీసుకోబోయే కీలక నిర్ణయం ఎదురుదెబ్బ తీయడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని మీరు ఊహించి ఉండరు. మీ నోరు మంచిదైతే మీకు నేడు అంతా మంచి జరుగుతుంది. ఇతరుల మాటలకు విలువ ఇస్తూ, సాధ్యమైనంత వరకు నిశ్శబ్దంగా ఉండటం మంచిది.


Also Read: Antarvedi new chariot: ఫిబ్రవరి 13న అంతర్వేది రధానికి సంప్రోక్షణ



వృషభ రాశి
ఈ రోజు మీరు జీవితంలో అన్ని మంచి విషయాలను గ్రహిస్తారు. మీ ఉద్యోగాన్ని కొందరు అభినందిస్తారు. అదేవిధంగా మీరు సైతం మీకు ఇష్టమైన వారిని పని విషయంలో మెచ్చుకుంటారు. ఈ రోజు వృషభరాశి వారికి చాలా అదృష్టంగా అనిపిస్తుంది. మీరు నమ్మారంటే కచ్చితంగా మీకు అన్ని శుభశకునాలే గోచరిస్తున్నాయి. మీరు అనుకున్న పని సజావుగా జరగకపోతే, మీతో ఉన్న రెండో ప్లాన్ అమలు చేసి విజయం సాధించగలరు.



మిథున రాశి
ఈ రోజు మిథున రాశి వారికి డబ్బు సంబంధిత అవరోధాల గురించి సూటిగా స్పందించాలి. ఖర్చు చేయకుండా అవసరాల నిమిత్తం పొదుపు చేయడం మంచిది. మీ మార్గం నుండి బయటపడాలని, మరియు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని భావిస్తారు. రోగాల బారిన పడకుండా మీరు రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపై శ్రద్ధ వహిస్తారు.


కర్కాటక రాశి
ఈ రోజు మీ చుట్టూ ఎలాంటి ప్రశాంత వాతావరణంగానీ, నవ్వులుగానీ లేవు. అందుకు మీరు స్థిరంగా కూర్చోకుండా పని గురించి ముందుకుసాగుతారు. మీరు మీ భాగస్వామితో కొంచెం ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయితే ఎలాంటి చింతన చేయనవసరం లేదు. ఓసారి వారితో మాట్లాడండి, మీకు ఎలా అనిపిస్తుందో వారికి చెప్పండి. మీ భావోద్వేగాలకు విలువ దక్కుతుంది. 


Also Read: Rathasapthami 2021: రథసప్తమికి ఏర్పాట్లు ప్రారంభం, తేదీ ఖరారు



సింహ రాశి
మీరు ఖరీదైన వాటిని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంటారు. మీరు అందరికంటే ధనవంతులుగా కనిపించాలని కోరుకుంటారు. ఈరోజు అదృష్టం మీ వెంట ఉండటంతో మీ ఆర్ధికవ్యవస్థ చాలా బాగుంది. అవసరం ఉన్న వస్తువు లేక స్థలాలలపై మీరు వ్యయం చేసే సూచన కనిపిస్తుంది. మీరు ఉద్యోగానికి కాస్త విరామం తీసుకుని మీ స్నేహితులను కలవాలని ప్లాన్ చేస్తారు.



కన్య రాశి


మీ స్థలాన్ని ఎవరో స్వాధీనం చేసుకోవాలని యత్నిస్తున్నారు. అయితే మీకు మీరు ధైర్యం చెప్పుకుని సమస్యను ఎదుర్కుంటారు. బయటి వ్యక్తులైనా, కుటుంబసభ్యులైనా దానితో సంబంధం లేకుండా వారి స్థానంలో ఉండేలా చేయండి. మీ మాటల్ని పట్టించుకోని వారికి అంతగా విలువ ఇవ్వనవసరం లేదని గ్రహించాలి.



తులా రాశి
కొన్నిసార్లు మీరు పాత సంప్రదాయాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. కొత్త మార్పులు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటానికి తగిన సమయమిది. ప్రతి ఒక్కరూ మీతో ఏకీభవించకపోవచ్చు, కొన్నిసార్లు, మీరు ఇతరుల నిర్ణయాలను సైతం అంగీకరించాలి. మీరు ఇతరుల మాటకు విలువ ఇస్తారని, మొండి పట్టుదలతో వ్యవహరించరని.. అందరిని కలుపుకుని వెళ్తారని నిరూపించుకునే సూచన గోచరిస్తుంది. 


వృశ్చిక రాశి
కార్యం ఏదైనా సరే అందులో దూకడానికి సిద్ధంగా ఉంటారు. మీరు అనుకున్న పనిని నేడు పూర్తి చేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు పగటిపూట తీసుకున్న అన్ని నిర్ణయాలతో ఇతరులు సంతృప్తి చెందుతారు. వృశ్చిక రాశి వారిని నేడు అదృష్టం వరించనుంది. 



ధనస్సు రాశి
ఈరోజు ధనస్సు రాశి వారి శ్రమ ఫలిస్తుంది. ఈ రోజు మీరు కొన్ని అసాధారణ ఆలోచనలు చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ సన్నిహితులు, సహచరులను జాగ్రత్తగా గమనిస్తారు. 


Also Read: Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల పరిరక్షణకు అధికారులు పటిష్ట చర్యలు



మకర రాశి
మీరు చేస్తున్న పనికి ప్రశంసలు దక్కుతాయి. మీ ఉన్నతాధికారులు మీరు ఏమి చేస్తున్నారో గుర్తిస్తారు. అయితే ఈరోజు మీకు వ్యయప్రయాసలు తప్పేలా లేవు. అనుకోని ప్రయాణాలు, బంధువర్గంతో వైరం ఏర్పడే సూచనలు ఉన్నాయి. దైవదర్శనాలు చేయడానికి అనుకూలం. మకర రాశి పారిశ్రామికవేత్తలకు నిరాశ, మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. బయటికి వెళ్లి కొంత సమయం గడిపితే మీ మానసిక ఆరోగ్యానికి మంచిది.


కుంభ రాశి
విచిత్రమైన విషయాలకు ఆకర్షితులవుతారు. మీకు ఆకస్మిక ధనలాభం వస్తుంది. ముఖ్యంగా మీరు ఎప్పుడూ ఆలోచించనివి జరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి నేడు శుభసూచకాలు గోచరిస్తున్నాయి. అందరి కన్నా భిన్నంగా ఆలోచించడం, ప్రయత్నించడం శ్రేయస్కరం.



మీన రాశి
ఈ రోజు మీరు మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మీ మాటలు ఎవరినీ బాధించకుండా ఉండేలా చూసుకోవాలి. పనిలో, కొంచెం ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఆకస్మిక ధనలాభంతో పాటు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కలిసొస్తుంది. మీ మాటకు ఇతరులు విలువ ఇస్తారని గ్రహిస్తారు.


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook