Horoscope Today: నేడు ఏ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకోండి..
నేడు గురువారం (డిసెంబర్ 9). ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Horoscope prediction today: నేడు గురువారం (డిసెంబర్ 9). ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ముందుగా పంచాంగం
శ్రీ ప్లవనామ సంవత్సరం
2021 డిసెంబర్, 09 (గురువారం)
సూర్యోదయం ఉదయం 6:21 గంటలకు
సూర్యాస్తమయం సాయంత్రం 5:21 గంటలకు
తిథి- మార్గశిర శుద్ధ షష్ఠి రాత్రి 03:01 గంటల వరకు తదుపరి సప్తమి
రాహుకాలం: మధ్యాహ్నం 01:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉదయం 10:04 గంటల నుంచి 10:48 గంటల వరకు; మధ్యాహ్నం 2:28 నుంచి 3:12 వరకు
అమృతఘడియలు: సాయంత్రం 5:38 గంటల నుంచి రాత్రి 7:11 గంటల వరకు
రాశి ఫలాలు..
మేష రాశి (Aries)
అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సలాహాలు పాటించడం వల్ల మంచి జరుగుతుంది. ఆరోగ్య పరంగా శ్రద్ధ అవరం, వ్యాపారాలు, ఉద్యోగులకు సానుకూలంగా ఉంది.
వృషభ రాశి (Taurus)
స్నేహితులు, బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు. పనికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. నిరుద్యోగులకు అవకాశాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాల్లో ఉన్న వారికీ సానుకూలంగా ఉంది.
మిథున రాశి (Gemini)
అవసరానికి సహాయం అందుతుంది. అయితే సమస్యలు పెరిగే అవకాశముంది. కుటుంబ వ్యవహారంలో ఇబ్బందులు ఉండొచ్చు. వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశముంది. బుద్ధి బలంతో వ్యవహరిస్తారు.
కర్కాటక రాశి (Cancer)
పనులకు ఆటంకాలు ఏర్పడే అవకాశముంది. స్నేహితులతో విభేదాలు రావచ్చు. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు గురి చేయొచ్చు. భవిష్యత్ గురించి ఆలోచించే అవకాశాలున్నాయి. నిరుద్యోగాలకు అవకాశాలు పెరగొచ్చు.
సింహ రాశి (Leo)
ఆర్థికంగా బలపడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులైతే ఉన్నతస్థాయి వర్గాల నుంచి మెప్పు పొందుతారు. ఉద్యోగాల విషయంలో కలిసి వస్తుంది.. ఆశించిన ఫలుతాలు దక్కుతాయి.
కన్యా రాశి (Virgo)
కొత్తగా ఏదైన పని ప్రారంభించేందుకు ఇది మంచి రోజు. ఉద్యోగులు, ఇతరులు తమ పని ద్వారా ప్రశంసలు పొందే వీలుంది. వాహనాన్ని కొనుగోలు చేసే వీలుంది. భవిష్యత్ గురించి వేసుకునే ప్రణాళికలు ఫలితాలనిస్తాయి.
తులా రాశి (Libra)
ఖర్చులు పెరిగే అవకాశముంది. అలసట పెరుగుతుంది. ప్రయాణాల పట్ల జాగ్రత్త అవసరం. పనులు పూర్తవకపోవడం, జాప్యం వల్ల ఇబ్బంది పడతారు. వ్యాపారులకు అంతగా కలిసి రాదు. విమర్శలు ఎదుర్కొవాలసి రావచ్చు.
వృశ్చిక రాశి (Scorpio)
రుణ ఒత్తిడి పెరగొచ్చు. ఉన్నతాధికారుల నుంచి మెప్పు పొందే అవకాశాలున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. వ్యవాపారులకు, నిరుద్యోగులకు కూడా గడ్డు కాలం నడుస్తోంది.
ధనుస్సు రాశి (Sagittarius)
కుటుంబ సభ్యుల సహకారాలతో అవసరాలు తీరుతాయి. పనుల్లో అటంకాలు ఎదురైనా.. పట్టుదలతో పూర్తి చేస్తారు. శ్రమ పెరుగుతుంది. వ్యాపారులకు సమస్యలు తీరే అవకాశముంది.
మకర రాశి (Capricorn)
బుద్ధి బలంతో ఫలితాలు పొందుతారు. అయితే పనులు పూర్త కావడంలో జాప్యం జరగొచ్చు. రుణాల ఒత్తిడి సమస్య ఉంది. మీ వ్యక్తిగత అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకునేందుకు ఇది సరైన సమయం.
కుంభ రాశి (Aquarius)
ఆత్మీయులతో ఈ రోజు ఎక్కువ సేపు గడపొచ్చు. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే జాప్యం చేయడం మంచిది కాదు. నిరుద్యోగులకు అవకాశాలు పెరగొచ్చు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణ నెలకొంటుంది.
మీన రాశి (Pices)
ఏదైనా పనిలో ఫలితాన్ని సాధించేందుకు శ్రమ పెరుగుతుంది. ఒత్తిడి కారణంగా సరైన విధంగా ఆలోచించలేకపోతారు. బాగా తెలిసిన వారితో విభేదాలు రావచ్చు జాగ్రత్త. నిరుద్యోగులకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి