Horoscope Today  April 29 2022:  నేటి రాశి ఫలాలను గమనిస్తే... కొన్ని రాశుల వారికి చంద్ర అనుగ్రహం లభిస్తుంది. మరికొన్ని రాశుల వారిపై చంద్రుడి నెగటివ్ ప్రభావం వెంటాడుతుంది. చంద్రుడి అనుగ్రహం ఉన్నవారు ఏ పనుల్లోనైనా దూసుకెళ్తారు. నెగటివ్ ప్రభావం ఉన్నవారికి నిరాశజనకంగా గడుస్తుంది. ఇవాళ్టి రాశి ఫలాల్లో ఏయే రాశులకు ఎలాంటి ఫలితాలున్నాయో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మేషరాశి ( Aries)


చంద్రుడి అనుగ్రహంతో రోజంతా ఆశాజనకంగా సాగుతుంది. కుటుంబ జీవితంతో పాటు వృత్తిపరమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మర్యాదగా వ్యవహరిస్తారు. కొత్త ఆదాయ మార్గాలు ఆర్థిక పురోగతికి దోహదపడుతాయి. మీ బిజినెస్ ఆఫీస్ లేదా ఇంటి పునర్నిర్మాణం చేపడుతారు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు మీకు అన్నివేళలా సహాయ, సహకారాలు అందిస్తారు. 


వృషభ రాశి (Taurus)


చంద్రుడి అనుగ్రహంతో పాజిటివ్ ఫలితాలు పొందుతారు. వృత్తిపరంగా మీరు చేపట్టిన పనిని ఆస్వాదిస్తారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. సామాజికంగా మీ పలుకుబడి పెరుగుతుంది. అధిక పని భారం మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. తల్లిదండ్రుల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నయమవుతాయి. కుటుంబంలో అందరి ఆరోగ్యం బాగుంటుంది. 


మిథున రాశి (GEMINI)


చంద్రుడి అనుగ్రహం పొదుతారు. చేపట్టిన పనిలో సంతృప్తిని పొందుతారు. వృత్తిపరంగా అనుకోని ప్రయాణాలు చేస్తారు. మనశ్శాంతి కోసం పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పెద్దలు మీకు సరైన మార్గం చూపిస్తారు. లక్ష్య సాధనలో పెద్దల సలహాలు, సూచనలు కలిసొస్తాయి. అనుకోని వ్యక్తితో పరిచయం ఉద్యోగ లేదా వ్యాపార పరంగా కలిసొస్తుంది. 


కర్కాటక రాశి (Cancer) 


ఇవాళ చంద్రుడి నెగటివ్ ప్రభావం మిమ్మల్ని వెంటాడుతుంది. రోజంతా మూడీగా, నిరాశజనకంగా గడుపుతారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే... ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. చాలాకాలంగా మీకు రావాల్సిన బకాయి సొమ్ము ఎట్టకేలకు అందుతుంది. ఇందుకోసం మీరు ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు చదువుపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. 


సింహ రాశి (LEO)


ఇవాళ ఉద్యోగ, వ్యాపార రీత్యా అన్నివిధాలా కలిసొస్తుంది. పెట్టుబడులు లాభాలను తీసుకొస్తాయి. వ్యాపార విస్తృతికి ప్రయత్నాలు చేస్తారు. ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో ఆచీ తూచీ వ్యవహరించండి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి నిన్నటిదాకా వెంటాడిన టెన్షన్స్ తొలగిపోతాయి. వర్క్ ప్రమోషన్ దక్కుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. 


కన్య రాశి (Virgo)


ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు తోడవుతాయి. లేదా అదనపు బాధ్యతలతో పని భారం పెరగవచ్చు. చేపట్టిన పనిని సకాలంలో పూర్తి చేసేందుకు శాయా శక్తుల కష్టపడుతారు. మీ టీమ్‌ను ముందుండి నడిపించడమే కాదు పని భారాన్ని మీపై వేసుకుంటారు. అయితే అన్నిసార్లు మీ పనికి తగిన ఫలితం దక్కకపోవచ్చు. ఉద్యోగాన్ని వీడే ఆలోచన కూడా చేస్తారు. అయితే ఓపికతో వ్యవహరిస్తే అంతా మేలే జరుగుతుందని నమ్ముతారు. 


తులా రాశి (Libra)


ఇవాళ మీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. ఎప్పుడూ కొత్తగా ఏదైనా తెలుసుకోవాలనే కుతుహలంతో ఉంటారు. క్షణికావేశాన్ని నియంత్రించుకోగలరు. తద్వారా మీరు చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు సాగుతాయి. స్థిరాస్తి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రేమికులు సంతోష సమయం గడుపుతారు. 


వృశ్చిక రాశి (Scorpio)


ఉద్యోగ రీత్యా మీరు చేపట్టిన ప్రాజెక్టును హడావుడిగా చేస్తారు. దాంతో కొన్ని చిన్న చిన్న తప్పులు దొర్లుతాయి. మీ పని సామర్థ్యం కూడా తగ్గుతుంది. అది మీ డైలీ వర్క్‌పై ప్రభావం చూపుతుంది. చేపట్టిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తవక ఆలస్యమవుతాయి. ముఖ్య విషయాల్లో సొంత నిర్ణయాలకు బదులు కుటుంబ సభ్యులు, పెద్దల నుంచి సలహాలు, సూచనలు కోరండి. 


ధనుస్సు రాశి (Sagittarius)  


మీ తోబుట్టువుల నుంచి శుభవార్త వింటారు. చంద్రుడి అనుగ్రహంతో శుభం కలుగుతుంది. ఫ్యామిలీ లేదా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో ఎక్కువ సమయం గడుపుతారు. మీ ఇంటిని లేదా కార్యాలయాన్ని సృజనాత్మకంగా పునర్నిర్మిస్తారు. లేదా మరమత్తులు చేపడుతారు. మీరు చేపట్టే పనులకు స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు లభిస్తాయి. 


మకర రాశి (Capricorn) 


ఇవాళ మిమ్మల్ని నెగటివిటీ వెంటాడుతుంది. దాంతో చేపట్టిన పనులు పూర్తి చేయలేకపోతారు. మూడ్ స్వింగ్స్ కారణంగా ఏ పనిలోనూ ముందుకు సాగలేరు. ఒకరకంగా మీ ఓపికకు ఇది పరీక్షా కాలం. చిన్న చిన్న తప్పిదాలు మిమ్మల్ని మరింత గందరగోళపరుస్తాయి. ప్రేమికులు తమ భావోద్వేగాలను నియంత్రించుకోలేక గందరగోళంలో పడుతారు. అతిగా ఆశించడం కూడా కొన్నిసార్లు మిమ్మల్ని నిరాశకు గురిచేయొచ్చు. 


కుంభ రాశి (Aquarius)


మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వృత్తిపరంగా మీ కొలిగ్స్ సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు తోబుట్టువుల సాయంతో కొత్త వెంచర్స్ మొదలుపెడుతారు. అవి వ్యాపార పురోగతికి దోహదపడుతాయి. తగినంత విశ్రాంతి అవసరం. లేదంటే మీ ఉత్సాహం నీరుగారిపోతుంది. అనుకున్న పనులు చేపట్టలేకపోతారు.


మీన రాశి (Pisces) 


ఇవాళ మీకు అంతగా కలిసిరాకపోవచ్చు. మీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుంటారు. అనవసర వాటిపై ఎక్కువగా ఖర్చు చేస్తారు. ప్రత్యర్థులపై ఓ కన్నేసి ఉంచాలి. లేదంటే వారి కుట్రలకు బాధితులుగా మిగిలిపోతారు. స్థిరాస్తి పెట్టుబడులకు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్‌ను క్షుణ్ణంగా చూసుకోండి. వీలైతే మీ సన్నిహితుల సలహా కోరండి. 


Also Read: Acharya Live Updates: ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి 'ఆచార్య'... సినిమాపై లైవ్ అప్‌డేట్స్...


Also Read: Acharya Movie Review: ఆచార్య సినిమా హిట్టేనా..రివ్యూల్లో రేటింగ్ ఎంత..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.