Horoscope Today 07 July 2021: మేష రాశి
ఈ రాశివారికి నేడు డబ్బు కీలకంగా మారుతుంది. మీతో ఎక్కువ నగదు లేదని గుర్తించి, నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల మధ్య తగాదా వంటి సమస్యలు మీ సమయాన్ని వృథా చేయనున్నాయి.   సమస్యలను పరిష్కరించే సమయం తక్కువగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారులకు సాధరణ ఫలితాలు వస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభ రాశి
ప్రతి విషయాన్ని వేగంగా వేగంగా పూర్తి చేయాలని భావించడం ద్వారా అనుకోని సమస్యలు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గత కొన్ని రోజులుగా తీరిక లేకుండా పని చేస్తున్న కారణంగా మీకు పని నుంచి కాస్త విరామం అవసరం. వివాహిత జంటలు తమకు కొత్త ఇల్లు కోసం అన్వేషిస్తారు. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఆశించిన ఫలితాలు వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 


Also Read: Sai Baba madhyana aarati lyrics: షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి తెలుగు లిరిక్స్


మిథున రాశి
ఈ రోజు మీ కుటుంబం కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. మరోవైపు మీ పని ఒత్తిడితో కూడుకున్నది. అయినా ఓపికగా వ్యవహరిస్తారు. ఆఫీసులో మీ సహోద్యోగులు మీ అభిప్రాయాలను అర్థం చేసుకోకపోవచ్చు. మీ పిల్లలు ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు. తల్లిదండ్రుల అనారోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. 


కర్కాటక రాశి 
మీ చేతిలో చాలా బాధ్యతలు ఉన్నందున ఈ రోజు చాలా ఆతురతగా వాటిని పూర్తి చేయాలని భావిస్తారు. డబ్బుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే ఈ రోజు పరిష్కారం దొరుకుతుంది. ఇంట్లో ఒకరిని అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.


సింహ రాశి
మీరు సృజనాత్మక విషయాలలో విజయాన్ని అందుకుంటారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుని కెరీర్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం స్నేహంగా మారుతుంది. విద్యార్థులు తమ అధ్యయనాలకు పూర్తి సమయాన్ని కేటాయిస్తారు. నేడు మీకు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.


Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే


కన్య రాశి
అధిక పని, ఒత్తిడి కారణంగా మీరు మానసికంగా అలసిపోతారు. డబ్బు విషయంలో మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. మానసిక ప్రశాంతత కోసం నేడు కొంత సమయం ధ్యానం చేయడం శ్రేయస్కరం. ప్రయాణాలకు దూరంగా ఉండే మీ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వ్యక్తి అవుతారు. వ్యాపారులకు ఇటీవల చేసిన పెట్టుబడులకు లాభాలు వస్తాయి.


తులా రాశి
కొంతకాలం కిందట వాయిదా వేసిన ఏవైనా ప్రాజెక్టులు తిరిగి ప్రారంభిస్తారు. ఇంట్లో మీరు మీ తల్లిదండ్రులతో, పిల్లలలో సరదాగా సమయాన్ని గడుపుతారు. మీ మనస్సును శాంతపరచడానికి సంగీతం లాంటివి దోహదం చేస్తాయి. కెరీర్ మారాలని భావిస్తే అందుకు ఇది తగిన సమయం.


వృశ్చిక రాశి 
పనికి సంబంధించి అయినప్పటికీ కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఫలితాన్నిస్తుంది.  మీ తోబుట్టువులతో సమావేశం అందర్నీ దగ్గర చేసి మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.


Also Read: Jyeshtha Purnima 2021 puja, remedies: జ్యేష్య పూర్ణిమ నాడు ఈ పూజ చేస్తే వ్యాపారంలో లాభాలు


ధనుస్సు రాశి
అలసట కారణంగా ఈ రోజు కొద్దిగా బద్ధకంగా అనిపిస్తుంది. మీరు మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. వ్యక్తిగత జీవితానికి అధిక సమయాన్ని కేటాయించాలని భావిస్తారు. మీరు స్టాక్స్‌, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే నేడు తగిన సమయం. ఓ గండం నుంచి గట్టెక్కుతారు. కొన్ని కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. 


మకర రాశి
మీరు చాలా నిర్భయంగా మరియు ధైర్యంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీ ఇంటిని రీడిజైన్ చేయాలని లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని ఆలోచిస్తారు. పిల్లల చదువు అంశం ఇంట్లో చర్చనీయాంశంగా మారుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.


కుంభ రాశి
కొంచెం శ్రమించినా అనుకున్న ఫలితాలు అందుకుంటారు. ఊహించని వ్యక్తులు మీకు తారసపడతారు. ఉద్యోగార్ధులు వారికి సరిగ్గా సరిపోయే కెరీర్‌ను ఎంచుకుంటారు. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. అవసరం ఉంటేనే నగదు ఖర్చు చేస్తే భవిష్యత్‌లో సమస్యలు ఉత్పన్నం కావు.


మీన రాశి
చాలా సమయం పరధ్యానంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ రోజు పని నుండి కాస్త విరామం తీసుకుని కుటుంబంతో సరదాగా గడపాలని భావిస్తారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తిచేస్తారు. చాలా కాలం తరువాత చిన్ననాటి మిత్రులు మిమ్మల్ని కలుసుకుంటారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook