Horoscope Today January 19 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొంత ఇబ్బందులు, చికాకులు వెంటాడుతాయి. కొన్ని రాశుల వారు మొండితనం, దూకుడుగా ముందుకెళ్లే మనస్తత్వం విడనాడాలి. అలా అయితేనే అనుకున్న పనుల్లో వేగం, ఫలితం ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం :  వ్యాపార ప్రయోజనాల కోసం ఇవాళ మీరు చేసే ప్రయాణాలు చాలావరకు కలిసొస్తాయి. కుటుంబ సమేతంగా విహారయాత్రకు ఇది మంచి రోజు. వ్యక్తిగత లేదా వృత్తిపరమైన విషయాల్లో కాస్త ఎక్కువ తీసుకోకుండా జాగ్రత్త వహించండి. లక్కీ కలర్: మస్టర్డ్, లక్కీ నంబర్: 3 


వృషభం : కొన్ని విషయాల్లో దూకుడుగా, దుందుడుకుగా ముందుకెళ్లాలని అనుకుంటారు. కానీ విచక్షణ ముఖ్యమని గుర్తించండి. దూకుడు కాస్త తగ్గించి ప్రణాళికబద్దంగా ముందుకెళ్లండి. చాలాకాలంగా వాయిదా వేస్తున్న టూర్ ప్లాన్స్‌ మళ్లీ రూపుదిద్దుకునే అవకాశం ఉంటుంది. లక్కీ కలర్ : మెరూన్, లక్కీ నంబర్ : 1


మిథునం : ప్రేమ జీవితం బాగుంటుంది. కొన్ని సమస్యల నుంచి తప్పించుకుని తిరిగే మనస్తత్వం మంచిది కాదు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. లక్కీ కలర్ : యెల్లో, లక్కీ నంబర్ : 2


కర్కాటకం :  మానసిక ప్రశాంతత దూరమవుతుంది. మీరు చేసే ప్రతీ పనిలో లాభ, నష్టాలు బేరీజు వేస్తారు. కష్ట, నష్టాలకు కుంగిపోక ధైర్యంతో ముందడుగు వేయాలి. విజయం సాధిస్తామనే ఆత్మవిశ్వాసాన్ని అలవరుచుకోవాలి. మీకు ప్రియమైన వ్యక్తులతో ఇవాళ ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంది. లక్కీ కలర్ : బ్లూ, లక్కీ నంబర్ : 5


సింహం : సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయనే మనస్తత్వాన్ని విడనాడండి. సమస్య మూలాలపై మనసు పెట్టి ఆలోచించండి. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు స్వీకరించండి. సన్నిహితులు కూడా సాయం చేసేందుకు ముందుకొచ్చే అవకాశం ఉంది. లక్కీ కలర్ : బూడిద, లక్కీ నంబర్ : 6


కన్య : వృత్తిపరమైన విషయాల్లో మీ పై అధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా గడిపేందుకు ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు మీకు అన్ని విధాలా సహకరిస్తారు. కొన్ని అనవసర సమస్యల్లోకి లాగబడటం మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది. లక్కీ కలర్ : మ్యాంగో, లక్కీ నంబర్: 8


తుల : మిమ్మల్ని వేధిస్తున్న ఒక సమస్యకు ఇవాళ పరిష్కారం దొరికే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో మీ తెలివి తేటల కంటే మీ వ్యక్తిగత ఇమేజ్ ప్రభావవంతంగా పనిచేయవచ్చు. కొన్ని విషయాల్లో ఆచీ తూచీ నిర్ణయాలు అవసరం. లక్కీ కలర్ : పీచ్, లక్కీ నంబర్ : 1


వృశ్చికం: మొండితనం పనికిరాదు. మొండితనంతో ముందుకెళ్లడం ద్వారా కొన్ని సమస్యలు మరింత జటిలమవుతాయి. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఒత్తిళ్లు పెరుగుతాయి. ఓపెన్ మైండ్‌తో నిర్ణయాలు తీసుకోవాలి. గతంలో జరిగిన వాటిని తలచుకుని బాధపడవద్దు. భవిష్యత్ మీదే అనే నమ్మకంతో ముందుకు సాగాలి. లక్కీ కలర్ : స్కార్లెట్, లక్కీ నంబర్: 9


ధనుస్సు : లిటిగేషన్ వ్యవహారాల్లో చాకచక్యంగా వ్యవహరించాలి. మీకన్నా మెరుగ్గా వాటిని డీల్ చేయగలిగే వ్యక్తులకు ఆ బాధ్యత అప్పగించాలి. ఇతరులను తక్కువ అంచనా వేసే చులకన మనస్తత్వం విడనాడాలి. లక్కీ కలర్ : కాషాయం, లక్కీ నంబర్ : 7


మకరం : కొన్ని విషయాల్లో మనసు పెట్టి ఆలోచించాలి. ఎక్కువ భావోద్వేగానికి లోను కావొద్దు. కొన్ని విషయాల్లో నిష్పక్షపాతంగా లేకపోవడం మీకు మైనస్‌గా మారుతుంది. లక్కీ కలర్: ఆలివ్ గ్రీన్, లక్కీ నంబర్ : 8


కుంభం : కొంత ఒంటరితనంతో బాధపడుతుంటారు. మానసికంగా ఒంటరి అయిపోయామన్న భావన వెంటాడుతుంది. మీ భాగస్వామి ఇచ్చే సలహాలు, సూచనలు కొన్ని విషయాల్లో మంచి ఫలితాలను ఇవ్వొచ్చు. లక్కీ కలర్: గోల్డ్, లక్కీ నంబర్: 6 


మీనం : కుటుంబ సభ్యులు, పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. కొంతమంది సన్నిహితులు మీకు తప్పుడు విషయాలు చెప్పి పక్కదోవ పట్టించవచ్చు. అలాంటి వారి పట్ల జాగ్రత్త అవసరం. లక్కీ కలర్ :బ్లూ-గ్రీన్, లక్కీ నంబర్: 8


Also Read: Bangarraju Blockbuster Meet : సీఎం జగన్‌ భేటీ గురించి చిరంజీవి.. నాగార్జునకు చెప్పిన విషయం రివీల్‌


Also Read : Payal Rajput Photos: బుల్లిగౌనులో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook