Horoscope Today July 12th 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవాళ మేష, సింహ, ధనుస్సు రాశి వారిని నెగటివిటీ వెంటాడుతుంది. చేపట్టిన పనులపై ఏకాగ్రత కుదరక ఇబ్బందిపడుతారు. ప్రతికూల సమయంలో ఏదీ కలిసిరాకపోవచ్చు. కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నేటి రాశి ఫలాల ప్రకారం ఏయే రాశుల జాతకం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి (Aries)


ఇవాళంతా  మీ చుట్టూ నెగటివిటీ ఆవహిస్తుంది. ఇది మిమ్మల్ని అసంతృప్తిలో ముంచెత్తుతుంది. మీ స్నేహితులు కూడా మీకు సహకరించరు. ఈ సమయంలో మీరు ఎవరి నుంచి ఎక్కువగా ఆశించవద్దు. ఏ విషయంలోనైనా సొంత నిర్ణయాలకు ప్రాధాన్యమివ్వండి. పెట్టుబడులకు ఇది ప్రతికూల సమయం.


వృషభ రాశి (Taurus)


ఇవాళ మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రత్యర్థులు లేదా శత్రువులపై పైచేయి సాధించే స్థానంలో ఉంటారు. లక్ష్యంపై ఏకాగ్రత పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆఫీసులోనైనా, మరేచోటైనా అనవసర విషయాలపై వాదనలకు దిగవద్దు. ఇది మీ కుటుంబ జీవితంపై కూడా ప్రభావం చూపుతుంది.


మిథున రాశి (GEMINI)


మిథున రాశిలో రెండు గ్రహాల కలయిక ఈ రాశి వారికి విశేషంగా కలిసొస్తుంది. మీ చుట్టూ  పాజిటివ్ ఎనర్జీ సంతరించుకుంటుంది. కుటుంబంలో, సమాజంలో మీ పట్ల గౌరవం, మర్యాద పెరుగుతుంది. మేదోపరమైన అంశాల అధ్యయనానికి ఎక్కువ సమయం వెచ్చిస్తారు. ఉన్నత విద్యకు ప్లాన్ చేస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం.


కర్కాటక రాశి (Cancer) 


కుటుంబం, స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెడుతారు. దీర్ఘకాలంలో అవి మంచి లాభాలు తీసుకొస్తాయి. ఆర్థిక పురోగతి పెరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. కొత్త ఆదాయ మార్గాలకు అవకాశం ఉంటుంది. ఆపదలో ఉన్నవారు మీ సాయం కోరవచ్చు.


సింహ రాశి (LEO)


ఇవాళ ఏ పనిపై ఏకాగ్రత కుదరదు. నిరాశ ఆవహిస్తుంది. అది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ప్రతీ పనిలో మీ అంతరంగాన్ని ఫాలో అవండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. తిండి విషయంలో జాగ్రత్త పాటించకపోతే పొట్ట సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు. ఇది అన్నివిధాలా మీకు చేటు చేస్తుంది.


కన్య రాశి (Virgo)


విధి మీకు అనుకూలంగా ఉంది. పెండింగ్ ప్రాజెక్టులు మళ్లీ మొదలుపెడుతారు. పెద్దల ఆశీస్సులతో గందరగోళ పరిస్థితులకు తెరపడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. మీలో సృజనాత్మక వికసిస్తుంది. గ్లామర్ రంగంలో ఉన్నవారికి అనుకూల సమయం.


తులా రాశి (Libra)


వ్యాపార రంగంలోని వారికి లాభాల పంట పండుతుంది. తక్కువ కష్టంతో ఎక్కువ లాభం పొందుతారు. నష్టాలు కూడా లాభాలుగా మారుతాయి. మీ తెలివితేటలు వ్యాపారానికి ఊపు తెస్తాయి. విద్యార్థులు ఉన్నత విద్య కోసం ప్లాన్ చేసుకుంటారు. మతపరమైన లేదా సేవాపరమైన కార్యక్రమాలకు తోచిన సాయం చేస్తారు. మేదోపరమైన  పెట్టుబడులపై ఆలోచిస్తారు.


వృశ్చిక రాశి (Scorpio)


ఇవాళంతా సంతోషంగా గడుస్తుంది. ఆరోగ్యపరమైన సమస్యలు సర్దుకుంటాయి. దీర్ఘకాలిక వ్యాధి నయమవుతుంది. ర్యాష్ డ్రైవింగ్ చేయవద్దు. బిజినెస్ పార్ట్‌నర్‌తో వివాదాలు మంచివి కాదు. పెట్టుబడుల ప్రణాళికను వాయిదా వేసుకుంటే మంచిది. పెద్దల ఆశీస్సులు తీసుకుంటే కొన్ని పనుల్లో కలిసొస్తుంది. పనికొచ్చే విషయాల పైనే శ్రద్ధ అవసరం.


ధనుస్సు రాశి (Sagittarius)  


ఇవాళ మీ జాతకంలో చంద్రుడి స్థానం సరిగా లేదు. అది మీపై  నెగటివ్ ప్రభావం చూపుతుంది. ఆరోగ్యం ఇబ్బందిపెడుతుంది. పెట్టుబడులు నష్టాలు తీసుకొస్తాయి. ఇదివరకు వచ్చిన లాభాలు కూడా నష్టాల తాకిడికి మాయమవుతాయి. పనికిరాని వాటిపై పెట్టుబడులు పెట్టవద్దు. వివాదాస్పద ఆస్తులపై పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది.


మకర రాశి (Capricorn) 


చంద్ర అనుగ్రహంతో వాయిదాపడ్డ పనులు మళ్లీ ప్రారంభిస్తారు. సకాలంలో వాటిని పూర్తి చేయగలుగుతారు. గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడి కెరీర్‌పై దృష్టి సారిస్తారు. కుటుంబ జీవితం బాగుంటుంది. మీలోని క్రియేటివిటీ వెల్లివిరుస్తుంది. సినిమాలు, గ్లామర్ మిమ్మల్ని ఆకర్షిస్తాయి.


కుంభ రాశి (Aquarius)


ఇవాళ మీకు శుభ దినం. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వారు బాగా రాణిస్తారు. మీ బాస్ మీకు సపోర్టివ్‌గా ఉంటారు. ఉద్యోగ ప్రమోషన్‌కి అవకాశం ఉంటుంది. అదే సమయంలో అదనపు బాధ్యతలు వచ్చి పడుతాయి. మతపరమైన స్థలాలను సందర్శిస్తారు. ప్రేమ జీవితంలో అహంకార వైఖరి మంచిది కాదు.


మీన రాశి (Pisces) 


చంద్ర అనుగ్రహం ఉంటుంది. అవివాహితులైనవారికి మంచి పెళ్లి సంబంధం వస్తుంది. వృత్తిపరంగా బాగా రాణిస్తారు. స్నేహితులు, సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. మీ కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
 


Also Read: Revanth Reddy on CM Kcr: ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని రా..చూసుకుందాం..కేసీఆర్‌కు రేవంత్‌ సవాల్..!


Also Read: Telangana Eamcet-2022: 14 నుంచి ఎంసెట్ పరీక్ష యధాతథం..ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన..!



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook