Revanth Reddy on CM Kcr: ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని రా..చూసుకుందాం..కేసీఆర్‌కు రేవంత్‌ సవాల్..!

Revanth Reddy on CM Kcr: తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. నిన్న సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలన్నీ ఫైర్ అవుతున్నాయి. తాజాగా సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 

Written by - Alla Swamy | Last Updated : Jul 11, 2022, 08:42 PM IST
  • తెలంగాణలో రాజకీయ వేడి
  • విపక్షాలపై సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
  • కౌంటర్ ఇచ్చిన రేవంత్‌
Revanth Reddy on CM Kcr: ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని రా..చూసుకుందాం..కేసీఆర్‌కు రేవంత్‌ సవాల్..!

Revanth Reddy on CM Kcr: నాలుగు రోజుల్లో ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎన్నికలకు రావాలని సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. టీఆర్ఎస్, కేసీఆర్‌ను వదిలించుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ నేతల పేర్లు పలికేందుకు ఆయన భయపడుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు టీఆర్ఎస్ వ్యూహాకర్త రిపోర్ట్ ఇచ్చారని గుర్తు చేశారు.

ఇందులో టీఆర్ఎస్‌, కేసీఆర్ గ్రాఫ్‌ పడుతోందని నివేదిక వచ్చిందని తెలిపారు. టీఆర్ఎస్‌కు 25 సీట్లు వస్తాయని..మరో 17 సీట్లలో పోటా పోటీ ఉంటుందని..కాంగ్రెస్‌కు 32 స్థానాల్లో గెలుస్తుందని..మరో 23 సీట్లలో ఉత్కంఠ పోరు ఉంటుందని నివేదికలో తేలిందన్నారు. క్రమంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్న విషయం సీఎం కేసీఆర్‌కు తెలుసని రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌కు 90 లక్షల ఓట్లకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా తన పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు. 

ఆగస్టు 2న సిరిసిల్లలో నిరుద్యోగ డిక్లరేషన్‌ సభ ఉంటుందన్నారు. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. వరంగల్ డిక్లరేషన్ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతు పెరుగుతోంది..ప్రస్తుతం 3 శాతం ఓట్లు పెరిగాయని గుర్తు చేశారు. సిరిసిల్ల సభను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 

Also read:AP Govt: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్..జగనన్న విదేశీ విద్యా దీవెన మార్గదర్శకాలు ఇవే..!

Also read:TTD: తిరుమలలో ఎప్పటిలాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు..టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవిగో..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News