Horoscope Today July 27th : నేటి రాశి ఫలాలు.. ఈ రెండు రాశుల వారు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి...
ఇవాళ బుధవారం. గ్రహాలపరంగా బుధ గ్రహానికి, దైవపరంగా శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన రోజు. ఈరోజున బుధ అనుగ్రహం పొందగలిగినా, శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందగలిగినా మీ జాతకం వెలిగిపోవడం ఖాయం.
Horoscope Today July 27th 2022: ఇవాళ బుధవారం. గ్రహాలపరంగా బుధ గ్రహానికి, దైవపరంగా శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన రోజు. ఈరోజున బుధ అనుగ్రహం పొందగలిగినా, శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందగలిగినా మీ జాతకం వెలిగిపోవడం ఖాయం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవాళ ఏయే రాశుల వారి జాతకం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం...
మేష రాశి (Aries)
ఇవాళ మీకు చంద్రుడితో పాటు కుజుడి అనుగ్రహం లభిస్తుంది. మీలో నూతనోత్సాహం వెల్లివిరుస్తుంది. వ్యాపారస్తులు కొత్త వెంచర్స్ ప్రారంభించే ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. వ్యాపార విస్తరణకు అన్నీ అనుకూలిస్తాయి. ఇంటితో పాటు మీ వ్యాపార సంస్థ కార్యాలయంలో రెనోవేషన్ చేపట్టే అవకాశం ఉంది. ఇంటి కోసం కొన్ని కళాకృతులు కొనుగోలు చేస్తారు.
వృషభ రాశి (Taurus)
కుటుంబ విషయాల్లో తలమునకలై ఉంటారు. ఇతర పనులను పక్కకు పెట్టేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త ఉంటుంది. పిల్లల చదువుల కోసం బాగా ఆలోచిస్తారు. వారికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే విషయంలో రాజీ పడరు. మీ చుట్టూ ఉన్నవాళ్లతో ఎప్పుడూ మర్యాదపూర్వకంగా మెలుగుతారు. అది మీ పట్ల గౌరవాన్ని పెంచుతుంది.
మిథున రాశి (GEMINI)
ఇవాళ చాలా సంతోషంగా గడుపుతారు. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఆర్థికపరమైన అంశాల్లో కీలక నిర్ణయాలను ప్రస్తుతానికి వాయిదా వేసుకోండి. జీవిత భాగస్వామి వద్ద కొన్నిసార్లు మీ అహం దెబ్బతినవచ్చు. ఇద్దరిలో ఒకరు తగ్గడంలో తప్పు లేదని గుర్తించండి.ప్రేమికులు జంటగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.
కర్కాటక రాశి (Cancer)
ఇవాళ మీకు కలిసిరాదు. ఆత్మన్యూనత భావం, అసంతృప్తి అడుగడుగునా వెంటాడుతుంది. ప్రత్యర్థులు మీపై కుట్రలు చేసే అవకాశం లేకపోలేదు. కాబట్టి ప్రత్యర్థి కదలికలపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. ఎదుటివారితో కటువుగా మాట్లాడవద్దు. మీ మాట తీరు మిమ్మల్ని లేనిపోని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పెట్టుబడుల ఆలోచన విరమించుకోవడం ఉత్తమం.
సింహ రాశి (LEO)
ఇవాళ మీరు చాలా సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలోకి కొత్త పార్ట్‌నర్స్ వస్తారు. అది మీ వ్యాపార విస్తరణకు దోహదపడుతుంది. పని పట్ల మీ అంకితభావానికి సీనియర్ల నుంచి ప్రశంసలు దక్కుతాయి. ప్రస్తుతం చేస్తున్న జాబ్‌లో ప్రమోషన్ పొందుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగ ప్రయ్నాల్లో ఉన్నవారికి మంచి జాబ్ దొరికే అవకాశం ఉంది. అవివాహితులైన సింగిల్స్‌కి బంధువుల ద్వారా మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంది.
కన్య రాశి (Virgo)
పనిలో బిజీ బిజీగా గడుపుతారు. పని పట్ల మీ ఏకాగ్రత చాలాసార్లు పరీక్షకు గురవుతుంది. ఓపికగా ముందుకెళ్లి చేపట్టిన పనులను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది.ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. ఉన్న డబ్బును స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టడంతో క్లిష్ఠ సమయాల్లో చేతిలో డబ్బు ఉండదు.
తులా రాశి (Libra)
ఇవాళ మీరు చేపట్టే పనులన్నీ సులువుగా పూర్తిచేస్తారు. మతపరమైన లేదా సేవాపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. తద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు. అనుకోకుండా కొంతమంది మేదావులతో మాట్లాడుతారు. అది మీ ఆలోచనలపై ప్రభావంచూపుతుంది. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. ప్రేమ జంట పెళ్లి విషయంలో నిర్ణయానికి సిద్ధపడుతారు.
వృశ్చిక రాశి (Scorpio)
ఇవాళ మీలో నిరుత్సాహం ఆవహిస్తుంది. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగంలో ఉన్నవారు సీనియర్లతో చీటికి మాటికి పేచీలకు దిగవద్దు. అనవసర విషయాలపై చర్చలు చేసి లేనిపోని వివాదాలు తెచ్చుకోవద్దు. ప్రేమికులు కూడా అర్థం పర్థం లేని విషయాలపై చర్చించి గ్యాప్ పెంచుకోవద్దు. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఇవాళ కాస్త మెరుగ్గానే ఉంటుంది.
ధనుస్సు రాశి (Sagittarius)
ఫ్యామిలీ టైమ్‌ను ఎంజాయ్ చేస్తారు. కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతారు. జీవిత భాగస్వామితో రొమాంటిక్‌గా ఉంటారు. ఇరువురి మధ్య బంధం మరింత బలపడుతుంది. అద్దె ఇంట్లో ఉంటున్నవారు సొంతింటి కోసం ప్లాన్ చేస్తారు. లేదా వాహన కొనుగోలుకు సిద్ధపడుతారు. ఏ పనిచేసినా ఆచీ తూచీ వ్యవహరించాల్సి ఉంటుంది.
మకర రాశి (Capricorn)
ఇవాళ మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఎనర్జిటిక్‌గా కనిపిస్తారు. మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకుని లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. సవాళ్లను స్వీకరించే మనస్తత్వం కలిగి ఉంటారు. అది మిమ్మల్ని భయం లేని వ్యక్తిగా, ఛరిష్మా ఉన్న వ్యక్తిగా ఇతరులు గుర్తించేలా చేస్తుంది. బిజినెస్ పరంగా ఓపికతో కూడిన నిర్ణయాలు అవసరం. తొందరపాటు నిర్ణయాలతో చిక్కుల్లో పడుతారు.
కుంభ రాశి (Aquarius)
ఇవాళ మీకు చాలా శుభదినం. మీలో ఉత్సాహం పీక్స్‌లో ఉంటుంది. అది అత్యుత్సాహంగా మారకుండా చూసుకోవాలి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్‌తో చాలా సమస్యలను అధిగమిస్తారు. పెట్టుబడులు పెట్టేవారు ఊహాజనిత ప్రచారాలను నమ్మి మోసపోవద్దు. స్వయంగా ఫీల్డ్‌లోకి వెళ్లి అన్ని వివరాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాకే ముందడుగు వేయాలి.
మీన రాశి (Pisces)
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ జీవితం కూడా ఇబ్బందులకు గురవుతుంది. జీవితభాగస్వామి వద్ద అహంకారపూరిత ధోరణితో వ్యవహరించవద్దు. అలా వ్యవహరించినట్లయితే వైవాహిక బంధం చిక్కుల్లో పడుతుంది. ఎమోషనల్ బాండింగ్ దెబ్బతింటుంది. పెళ్లి విషయంలో అవివాహితులు ఇప్పుడు కాస్త తొందరపడాలి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచిది.
(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)
Also Read: Ranveer Singh Viral Video: పాపం బట్టల్లేవు.. దానం చేయండయ్యా!
Also Read: Empty Stomache Foods: పరగడుపున తింటే అనారోగ్య సమస్యలు తప్పవు..తస్మాత్ జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.