Empty Stomache Foods: పరగడుపున తింటే అనారోగ్య సమస్యలు తప్పవు..తస్మాత్ జాగ్రత్త

Empty Stomache Foods: ఆయుర్వేదం ప్రకారం చాలా రకాల అనారోగ్య సమస్యలకు పాటించే చిట్కాలు పరగడుపునే ఉంటాయి. కానీ కొన్ని రకాల ఆహార పదార్ధాలు పరగడుపున తీసుకోకూడదట. తీసుకుంటే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 26, 2022, 11:25 PM IST
Empty Stomache Foods: పరగడుపున తింటే అనారోగ్య సమస్యలు తప్పవు..తస్మాత్ జాగ్రత్త

Empty Stomache Foods: ఆయుర్వేదం ప్రకారం చాలా రకాల అనారోగ్య సమస్యలకు పాటించే చిట్కాలు పరగడుపునే ఉంటాయి. కానీ కొన్ని రకాల ఆహార పదార్ధాలు పరగడుపున తీసుకోకూడదట. తీసుకుంటే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.

మనం తినే ఆహార పదార్ధాలు లేదా తీసుకునే ద్రవ పదార్ధాలు ఆరోగ్యంపై పూర్తి ప్రభావాన్ని చూపిస్తుంటాయి. వైద్య నిపుణుల ప్రకారం కొన్ని రకాల ఆహార పదార్ధాల్ని తీసుకోకూడదు. ఎందుకంటే అలా చేస్తే ఆరోగ్యం పూర్తిగా పాడవుతుంది. ఎందుకంటే ఉదయం వేళ కడుపు ఖాళీగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం తిన్నా అది నేరుగా కడుపులోపలి భాగాలపై ప్రభావం పడుతుంది. ఫలితంగా కడుపులో మంట, కడుపు నొప్పి, ఛాతీలో మంట, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయం వేళ పరగడుపున ఏయే పదార్ధాలు తినకూడదో తెలుసుకుందాం.

ముఖ్యంగా పరగడుపున ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా ప్రమాదకరం. ఇది నేరుగా మీ లివర్‌పై ప్రభావం చూపిస్తుంది. మీ రక్తంలో ఆల్కహాల్ వేగంగా వ్యాపిస్తుంది. పైన సూచించినవన్నీ కేవలం సురక్షితంగా ఉండేందుకు మాత్రమే. 

ఉదయం వేళల్లో మసాలా లేదా ఫ్లైడ్ పదార్ధాలు తినకూడదు. దీంతో కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా కడుపు లేదా ఛాతీ బరువుగా అన్పించి ఇబ్బంది కలుగుతుంది. ఫైబర్ పదార్ధాలు కడుపుకి మంచివే. కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం నష్టం చేకూరుస్తాయి. ఫలితంగా కడుపులో నొప్పి, కడుపు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పరిమిత మోతాదులోనే ఫైబర్ పదార్ధాలు తీసుకోవాలి.

కొంతమంది ఉదయం వేళ అంటే పరగడుపున కాఫీ లేదా టీ తాగుతుంటారు. కానీ దీనివల్ల శరీరానికి నష్టం కలుగుతుంది. ఛాతీలో మంట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయం పరగడుపున నీళ్లు తాగడం చాలా మంచిది. కానీ చల్లని నీల్లు అస్సలు తాగకూడదు. దీనివల్ల జీర్ణ సమస్యలు ఎదురై..ఏం తిన్నా సరే కడుపులో అజీర్ణం మొదలవుతుంది.

Also read: Skin care tips: వర్షాకాలంలో చర్మవ్యాధులతో తస్మాత్ జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News