Horoscope Today July 28th 2022: ఇవాళ గురువారం. శ్రీమహా విష్ణువుకు అంకితం చేయబడిన రోజు. హిందువులు భక్తి శ్రద్ధలతో విష్ణువును కొలుస్తారు. లక్ష్మీ సమేతంగా విష్ణువును ఆరాధించడం మంచి ఫలితాలనిస్తుంది. మరి ఈ గురువారం ఏయే రాశుల వారి జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి (Aries)


వ్యాపార రీత్యా అనుకోని ప్రయాణాలు చేస్తారు. వ్యాపారంలో కొత్త ప్లాన్స్ అమలుకు మీ పార్ట్‌నర్స్ సహకరిస్తారు. సమీప భవిష్యత్తులో వాటి ఫలితాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులు మీతో మరింత సమయం గడపాలని కోరుకుంటారు. వ్యాపారంపై ధ్యాసతో ఆరోగ్యాన్ని కాస్త అశ్రద్ధ చేస్తారు. ఉద్యోగస్తులకు ఇవాళ అనుకూల సమయం. విద్యార్థులకు కలిసొస్తుంది.


వృషభ రాశి (Taurus)


ఇవాళ మీకు శుభదినం. ఆర్థిక పురోగతి బాగుంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలు కురిపిస్తాయి. చాలాకాలంగా మీకు రాకుండా ఉండిపోయిన బకాయి డబ్బులు వసూలవుతాయి. అప్పు తీసుకున్నవారే పువ్వుల్లో పెట్టి మరీ చెల్లిస్తారు. డబ్బు విషయంలో కఠినంగా ఉంటారు. ప్రేమికులు ఆర్థికంగా నిలదొక్కుకున్నాకే పెళ్లి ఆలోచన చేయాలనే నిర్ణయానికి వస్తారు. ఆర్థికపరమైన విషయాలు ప్రేమజంటల మధ్య మనస్పర్థలకు కారణం కావొచ్చు.


మిథున రాశి (GEMINI)


తోబుట్టువులు లేదా కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారంలో ఇవాళ బిజీ బిజీగా గడుపుతారు. అది మీకు కొత్త అనుభవాన్నిస్తుంది. చేపట్టిన ప్రతీ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. తద్వారా మీరంటే కుటుంబంలో, బంధు గణంలో మంచి నమ్మకం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.


కర్కాటక రాశి (Cancer) 


ఇవాళ మీ చుట్టూ నెగటివిటీ చేరుతుంది. నిద్రలేమితో బాధపడుతారు. ఏదేని సమస్యపై ఎక్కువగా ఆలోచించడం వల్ల కలత నిద్ర ఏర్పడుతుంది. మానసికంగా అలసిపోతారు. కొన్నిసార్లు పిరికితనం ఆవహిస్తుంది. ఆ కారణంగా చేపట్టిన పనులను కూడా వాయిదా వేస్తారు. మీరు బలహీనంగా ఉన్న క్షణంలో ప్రత్యర్థులు చెలరేగిపోతారు.


సింహ రాశి (LEO)


చంద్ర అనుగ్రహం లభిస్తుంది. వ్యాపారస్తులకు పూర్తి అనుకూల సమయం. వ్యాపారంలో పెద్ద ఆర్డర్స్ పొందుతారు. అందుకు గాను పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది. కొన్నిసార్లు తెలియని ఆందోళన మిమ్మల్ని వెంటాడవచ్చు. విద్యార్థులు చదువు పట్ల మరింత ఫోకస్ పెట్టాలి. ఇన్వెస్టర్స్‌కి దీర్ఘకాలిక పెట్టుబడులు కలిసొస్తాయి.


కన్య రాశి (Virgo)


ఆఫీసులో మీకు అప్పగించిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. అది మిమ్మల్ని విచారానికి గురిచేస్తుంది. అయితే మీ గురువులు, తల్లిదండ్రుల ఆశీస్సులతో ఒడిదుడుకులను అధిగమిస్తారు. గందరగోళ పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి. మానసిక అలసట నుంచి తేరుకుని ఉత్సాహంగా పనిచేస్తారు. ఇన్నాళ్లు దూరంగా ఉన్న తోబుట్టువులు మళ్లీ దగ్గరవుతారు.


తులా రాశి (Libra)


పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. నెగటివిటీ తొలగిపోతుంది. చేపట్టిన పనిని ఆస్వాదిస్తారు. స్థిరాస్తి వివాదాలు తొలగిపోతాయి. న్యాయపరమైన విషయాల్లో మీదే పైచేయి అవుతుంది. ప్రేమికులు రొమాంటిక్‌గా గడుపుతారు. అయితే హద్దులు మీరవద్దు. పెళ్లి విషయంలో ముందు నుంచే ఒక ఆలోచనతో, అవగాహనతో ఉంటే మంచిది.


వృశ్చిక రాశి (Scorpio)


ఇవాళ మీకు కలిసిరాకపోవచ్చు. నెగటివ్ ఆలోచనలు చుట్టుముడుతాయి. మీలో ఓపిక నశిస్తుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు దురుసుగా ప్రవర్తిస్తారు. ఎవరి సహకారం లభించదు. జీవితం ఎక్కడో ఆగిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి స్థితిలో పెద్దల ఆశీస్సులతో కొంత ఊరట పొందుతారు. డెడ్ అసెట్స్‌లో పెట్టుబడులకు దూరంగా ఉంటే మంచిది.


ధనుస్సు రాశి (Sagittarius)  


చంద్ర అనుగ్రహం కలిసొస్తుంది. వృత్తి లేదా వ్యాపార రీత్యా గుడ్ న్యూస్ వింటారు. కుటుంబ జీవితం సాఫీగా, సంతోషమయంగా ఉంటుంది. అనవసర విషయాలపై ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోవద్దు. అత్యుత్సాహం మీ సహనానికి పరీక్ష పెడుతుంది. స్థిరాస్తి పెట్టుబడులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.


మకర రాశి (Capricorn) 


ఇవాళ మీకు శుభదినం. పనిలో బాగా రాణిస్తారు. మీ బాస్ దృష్టిలో పడుతారు. మీ పనితనానికి మెచ్చుకోలు పొందుతారు. అందుకు తగినట్లుగా వేతనం కూడా పెరుగుతుంది. పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెడుతారు. మిమ్మల్ని మీరు కొత్తగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. కెరీర్ చేంజ్ ఆలోచన రావొచ్చు. విద్యార్థులకు అనుకూల సమయం.


కుంభ రాశి (Aquarius)


ఇవాళంతా బద్దకంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తారు. అది మీ జీవితభాగస్వామి లేదా పిల్లలను నిరాశకు గురిచేస్తుంది. అది మీలో మార్పు తీసుకురావొచ్చు. కుటుంబ బంధాలను అర్థం చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు. ప్రేమ జంటలు తమ ఇళ్లల్లో ప్రేమ విషయాన్ని రివీల్ చేసే అవకాశం ఉంది.


మీన రాశి (Pisces) 


మీ చుట్టూ నెగటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఏ ఆలోచనా ఆచరణకు రాకపోవచ్చు. అది మిమ్మల్ని అసంతృప్తికి గురిచేస్తుంది. అయితే స్నేహితుల సహకారం కొంత ఊరట కలిగిస్తుంది. అంతమాత్రాన అతిగా సాయం ఆశించి భంగపడవద్దు. కొన్ని విషయాల్లో మీ అంతరంగాన్ని ఫాలో అవడం బెటర్. అది సత్ఫలితాలనిస్తుంది.


(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, ఫిట్‌మెంట్‌పై త్వరలో


Also Read: Saami Saami song:సామీ సామీ అంటూ అదరకొట్టిన బామ్మ.. రష్మికకు గట్టి పోటీ ఇచ్చిందిగా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.