Horoscope Today June 11th 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఇవాళ కొన్ని రాశుల వారికి సాధారణ రోజు అని చెప్పాలి. కొన్ని రాశుల వారికి ఉదయాన్నే శుభవార్తలు అందుతాయి. రాశిచక్రంలోని రెండు రాశుల వారిని చేపట్టిన పనుల్లో ఆటంకం కారణంగా మానసిక కలవరం వెంటాడుతుంది. కొందరికి జీవిత భాగస్వాములతో మనస్పర్థలు తలెత్తవచ్చు. ఇవాళ్టి రాశి ఫలాల్లో ఏయే రాశులకు ఇంకా ఎలాంటి ఫలితాలు ఉండనున్నాయో ఇక్కడ తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 మేషరాశి ( Aries)


కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఏ పని పూర్తయినా మనసు ఆనందంగా ఉంటుంది. వ్యాపారంలో సాధారణ లాభం ఉంటుంది. ఉద్యోగంలో పురోగతి సాధ్యమవుతుంది. ఇంటికి అతిథులు వస్తూ పోతూ ఉంటారు. విద్యార్థులకు ఈరోజు శుభదినం. మీ జీవిత భాగస్వామి భావాలను జాగ్రత్తగా అర్థం చేసుకోండి.


వృషభ రాశి (Taurus)


ఏదైనా పనిలో ఆటంకం కారణంగా మానసికంగా ఆందోళన చెందుతారు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఆహారం విషయంలో శ్రద్ధ వహించండి, లేనిపక్షంలో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. విద్యాసంబంధమైన పనుల కోసం ప్రయాణం చేయాల్సి రావొచ్చు. లవ్‌మేట్‌తో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.


మిథున రాశి (GEMINI)


ఈ రోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. మీ పాత స్నేహితుడు ఒకరిని కలుస్తారు. వ్యాపార విస్తరణకు ఈరోజు అనుకూలమైన రోజు. విద్యార్థులు సవాళ్లను ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీ మాటలను అదుపులో ఉంచుకోండి. లేనిపక్షంలో మీ జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తవచ్చు.


కర్కాటక రాశి (Cancer) 


ఈ రోజు కొన్ని శుభవార్తలు అందుతాయి. కుటుంబమంతా మతపరమైన పనుల పట్ల ఆసక్తి చూపుతారు. విద్యాపరమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో మార్పు లేదా బదిలీ జరిగే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల సహకారంతో వ్యాపారంలో లాభం ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం ఏదైనా విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు.


సింహ రాశి (LEO)


చేపట్టిన పనిలో ఆటంకాలు మానసికంగా కలవరపెడుతాయి. ఆఫీసులో అదనపు బాధ్యతలు మీద పడుతాయి. విద్యాపరమైన పనుల కోసం ప్రయాణం చేయాల్సి రావొచ్చు. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, కోపాన్ని నియంత్రించుకోండి. లవ్‌మేట్‌తో వాగ్వాదం తలెత్తే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో సాధారణ లాభం ఉంటుంది.


కన్య రాశి (Virgo)


మీ సున్నిత మనస్తత్వం, ఎవరినీ నొప్పించని పద్దతి కారణంగా మీ పట్ల చాలామందికి గౌరవం పెరుగుతుంది. కొన్ని శుభవార్తల వల్ల కుటుంబంలో ఉత్సాహకర వాతావరణం నెలకొంటుంది. విద్యాపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. తండ్రి సహకారంతో వ్యాపారంలో లాభం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి సుదీర్ఘ ప్రయాణానికి ప్లాన్ చేస్తారు.


తులా రాశి (Libra)


ఈ రోజు మీకు సాధారణ రోజు అవుతుంది. ఏ పని పూర్తయినా మనసు ఆనందంగా ఉంటుంది. కుటుంబంలో కొన్ని దోష పరిహారాలకు పురోహితుడి సూచనలు పాటిస్తారు. ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. ఈరోజు మీ ప్రేమను వ్యక్తపరిచేందుకు అనుకూలమైన రోజు.


వృశ్చిక రాశి (Scorpio)


కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన రోజు. ఈ రాశిచక్రానికి చెందిన వ్యాపారవేత్తలు ఈరోజు పెద్ద బహుమతిని పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. అనవసర వివాదాల్లో తలదూర్చవద్దు. జీవిత భాగస్వామిని బాధపెట్టవద్దు.


ధనుస్సు రాశి (Sagittarius)  


ఈ రోజు కొన్ని శుభవార్తలతో ప్రారంభమవుతుంది. వ్యాపారంలో మీరు పడే కష్టానికి తగిన ఫలం డబ్బు రూపంలో పొందుతారు. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్లాన్ చేస్తారు. సాయంత్రం వేళ ఏదైనా శుభకార్యక్రమంలో స్నేహితులతో కలిసి పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలకు ఇవాళ అనుకూలమైన రోజు.


మకర రాశి (Capricorn) 


ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. రహస్య విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. దగ్గరివారే ద్రోహం తలపెట్టవచ్చు. ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి బలహీనపడుతుంది. ఈ రాశికి చెందిన వ్యాపారులు ఇవాళ మరింత కష్టపడాల్సి వస్తుంది. అత్తమామల వైపు నుంచి బహుమతి అందుకునే అవకాశం ఉంటుంది.


కుంభ రాశి (Aquarius)


జీవితం ఉరుకులు పరుగుల మీద గడుస్తుంది. వ్యాపారస్తులు డబ్బు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. సాయంత్రం వరకు ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు. జీవిత భాగస్వామితో కలిసి సుదీర్ఘ ప్రయాణానికి ప్లాన్ చేసుకోవచ్చు.


మీన రాశి (Pisces) 


ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తల్లిదండ్రుల మద్దతు పొందుతారు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులకు ఈరోజు అనుకూలమైన రోజు. పోటీకి సిద్ధమవుతున్న విద్యార్థులు ఈరోజు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. చేపట్టిన పనుల్లో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.


Also Read : Rajya Sabha Election: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం.. 4 రాష్ట్రాల్లో 8 స్థానాల్లో గెలుపు... 


Also Read: PRESIDENT ELECTION 2022: వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కాకుండా జగన్ అడ్డుకుంటున్నారా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook