PRESIDENT ELECTION: వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కాకుండా జగన్ అడ్డుకుంటున్నారా?

PRESIDENT ELECTION 2022: భారతదేశ రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 15 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎన్నిక అనివార్యమైతే జూలై 18న పోలింగ్ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ రావడంతో  ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.

Written by - Srisailam | Last Updated : Jun 11, 2022, 08:46 AM IST
  • రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ దారెటు?
  • వెంకయ్యకు మద్దతు లేదన్న వైసీపీ!
  • బీజెపీ పెద్దలకు జగన్ కండీషన్!
PRESIDENT ELECTION: వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కాకుండా జగన్ అడ్డుకుంటున్నారా?

PRESIDENT ELECTION 2022: భారతదేశ రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 15 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎన్నిక అనివార్యమైతే జూలై 18న పోలింగ్ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ రావడంతో  ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అధికార ఎన్టీఏకు మెజార్టీ ఓట్లు ఉండటంతో ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్థే రాష్ట్రపతి కావడం ఖాయంగా తెలుస్తోంది. అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా అభ్యర్థి ఎన్నికపై ఫోకస్ చేసింది. దీంతో రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం లేనట్టే.  రాష్ట్రపతిగా తమ అభ్యర్థి గెలవాలంటే కావాల్సిన మేజిక్ ఫిగర్ కు 1.2 శాతం ఓట్ల దూరంలో ఉంది బీజేపీ కూటమి. ఆ ఓట్ల కోసం వైసీపీ,  బీజేపీ, అన్నాడీఎంకేతో చర్చలు జరుపుతున్నారు కేంద్రం పెద్దలు.

ఎన్డీఏ నుంచి రాష్ట్రపతి రేసులో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వెంకయ్య నాయుడు  విషయంలో కొన్ని అడ్డంకులు వస్తున్నాయని చెబుతున్నారు. తెలుగు వ్యక్తి అయిన వెంకయ్యకు తెలుగువారి నుంచే మద్దతు లభించడం లేదని తెలుస్తోంది. గత మూడేళ్లుగా పార్లమెంట్ లో బీజేపీకి మద్దతు ఇస్తూ వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో మాత్రం కొన్ని కండీషన్లు పెడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడికి మద్దతు ఇచ్చేది లేదని ఏపీ సీఎం జగన్ .. కేంద్రం పెద్దలకు ఖరాఖండిగా చెప్పారని తెలుస్తోంది.  

మొదటి నుంచి వెంకయ్య నాయుడితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు గ్యాప్ ఉంది. ఢిల్లీ పర్యటనల్లోనూ ఉప రాష్ట్రపతిని కలవరు జగన్. వెంకయ్యనాయుడి గురించి గతంలో రాజ్యసభలోనే  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి. వెంకయ్య శరీరం బీజేపీలో, మనసు తెలుగుదేశంలో ఉంటుందని  ఆయన కామెంట్ చేయడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో వెంకయ్యకు రాష్ట్రపతిగా మద్దతు ఇవ్వరాదని వైసీపీ నిర్ణయించిందని చెబుతున్నారు.

రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు విషయంలో వైసీపీ కండీషన్ పెడితే ఏం చేయాలన్న దానిపైనా బీజేపీ నేతలు చర్చలు చేస్తున్నారని తెలుస్తోంది. తమకు మొదటి నుంచి మద్దతు ఇస్తున్న వైసీపీ మాటను వినాలా లేక తాము ఏది చేయాలో అదే చేయాలా అన్న ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నారంటున్నారు. మరోవైపు రాష్ట్రపతి రేసులో వెంకయ్య నాయుడు లేరనే టాక్ కూడా వస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతుపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, తమ అవసరం ఎన్డీఏకు అవసరం లేకపోవచ్చని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ వెంకయ్య నాయుడుకి అవకాశం ఉంటే తప్పకుండా మద్దతు ఇస్తామని అంటున్నారు. చూడాలి మరీ ఏం జరుగుతుందో...

Read also: Nayanthara-Vignesh Shivan: మరో వివాదంలో నయన్ దంపతులు..చర్యలు తప్పవంటున్న టీటీడీ..!

Read also: Bus Charges Hike : విద్యార్థులను వదలని ఆర్టీసీ.. బస్‌ పాస్‌ చార్జీలు 150 శాతం హైక్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News