Horoscope Today June 24th 2022: ఇవాళ శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజు. ముఖ్యంగా మహిళలు ఈరోజున లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఈ శుక్రవారం ఎవరెవరికి కలిసి వస్తుందో.. రాశిచక్రంలోని 12 రాశుల జాతక ఫలాలు ఎలా ఉన్నాయో జ్యోతిష్కుడు శ్రీనాథ్ ప్రపన్నాచార్య ద్వారా తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి (Aries)


ఈ రోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. ఇవాళ ప్రారంభించే పనుల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. ఈరోజు పెట్టిన పెట్టుబడి వ్యాపారంలో లాభిస్తుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.


వృషభ రాశి (Taurus)


కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపార పరంగా అన్నివిధాలా అనుకూలమైన రోజు. జీవిత భాగస్వామితో చిన్న టూర్ ప్లాన్ చేసుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈరోజు శుభదినం.


మిథున రాశి (GEMINI)


ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ కలహాలు ఉండవచ్చు. సహోద్యోగులు కార్యాలయంలో మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు. అనవసర వాదనలకు దూరంగా ఉండండి, లేనిపక్షంలో మీరు న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కోవచ్చు. లవ్‌మేట్ నుంచి ఖరీదైన బహుమతులకు డిమాండ్ ఉండవచ్చు.


కర్కాటక రాశి (Cancer) 


ఈ రోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. వ్యాపారంలో అనుకున్నదానికంటే ఎక్కువ లాభం ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. సాయంత్రం మీరు కుటుంబంతో షాపింగ్ చేసే అవకాశం. ప్రేమ వ్యవహారాలు తీవ్రమవుతాయి. విద్యార్థులకు అనువైన రోజు.


సింహ రాశి (LEO)


ఈరోజంతా అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. ఆకస్మిక ధనలాభాల వల్ల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. జాగ్రత్తగా ఉండండి, ఎవరితోనూ రహస్య విషయాలను పంచుకోకండి. గర్ల్‌ఫ్రెండ్‌తో విభేదాలు రావొచ్చు.


కన్య రాశి (Virgo)



ఈరోజు సాధారణ రోజు కానుంది. కుటుంబంలో ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏ పని పూర్తయినా మనసు ఆనందంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వివాహితులు అత్తమామల వైపు నుంచి బహుమతులు పొందవచ్చు. వ్యాపారంలో కొత్త పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి.


తులా రాశి (Libra)


ఈ రోజు కొన్ని శుభవార్తలతో ప్రారంభమవుతుంది. కార్యాలయంలో అధికారుల సహకారంతో ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. జీవిత భాగస్వామి కారణంగా గౌరవం పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన రోజు.


వృశ్చిక రాశి (Scorpio)



ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. విద్యా పనుల నిమిత్తం చేసే ప్రయాణాలు లాభిస్తాయి. శత్రువులు ద్రోహం చేయవచ్చు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీరు లవ్‌మేట్‌తో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.


ధనుస్సు రాశి (Sagittarius)  


ఈ రోజు మీకు సాధారణ రోజు అవుతుంది. సోదరుల సహకారంతో ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వ్యాపార పరంగా అనుకూల రోజు. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రావొచ్చు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి.


మకర రాశి (Capricorn) 


కొంత గందరగోళం నెలకొంటుంది. ఆహారం విషయంలో శ్రద్ధ వహించండి, ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో లాభాలను ఆర్జించడానికి మీరు చాలా కష్టపడాల్సి రావచ్చు. ఈరోజు మీ ప్రేమను ప్రపోజ్ చేయడానికి అనుకూలమైన రోజు. విద్యాసంబంధమైన పనుల కోసం ప్రయాణం చేయాల్సి రావొచ్చు.


కుంభ రాశి (Aquarius)


ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో అధికారులతో వాగ్వాదం తలెత్తవచ్చు. వ్యాపారంలో నష్టం రావచ్చు. మాటల్లో సంయమనం పాటించండి. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. మీరు చేపట్టే పనుల్లో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన రోజు.


మీన రాశి (Pisces) 


ఈ రోజు కొన్ని శుభవార్తలతో ప్రారంభమవుతుంది. తల్లిదండ్రుల మద్దతు పొందుతారు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈ రాశిచక్రం యొక్క వివాహిత జంటలు మతపరమైన యాత్రకు వెళ్లడానికి ప్రణాళిక వేయవచ్చు.


(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)



Also Read: Coal India Limited Jobs: కోల్ ఇండియా లిమిటెడ్‌లో 1050 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు


Also Read: Govt Jobs 2022 News: తెలంగాణలో యూనివర్శిటీలలో ఖాళీల భర్తీ కోసం కామన్ బోర్డ్ ఏర్పాటు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.