Govt Jobs 2022 News: తెలంగాణలోని యూనివర్శిటీలలో ఖాళీల భర్తీ కోసం కామన్ బోర్డ్ ఏర్పాటు

University jobs Recruitment : హైదరాబాద్: తెలంగాణలోని యూనివర్శిటీలలో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ విధానం అమలులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మెడికల్ యూనివర్శిటీలు మినహాయించి మిగతా 15 యూనివర్శిటీలలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీల భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం కామన్ బోర్డు ఏర్పాటు చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 23, 2022, 09:17 PM IST
  • తెలంగాణ యూనివర్శిటీలలో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ విధానం
  • ఆరోపణలకు, వివాదాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కారు కొత్త నిర్ణయం
  • యూనివర్శిటీలలో ఖాళీల భర్తీ చేసేందుకు కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు
Govt Jobs 2022 News: తెలంగాణలోని యూనివర్శిటీలలో ఖాళీల భర్తీ కోసం కామన్ బోర్డ్ ఏర్పాటు

University jobs Recruitment : హైదరాబాద్: తెలంగాణలోని యూనివర్శిటీలలో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ విధానం అమలులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మెడికల్ యూనివర్శిటీలు మినహాయించి మిగతా 15 యూనివర్శిటీలలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీల భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం కామన్ బోర్డు ఏర్పాటు చేసింది. యూనివర్శిటీలలో ఇప్పటివరకు ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం అనుమతితో భర్తీ చేస్తూ వచ్చే విధానం పాటిస్తుండగా.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇకపై అన్ని యూనివర్శిటీలలోని ఖాళీలను భర్తీ చేసే బాధ్యతలను ఈ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు పర్యవేక్షించనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఓ జీవో జారీచేసింది. 

కొత్తగా ఏర్పాటైన బోర్డులో చైర్మన్‌గా ఉన్నత విద్యా మండలి చైర్మన్ వ్యవహరించనుండగా.. స్పెషల్ చీఫ్ సెక్రటరీ / ప్రిన్సిపల్ సెక్రటరీ / ఉన్నత విద్యామండలి కార్యదర్శి / పరిపాలనా విభాగం ఉన్నతాధికారులు సభ్యులుగా ఉండనున్నారు. అలాగే ఆర్థిక శాఖ్య కార్యదర్శి, కళాశాల విద్య విభాగం కమిషనర్ కూడా ఈ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డులో సభ్యులుగా ఉంటారు. 

Govt-jobs-2022-Telangana-Government-Common-Board-Universities-in-Telangana.jpg

ఈ బోర్డు కార్యనిర్వహణలో భాగంగా ఉన్నత విద్యామండలి కార్యదర్శి, కళాశాల విద్య విభాగం కమిషనర్ పరిపాలన బాధ్యతలు నిర్వర్తించేందుకు తమ వంతు సహకారం అందిస్తారు. కామన్ బోర్డు మార్గదర్శకాలు ప్రత్యేకంగా జారీకానున్నట్టు ప్రభుత్వం తాజాగా జారీచేసిన జీవోలో పేర్కొంది. ఖాళీల భర్తీకి అయ్యే ఖర్చులను తొలుత ఉన్నత విద్యామండలి భరించనుండగా ఆ తర్వాత యూనివర్శిటీల నుంచి వసూలు చేయనున్నారు. 

Also read : BRO Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 1178 పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే..

Also read : UPSC Prelims Result-2022: సివిల్స్‌-2022 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల..అభ్యర్థులు వీరే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News