Horoscope Today June 8th 2022:  నేటి రాశి ఫలాల ప్రకారం... ఇవాళ ప్రేమ వ్యవహారాల్లో కొన్ని రాశుల వారికి సానుకూలంగా ఉంటుంది. ప్రేమను ప్రపోజ్ చేసేవారికి సానుకూల స్పందన లభించవచ్చు. చాలాకాలంగా లవ్‌మేట్‌తో ఏదైనా విషయం పంచుకోవాలనుకుంటే.. ఇది అనుకూలమైన రోజు. వ్యాపార రంగంలో కొన్ని రాశుల వారికి మంచి లాభాలు ఉంటాయి. ఇవాళ్టి రాశి ఫలాల్లో ఏయే రాశులకు ఇంకా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి ( Aries)


ఇవాళ మీరు చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. ఆదాయ వనరులు పెరగడంతో ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యాపారులకు ఇవాళ ధనలాభం ఉంటుంది. విద్యా విషయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు అనుకూలమైన రోజు. ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే... ప్రపోజ్ చేయడానికి అనుకూలమైన రోజు. ఆరోగ్యం బాగుంటుంది.


వృషభ రాశి (Taurus)


ఈ రోజు మీరు ఓపికగా ఉండాలి, తొందరపాటు నిర్ణయం ప్రాణాంతకం కావచ్చు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఆఫీస్‌లో అదనపు బాధ్యతలు రావడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. విద్యా విషయాలలో కష్టపడి పనిచేయాల్సి రావొచ్చు. ఈ రాశికి చెందిన అవివాహితులకు వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది.


మిథున రాశి (GEMINI)


ఈ రోజు మీకు సాధారణ రోజు అవుతుంది. దుబారా వల్ల ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఓపికగా ఉండాలి. వ్యాపారంలో నష్టాలు ఉండవచ్చు. అనవసరమైన వాటి కోసం పరుగులు తీస్తారు. లవ్‌మేట్ నుంచి బహుమతి అందుకుంటారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి.



కర్కాటక రాశి (Cancer) 


చేపట్టిన పనిలో అనుకోని అడ్డంకుల వల్ల ఇబ్బందులు పడుతారు. భాగస్వామ్యంతో చేసే వ్యాపారంలో వివాదాలు తలెత్తవచ్చు. సాయంత్రం స్నేహితులతో షికారుకు వెళ్లే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల మద్దతు పొందుతారు. విద్యాపరమైన పనుల కోసం ప్రయాణం చేయాల్సి రావొచ్చు. లవ్‌మేట్ నుంచి మీపై కొంత ఒత్తిడి ఉంటుంది.


సింహ రాశి (LEO)


ఈ రోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. ఆఫీసులో అధికారుల సహకారంతో పదోన్నతి లభిస్తుంది. వ్యాపారంలో ఆశించిన లాభం ఉంటుంది. విద్యార్థులు ఈరోజు కష్టపడాల్సి రావొచ్చు. సాయంత్రం స్నేహితులతో కలిసి షికారు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.


కన్య రాశి (Virgo)


ఈ రోజు కొన్ని శుభవార్తలు అందుతాయి. విద్యా విషయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు అనుకూలమైన రోజు. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. పాత పెట్టుబడులు ఇప్పుడు లాభాలు కురిపిస్తాయి. ఈరోజు మీరు ప్రేమను ప్రపోజ్ చేస్తే.. సానుకూల ఫలితాన్ని పొందుతారు.


తులా రాశి (Libra)


ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసు పనిలో నిర్లక్ష్యం చేస్తే అది మిమ్మల్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టుతుంది. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి, లేనిపక్షంలో వివాదం తలెత్తవచ్చు. చాలాకాలంగా చెప్పాలనుకుంటున్న విషయాలను మీ లవ్‌మేట్‌తో పంచుకోవచ్చు. వ్యాపారస్తులు డబ్బు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి.


వృశ్చిక రాశి (Scorpio)


కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మతపరమైన పనుల పట్ల మొగ్గు చూపుతారు. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. ఈ రాశికి చెందిన అవివాహితులకు మంచి వివాహ సంబంధం రావొచ్చు. స్నేహితుల సహకారంతో వ్యాపారంలో లాభం ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. భార్య లేదా భర్త మనసు నొప్పించే ప్రవర్తనను మార్చుకుంటే మంచిది.


ధనుస్సు రాశి (Sagittarius)  


ఈ రోజు ప్రారంభంలో ఉరుకులు పరుగుల మీద గడుస్తుంది. కుటుంబంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వ్యాపారంలో, కస్టమర్‌లతో మర్యాదగా ప్రవర్తించండి. విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.


మకర రాశి (Capricorn) 


ఈ రోజు మీకు సాధారణ రోజు అవుతుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఆహారంపై శ్రద్ధ వహించండి, లేకుంటే ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆఫీసులో అధికారులతో గొడవలు తలెత్తవచ్చు. లవ్‌మేట్‌తో కలిసి ప్రయాణించేందుకు ప్లాన్ చేసుకుంటారు.


కుంభ రాశి (Aquarius)


ఈ రోజు, మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనిని పూర్తి చేయడంతో మనసంతా సంతోషంగా ఉంటుంది. మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. కుటుంబంలో ఏదో ఒక విషయంలో గొడవలు రావచ్చు. వ్యాపారంలో విస్తరణకు ఈరోజు అనుకూలమైన రోజు. మీ జీవిత భాగస్వామి భావాలను జాగ్రత్తగా చూసుకోండి.


మీన రాశి (Pisces) 


మీరు ఈరోజు కొంత ఆశ్చర్యాన్ని పొందవచ్చు. కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు పెట్టిన పెట్టుబడి వ్యాపారంలో లాభిస్తుంది. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రావచ్చు.


Also Read: Nupur Sharma: ప్రవక్తపై నుపుర్ అనుచిత వ్యాఖ్యలు.. భారత్‌కు అల్‌ఖైదా బెదిరింపు.. ఆ నగరాల్లో ఆత్మాహుతి దాడులకు ప్లాన్..  


Also Read: Hyderabad Gangrape Case: హైదరాబాద్‌‌‌‌లో మైనర్‌పై గ్యాంగ్ రేప్ కేసు వివరాలు వెల్లడించిన సీపీ సీవీ ఆనంద్



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి