Horoscope Today May 1st 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... కొన్ని రాశుల వారికి పెట్టబడులు కలిసొస్తాయి. గతంలో పెట్టిన పెట్టబడులు ఇప్పుడు లాభాలను తీసుకొస్తాయి. గత వారం ఎదురైన కొన్ని సమస్యల చిక్కుముడి వీడుతుంది. వాటి నుంచి బయటపడుతారు. కొన్ని రాశుల వారు కుటుంబంతో క్వాలిటీ సమయం గడిపేందుకు ఇష్టపడుతారు. ఇవాళ్టి రాశి ఫలాల్లో ఇలాంటి మరిన్ని విషయాల్లో ఇక్కడ తెలుసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మేషరాశి ( Aries)


చంద్ర అనుగ్రహంతో మీ కోరికలు నెరవేరుతాయి. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. చేస్తున్న పనిని పూర్తిగా ఆస్వాదిస్తారు. చేపట్టిన ప్రతీ పనులు వేగవంతంగా సకాలంలో పూర్తవుతాయి. మీతో పాటు మీ కుటుంబ సభ్యులు పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. మీ చుట్టూ ఉన్నవారు సమస్యల్లో ఉన్నప్పుడు సాయం కోసం మిమ్మల్ని ఆశ్రయిస్తారు. వారి సమస్యల పరిష్కారం కోసం మీరు శాయాశక్తుల కృషి చేస్తారు. తద్వారా మీ పలుకుబడి మరింత పెరుగుతంది. 


వృషభ రాశి (Taurus)


ఇవాళ చంద్రుడి నెగటివ్ ప్రభావం మీపై ఉంటుంది. ఫలితంగా ఈరోజంతా మీకు నిరాశజనకంగా గడుస్తుంది. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అది మీ రోజు వారీ పనిపై ప్రభావం చూపుతుంది. మీకు తెలిసిన వ్యక్తులే మీకు ద్రోహం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా వ్యవహరించాలి. నిర్ణయాలు తీసుకోవడంలో మీరు కన్ఫ్యూజన్‌కు గురికావొచ్చు. వీలైతే మీ సహచరి సలహా తీసుకోండి. తొందరపాటు పనిచేయదు. ఓపికతో ముందుకు సాగండి. 


మిథున రాశి (GEMINI)


ఇవాళ మీపై చంద్రుడి అనుగ్రహం ఉంటుంది. పెట్టుబడుల విషయంలో సరైన నిర్ణయాలకు చంద్ర అనుగ్రహం మీకు దోహదపడుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. కొత్త ప్రాజెక్టులు మొదలుపెడుతారు. వాటి ద్వారా మరింత రాబడి వస్తుంది. దీర్ఘకాలంలో మీ సంపద పెరుగుతుంది. మీ నెట్‌వర్క్, సోషల్ స్టేటస్ పెరుగుతాయి. 


కర్కాటక రాశి (Cancer) 


ఇవాళ మీరు పూర్తిగా మీ పనిలో లేదా వ్యాపారంలో తలమునకలై ఉంటారు. మీ లక్ష్యం, మీ ఫోకస్ చాలా క్లియర్‌గా ఉంటుంది. తద్వారా వేగవంతంగా పనులు పూర్తయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. జీవితంలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో క్వాలిటీ సమయం గడుపుతారు. సింగిల్స్‌కు తగిన జోడీ దొరకవచ్చు. మీరు ఉంటున్న ఇంటికి మరమత్తులు చేస్తారు. 


సింహ రాశి (LEO)


పెద్దల ఆశీస్సులతో మీకు చాలా విషయాల్లో పాజిటివిటీ ఏర్పడుతుంది. గత వారం ఏర్పడిన కొన్ని గందరగోళ సమస్యల నుంచి బయటపడుతారు. మీ జీవితంలో పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మికత వైపు దృష్టి సారిస్తారు. మీ ఆర్థిక పురోగతి మెరుగవుతుంది. ప్రతీ పనిలో దైవాన్ని లేదా మీ మనస్సాక్షిని నమ్ముకుని ముందుకు సాగండి. 


కన్య రాశి (Virgo)


నెగటివ్ ఆలోచనలు మిమ్మల్ని వెంటాడుతాయి. ఎటు చూసినా నెగటివిటీ మిమ్మల్ని వెంటాడుతుంది. అహంకారం, ఓపిక లేకపోవడం మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టివేస్తాయి. పెద్దల ఆశీస్సులు పొందితే పరిస్థితిలో కొంత మార్పు ఉంటుంది. తద్వారా మీరు చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. పెట్టుబడుల విషయంలో కాస్త ఆచీ తూచీ వ్యవహరించాలి. ప్రేమికులు అనవసర విషయాలపై చర్చించి మనస్పర్థలు తెచ్చుకోవద్దు. 


తులా రాశి (Libra)


చంద్రుడి అనుగ్రహం పొందుతారు. వృత్తిపరంగా గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా ముందుకు సాగుతుంది. కుటుంబ సంబంధిత విషయాల్లో అనవసర వాదనలు చేయవద్దు. స్థిరాస్తి పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెడుతారు. ఆరోగ్యం బాగుంటుంది. 


వృశ్చిక రాశి (Scorpio)


ఉద్యోగ రీత్యా ఇవాళ మీరు బాగా రాణిస్తారు. మీ పెర్ఫామెన్స్‌ను సీనియర్లు అభినందిస్తారు. ప్రమోషన్ దక్కే అవకాశం ఉంటుంది. మీరు డీల్ చేసే కొన్ని ఇష్యూల్లో మీదే పైచేయి అవుతుంది. మీ పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. పిల్లల భవిష్యత్తు కోసం ముందుచూపుతో పెట్టుబడులు ప్లాన్ చేస్తారు. మీ ప్రత్యర్థులు ప్రస్తుతానికి మీ జోలికి రారు.


ధనుస్సు రాశి (Sagittarius)  


పిల్లలకు సంబంధించిన విషయాలతోనే ఇవాళ మీ రోజంతా గడుస్తుంది. పిల్లలతో కలిసి ఎక్కడికైనా టూర్ వెళ్లే అవకాశం ఉంది. మీకు అప్పగించిన క్లిష్టమైన టాస్క్ ఒకటి సులువుగా పూర్తి చేస్తారు. ఇంటి కోసం కొన్ని కళాకృతులు కొనుగోలు చేస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడిపేందుకు ఇష్టపడుతారు. సింగిల్స్‌కు తగిన జోడీ దొరకవచ్చు. 


మకర రాశి (Capricorn) 


ఇవాళ మీకు నిరాశజనకంగా ఉంటుంది. మీ చుట్టూ నెగటివిటీ ఉంటుంది. నిరాశ, నిస్పృహ మిమ్మల్ని కొంత అసహనానికి గురిచేస్తాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం కోల్పోవద్దు. ఓపికగా వ్యవహరించాలి. అనవసరంగా నోరు జారితే పరిస్థితులు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. ఈరోజు సాయంత్రానికి పరిస్థితులన్నీ చక్కబడుతాయి. 


కుంభ రాశి (Aquarius)


చంద్ర అనుగ్రహం మీకు కలిసొస్తుంది. మీ చుట్టూ మీకు చేటు చేసే వ్యక్తులు ఉన్నప్పటికీ మీ ఆత్మగౌరవమే మిమ్మల్ని నిలబెడుతుంది. కుటుంబ సంబంధిత విషయాల్లో కాస్త భావోద్వేగపూరితంగా ఉంటారు. అది మీ ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుస్తుంది. మీ అంతరంగం మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. కీలక విషయాల్లో మీ అంతరంగం చెప్పేది వినండి. 


మీన రాశి (Pisces) 


అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు. పెట్టుబడులకు సంబంధించి సరైన ప్లాన్ కోసం ఒక అడ్వైజర్‌ను ఆశ్రయిస్తారు. అది మీ సేవింగ్స్‌ రెట్టింపవడానికి దోహదపడుతుంది. ఇతరులతో చాలా మర్యాదగా వ్యవహరిస్తారు. అది మీ పట్ల అందరిలో పాజిటివ్ దృక్పథాన్ని ఏర్పరుస్తుంది. మీ ఆర్థిక స్థితి గతులకు ఢోకా లేదు. ఆరోగ్యం బాగుంటుంది. 


Also Read: పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు టీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్..


Also Read: AP Tenth Exams: పదవ తరగతి పరీక్షల్లో మార్పుల్లేవు, మరి రంజాన్ పండుగన పరీక్ష ఉంటుందా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.