AP Tenth Exams: పదవ తరగతి పరీక్షల్లో మార్పుల్లేవు, మరి రంజాన్ పండుగన పరీక్ష ఉంటుందా

AP Tenth Exams: రంజాన్ పండుగ ఎప్పుడు..పదవ తరగతి పరీక్షకు క్లాష్ వస్తుందా. పరీక్ష తేదీ మారుస్తారా. ప్రభుత్వం ఏం చేయనుంది. విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనకు ఏపీ ప్రభుత్వం తెరదించింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 1, 2022, 08:02 AM IST
AP Tenth Exams: పదవ తరగతి పరీక్షల్లో మార్పుల్లేవు, మరి రంజాన్ పండుగన పరీక్ష ఉంటుందా

AP Tenth Exams: రంజాన్ పండుగ ఎప్పుడు..పదవ తరగతి పరీక్షకు క్లాష్ వస్తుందా. పరీక్ష తేదీ మారుస్తారా. ప్రభుత్వం ఏం చేయనుంది. విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనకు ఏపీ ప్రభుత్వం తెరదించింది.

ఏపీలో ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 27న ప్రారంభమైన పరీక్షలు మే 7 వరకూ జరగనున్నాయి. అయితే మధ్యలో రంజాన్ పండుగ ఉంది. రంజాన్ పండుగ మే 2, లేదా 3 తేదీల్లో ఉంటుంది. ప్రభుత్వం మాత్రం అధికారికంగా 3వ తేదీన సెలవు ప్రకటించి అందుకు అనుగుణంగా పదవ తరగతి పరీక్షల టైమ్‌టేబుల్ ఫిక్స్ చేసింది. 

ముస్లిం సాంప్రదాయం ప్రకారం రంజాన్ నెలలో 29వ రోజు చంద్రుడిని చూసి..కన్పిస్తే మరుసటి రోజు పండుగ జరుపుకుంటారు. ఆ లెక్కన ఇవాళ అంటే మే 1వ తేదీ సాయంత్రం ఒకవేళ చంద్రుడు దర్శనమిస్తే 2వ తేదీన పండుగ జరుపుకుంటారు. అయితే మే 2వ తేదీన షెడ్యూల్ ప్రకారం పదవ తరగతి మేధ్స్ పరీక్ష ఉంది. ఈ క్రమంలో పరీక్షల తేదీల్లో మార్పులుంటాయని..రంజాన్ పండుగ మే 2న ఉంటే పరీక్ష రద్దవుతుందా లేదా అనే సందేహాలు అధికమయ్యాయి. విద్యార్ధులు, తల్లిదండ్లుల్లో ఈ విషయమై ఆందోళన నెలకొంది. ప్రభుత్వం ఈ ఆందోళనకు తెరదించుతూ నిర్ణయం తీసుకుంది.

Ap Tenth Exams on Schedule

పదవ తరగతి పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానంద్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏ విధమైన ఆందోళన వద్దన్నారు. ఇప్పటివరకూ తెలుగు, హిందీ, ఇంగ్లీషు పరీక్షలు పూర్తయ్యాయని..ఇంకా మేథ్స్, ఫిజికల్స్ సైన్స్, బయొలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ పరీక్షలున్నాయన్నారు. అందుకే రంజాన్ పండుగ ఏరోజున జరుపుకున్నా..మిగిలిన పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పులుండవని చెప్పారు. 

Also read: AP New Medical Colleges: ఏపీలో కొత్తగా 12 మెడికల్ కళాశాలలు, ఎక్కడెక్కడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News