Horoscope Today: నేడు సూర్య గ్రహణం- మరీ మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
Horoscope Telugu: ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం నేడు (శనివారం) ఏర్పడనుంది. మరి ఈ రోజు పన్నెండు రాశుల వారికి ఎలా ఉందో.. జోతిష్య నిపుణులు తెలిపిన వివరాలు మీ కోసం.
Horoscope prediction today: నేడు శని అమావస్య (డిసెంబర్ 4). దీనితో పాటు ఈ రోజు సూర్య గ్రహణం కూడా ఏర్పడనుంది. మరి ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ముందుగా పంచాంగం
శ్రీ ప్లవనామ సంవత్సరం
డిసెంబర్ 2021 డిసెంబర్, 04 (శనివారం)
సూర్యోదయం ఉదయం 6:58 గంటలకు
సూర్యాస్తమయం సాయంత్రం 5:23 గంటలకు
తిథి- అమావాస్య మధ్యాహ్నం 01:15 వరకు
రాహుకాలం: ఉదయం 09:34 నుంచి మధ్యాహ్నం 10:52 వరకు
దుర్ముహూర్తం: ఉదయం 06:58 నుంచి 07:39 వరకు
అమృతఘడియలు: ఉదయం 11:50 గంటల నుంచి మధ్యాహ్నం 12:31 గంటల వరకు
రాశి ఫలాలు..
మేష రాశి (Aries)
ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. మీ కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతారు. ఖర్చులు పెరిగే అవకాశముంది. మీకు ఇష్టమైన వారే మిమ్మల్ని కోపగించుకునే అవకాశముంది. డ్రైవింగ్‌లో జాగ్రత్త అవసరం. ఎలక్టిక్ వస్తువుల వల్ల షాక్ కొట్టే అవకాశముంది. సరదాలు, తప్పుడు మార్గాల్లో పయనించడం వల్ల కుటంబ సభ్యులకు అవామనం తెచ్చే అవకాశం ఉంది.
వృషభ రాశి (Taurus)
ఖర్చులు పెరిగే అవకాశముంది. ముఖ్యంగా మీ స్నేహితులు మీ నుంచి అప్పు కోరొచ్చు. ఈ సహాయం వల్ల మీకు ఆర్థఱఇకంగా ఇబ్బందులు రావచ్చు. అయితే స్నేహితుల వల్లే మీకు ఈ రోజు మంచి జరుగుతుంది. ప్రేమ విషయంలో నేడు అంతగా కలిసి రాదు. మీ జీవిత భాగస్వామి మీకు సహకరించకపోవచ్చు. ఉద్యోగులు తమ పని తీరుతో ఇతరుల మెప్పు పొందుతారు. వ్యాపార విషయంలో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండటం మేలు.
మిథున రాశి (Gemini)
సమయానికి చేయాల్సిన పనులు పూర్తవకపోవడం వల్ల కొత్త ఇబ్బందులకు లోనవుతారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. తగదాల వల్ల ప్రశాంతత కోల్పోవచ్చు. మీకు ప్రియమైన వారిని నొప్పించే పనులు చేయకపోవడం మంచిది. వైవాహిక జీవితం బాగుంటుంది. సహోద్యోగులతో వ్యతిరేకతను ఎదుర్కోవడం వంటివి జరగొచ్చు
కర్కాటక రాశి (Cancer)
మానసికంగా ఒత్తిడి కారణంగా మీరు బలహీనంగా అనిపిస్తారు. అవసరానికి డబ్బు చేతికందుతుంది. పాత బకాయిలు వసూలయ్యే అవకాశముంది. అనవసర తగాదాల జోలికి వెళ్లకపోవడం మంచిది. సరదాలు, విందు, వినోదాలకు మంచి రోజు. జీవిత భాగస్వామి కారణంగా చిరాకు పడే అవకాశముంది. చివరకు తనే మీరు సంతోష పడే పని చేస్తారు.
సింహ రాశి (Leo)
ఓ చిక్కుముడిని మీ బుద్ధి బలంతో పరిష్కరిస్తారు. అది ప్రశంసలు పొందేలా చేస్తుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో ఆచి తూచి అడుగు వేయాలి. ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశాలున్నాయి. అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. వాస్తవ పరిస్థితులను అర్థం చేుకుని మెలగటం మంచిది. భూ తగాదాలు, ఆస్తి గొడవల వల్ల ఇబ్బందులు రావచ్చు.
కన్యా రాశి (Virgo)
మీలోని శక్తిని మంచి పనులు చేసేందుకు ఉపయోగించలా. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. మీ ప్రియమైన వారితో జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. ఏదైనా విషయంలో ఓటమి కలగొచ్చు. ఖర్చులు, డబ్బు విషయంలో మీ జీవిత భాగస్వామితో గొడవలు రావచ్చు.
తులా రాశి (Libra)
విందు, వినోదాల విషయంలో జాగ్రత్త. మీ ప్రవర్తన వల్ల వినోద కార్యక్రమంలో ఏదైనా తప్పు జరిగే అవకాశముంది. బ్యాంకులో ఏదైనా పని ఉంటే.. అత్యంత జాగ్రత్త అవసరం. ఓ గుడ్ న్యూస్ వింటారు. ఇది రోజంతా మీకు ఆహ్లాదాన్నిస్తుంది. వైవాహిక జీవితంలో మంచి రోజు కాగలదు. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు రావచ్చు.
వృశ్చిక రాశి (Scorpio)
ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆర్థిక పరమైన విషయాల్లో మిశ్రమ ప్రయోజనాలు ఉన్నాయి. కటువుగా ప్రవర్తించడకపోవడం మంచిది. విద్యార్థులు నేడు చదువు పట్ల శ్రద్ధ చూపించకపోవచ్చు. స్నేహితులతో ఎక్కువ సేపు గడుపుతారు. ఫలితంగా సమయం వృధా అవుతుంది. వైవాహిక జీవితం సానుకూలంగా ఉంది. అయితే రొటీన్ లైవ్ స్టైల్ మీకు కాస్త చిరాకుగా అనిపించే వీలుంది.
ధనుస్సు రాశి (Sagittarius)
సానుకూలమైన విషయాలను మాత్రమే ఆలోచించండి. మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. ముఖ్యంగా పర్సును జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇంట్లో ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనితో మీకు ఎన్ని టెన్షన్లు ఉన్నా వాటిని మరిచిపోతారు. మీ శ్రీమతికి మీ సపోర్ట్ అవసరం. ఆఫీసుల్లో పని చేసే వారికి ఇబ్బందికర పరిస్థితులు రావచ్చు. ఈ విషయం మీ మూడ్ పాడు చేయొచ్చు.
మకర రాశి (Capricorn)
ఈ రోజు మీరు ఉత్తేజంగా ఉంటారు. పనులన్ని చక చకా పూర్తి చేస్తారు. ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశముంది. దూకుడు స్వభావం వల్ల కీడు జరగొచ్చు. దగ్గరి వారి వల్ల మీ సమస్యలు కాస్త తగ్గుతాయి. వైవాహిత జీవితంబాగానే ఉంది. కొత్త పరిచయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి (Aquarius)
ఫిట్నేస్పై దృష్టి సారించాల్సిన సమయమిది. ఆర్థికంగా కలిసి వస్తుంది. మొండి బకాయిలు తీరే అవకాశాలున్నాయి. మీ వృద్ధికి బాటలు వేసే పనులపై దృష్టి సారించాలి. సూర్య గ్రహణం కారణంగా ఏదైనా పని చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించడం మంచిది.
మీన రాశి (Pices)
ఇతరుల సహాయంతో మీరు ఆర్థికంగా పుంజుకుంటారు. గహణం వల్ల కష్టం వృధా కావచ్చు. ప్రయాణాలకు నేడు దూరంగా ఉండటం మంచిది. అయితే ఆత్మీయుల కారణంగా ఒంటరి తనాన్ని మరచిపోతారు. కుటంబ సభ్యుల విషయంలో జాగ్రత్త అవసరం.
Also read: Palmistry: మీ చేతి రేఖలు ఇలా ఉన్నాయా..?? అయితే మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నారని అర్థం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook