Horseshoe Benefits: జ్యోతిష్య శాస్త్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందో వాస్తు శాస్త్రాన్ని కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇల్లు సరైన దిశలో ఉండటం వల్ల జీవితంలో ఆనందం, శాంతి, సంపద అన్ని కలుగుతాయి. అందుకే చాలామంది వాస్తు శాస్త్ర నిపుణులు సూచించిన కొన్ని సూచనలను తూచా తప్పకుండా పాటిస్తారు. నిజానికి ఇంటిలోని వాస్తులో లోపం ఉండటం వల్ల జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా దీని ప్రభావం సంపదపై పడి ఖర్చులు పెరగడమే కాకుండా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలోనే వాస్తు నిపుణులను ఆశ్రయించి ఇంటికి తగిన వాస్తు సూచనలను సలహాలను తీసుకోవడం ఎంతో మంచిది. అయితే ప్రస్తుతం చాలామంది ఇంట్లో సరైన వాస్తు లేని కారణంగా అనేక రకాల సమస్యల మారిన పడుతున్నారు. ఇలాంటి వారికోసం గుర్రపు డెక్క ఎలా ఉపయోగపడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి కూడా గుర్రండెక్క నివారణ ఎంతో సహాయ పడుతుందని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. గుర్రపుడెక్క చాలా పవర్ఫుల్ తొలగించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే పవర్ డబ్బు సంబంధిత సమస్యలను తొలగించి ఇంట్లో కుటుంబంలో వస్తున్న సమస్యల పరిష్కారానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. అయితే చాలామంది గుర్రపుడెక్కను ఇంట్లో ఎక్కడపడితే అక్కడ పెట్టుకుంటూ ఉంటున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం దీనిని కేవలం శుభ ప్రదేశాల్లో ఉంచడం వల్లనే మంచి ఫలితాలు కలుగుతాయట.


అంతేకాకుండా ఈ గుర్రపుడెక్క గురించి జ్యోతిష్య శాస్త్రంలో కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు దుబారా ఖర్చులు పెడుతున్న వారు ఈ గుర్రపుడెక్కను ఒక కాటన్ గుడ్డలో చుట్టి ఇంట్లో శుభ ప్రదేశాల్లో పెట్టడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా సంపాదన పెరిగి సమాజంలో శ్రేయస్సు, కీర్తి, ప్రతిష్టలు కూడా రెట్టింపు అవుతాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. 


ఇప్పటికే శని సాడే సాతి సమస్యలతో బాధపడుతున్న వారు గుర్రపుడెక్కను ఇంటి ప్రధాన ద్వారం ముందు కాటన్ గుడ్డలు కట్టుకోవాల్సి ఉంటుంది. దీనిని కట్టుకున్న వారు తప్పకుండా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపిన సూచనలు సలహాలు తప్పకుండా పాటించాలి. ఈ డెక్కను ప్రధాన ద్వారానికి కట్టుకున్న వారు తప్పకుండా శనివారం రోజున ఇంటికి ఎలాంటి ఇనుప వస్తువులను తీసుకురాకూడదు. ఇది ఉన్న సమయాల్లో ఇంటికి ఇనుప వస్తువులను తీసుకురావడం వల్ల శని దోషం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గుర్రపు డెక్క కట్టుకున్న వారు ఇంటికి ఇనుప వస్తువులను తీసుకురాకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


గుర్రపుడెక్క రెమెడీస్ పాటించడం వల్ల ఉద్యోగం, వ్యాపారంలో వస్తున్న సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుర్రముడెక్కతో తయారుచేసిన ఉంగరాన్ని ధరించడం వల్ల ఉద్యోగంలో వస్తున్న సమస్యలు తీరిపోయి ప్రమోషన్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని వారంటున్నారు. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ ఉంగరాన్ని ధరించడం వల్ల అన్ని రకాల సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా కుటుంబంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి