last Solar Eclipse of the year is going to occur on Dec 4, 2021: డిసెంబర్ 4 (శనివారం) ఆకాశంలో అద్భుతమై దృశ్యం చోటు చేసుకోనుంది. ఆ రోజు సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఉదయం 10:59 నిమిషాల నుంచి.. సాయంత్రం 3:07 వరకు సుదీర్ఘంగా (Solar Eclipse Timings) కొనసాగనుంది. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం కూడా ఇదే కావడం (Last Solar eclipse of the Year) విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు అడ్డు రావడం వల్ల సూర్యగ్రహణాలు ఏర్పడతాయి. సరిగ్గా అమావాస్య రోజు మాత్రమే ఈ గ్రహణం ఏర్పడుతుంది.


అయితే జోతిష్య శాస్త్రంలో గ్రణాలకు ప్రత్యేక స్థానం ఉంది. గ్రహణాల ఆధారంగా వివిధ రాశుల వారి జీవితంపై ఒక్కో విధమై ప్రభావం ఉంటుందని జోతిష్య శాస్త్ర నిపుణులు (Astrologers on solar eclipse) చెబుతున్నారు. మరి ఈ సారి సూర్యగ్రహణం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు (Solar Eclipse impact On Zodiac Signs) తెలుసుకుందాం.


మేష రాశి (Aries)


మేష రాశి వారికి సూర్యగ్రహణం.. జాతకంలో ఎనిమిదవ స్థానంలో ఉంది. కాబట్టి డ్రైవింగ్​లో జాగ్రత్త అవసరం. ఎలక్ట్రిక్ వస్తువుల వల్ల షాక్ కొట్టే అవకాశముంది. ఈ నెలలో మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.


వృషభ రాశి (Taurus)


ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఈ రాశి వారిలో ఏడవ స్థానంలో రానుంది. దీని వల్ల జీవిత భాగస్వామితో ఇబ్బందులు రావచ్చు. వ్యాపార విషయంలో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండటం మేలు.


మిథున రాశి (Gemini)


ఈ రాశి వారికి ఆరో ఇంట్లో గ్రహణం ఏర్పడుతుంది. దీనితో కోపం పెరగటం, ఉద్యోగులు తమ సహోద్యోగులతో వ్యతిరేకతను ఎదుర్కోవడం వంటివి జరగొచ్చు. అప్పులకు దూరంగా ఉండాలి.


కర్కాటక రాశి (Cancer)


ఈ రాశివారికి సూర్యగ్రహణం ఐదవ ఇంట్లో వస్తుంది. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టకపోవచ్చు. ప్రేమ జంట ఇబ్బందులు పడొచ్చు. అన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం.


సింహ రాశి (Leo)


ఈ రాశి వారికి భూ తగాదాలు, ఆస్తి గోడవల వల్ల ఇబ్బంది పడతారు. ఈ విషయంలో కొంత నష్టాన్ని కూడా ఎదుర్కోవచ్చు. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయం కూడా ఇబ్బంది పెట్టొచ్చు.


కన్యా రాశి (Virgo)


ఈ రాశి వారికి తోబుట్టువులతో ఇబ్బందులు రావచ్చు. మీ కంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వారితో మాట జారొద్దు. పని విషయంలో మీ సహనం మీకు ఉపయోగపడుతుంది.


తులా రాశి (Libra)


ఈ రాశి వారికి రెండవ ఇంట్లో గ్రహణం వస్తుంది. ఇది మీకు నష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు రావచ్చు.


వృశ్చిక రాశి (Scorpio)


ఈ రాశి వారికి గ్రహణం సమయంలో.. సూర్యుడు, చంద్రుడితో కలిసి కేతువు ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో మీకు ఏ పని చేయలేను అనట్లు అనిపిస్తుంది. విశ్వాసం తగ్గిపోతుంది. గాయాలు అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలి.


ధనుస్సు రాశి (Sagittarius)


ఈ రాశి వారికి గ్రహణం వల్ల ఖర్చులు అధికమయ్యే అవకాశముంది. ఆదాయం కన్నా ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. విదేశీ ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. స్థిరాస్తి వ్యాపారులు నష్టపోవచ్చు.


మకర రాశి (Capricorn)


కొత్త పరిచయాల వల్ల మోసపోయే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో ఆటంకం కలగవచ్చు. ఆదాయం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.


కుంభ రాశి (Aquarius)


ఈ రాశి వారు కార్యాలయంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మరోవైపు ఇంట్లో తండ్రి ఆరోగ్యం వల్ల కూడా ఆందోళనకు గురికావచ్చు. ఈ సమయంలో ఏదైనా పని చేయాలంటే పది సార్లు ఆలోచించడం మేలు.


మీన రాశి (Pices)


మీనరాశి వారికి అదృష్టం ఇంట్లో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీని వల్ల మీ కష్టం వృధా అవుతుంది. ఇది మీకు నిరాశను కలిగిస్తుంది. ప్రయాణాలకు దూరంగా ఉండటమే మంచిది.


Also read: Horoscope Today: నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకోండి..


Also read: Vastu Tips For Money: ఇంటి ఈశాన్య భాగంలో ఇలా చేయండి.. లక్ష్మిదేవి మీ ఇంట్లో తిష్టవేసుకొని కూర్చొంటుంది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook