Sun Rays On Ayodhya Rama Statue: ఏళ్ల తరబడి నిరీక్షణ తరువాత అయోధ్యలో నిర్మితమైన రామమందిరం ఇవాళ ప్రారంభం కానుంది. నేడు అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట జరగనుంది. అయోధ్య రామ మందిర నిర్మాణంలో శ్రీరాముడి విగ్రహం నుదిటిపై సూర్యూడి కిరాణాలు ప్రసరించేలా ప్రత్యేక  ఏర్పాటు చేశారు కళాకారులు. కోట్లాది మంది హిందువుల కల సాకారమవుతున్న వేళ అయోధ్య మందిరంలో ఏర్పాటు చేస్తున్న సూర్య తిలకం విశిష్టతలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీరాముడి విగ్రహం నుదిటిపై సూర్య కిరణాలు:


శ్రీరామ నవమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు మొదలై ఆరు నిమిషాలపాటు సూర్య కిరణాలు గర్భగుడిలోని శ్రీరాముడి విగ్రహం నుదిటిపై ప్రసరించేలా CSIRకు చెందిన సెంట్రల్‌ బిల్డింగ్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ సైంటిస్టులు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ ఆరు నిమిషాల పాటు గర్భగుడిలోని శ్రీరాముడి విగ్రహ నుదుటిపై సూర్య కిరణాలు ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇది రాముడికి స్యూర్య తిలకంగా భావిస్తున్నారు. దీని కోసం  ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌-IIA సహాయం తీసుకుంది. 


రాముడి నుదిటిపై ప్రసరించేలా ప్రత్యేకం ఏర్పాట్లు:


ఈ సూర్య కిరణాలు రాముడి నుదిటిపై పడేలా ప్రత్యేక  అద్దాలు,  కటకాలు, గేర్‌బాక్స్‌లు, గొట్టాలను అయోధ్య రామాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కిరణాలు మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని విగ్రహం వరకు ప్రసరించేలా ఏర్పాటు చేశారు. చంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఏటా శ్రీరామనవమిని నిర్ణయిస్తారు.  ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు ఒకే రకంగా సూర్యకిరణాలు ప్రసరించవుని నిపుణులు చెబుతున్నారు.  ఈ కారణంగా రాముడి విగ్రహ నుదిటిపై సూర్యతిలకం స్థానం మారడం అనేది జరుగుతుందని నిపుణులు అంటున్నారు.


Also Read Budhaditya Rajyog: బుధాదిత్య రాజయోగంతో ఈ రాశులవారికి లగ్జరీ లైఫ్‌..ఇక కనక వర్షమే..


దీని కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్-IIA సరికొత్త పరిష్కారాన్ని అందించింది. సూర్య, చంద్రరాశుల తిథులు పనతొమ్మది ఏళ్లకు ఒకసారి కలుస్తాయి. అయితే  శ్రీరామనవమి రోజు సూర్యుడిలో వచ్చే మార్పులకు  కటకాలు, అద్దాలను గేర్‌బాక్స్‌లను అమర్చనున్నారని తెలుస్తోంది. చంద్రమాన తిథికి అనుగుణంగా సూర్య కిరణాలు ప్రతీ శ్రీరామనవమికి సరిగ్గా రాముడి నుదుటిపై పడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సూర్య కిరణాలు మూడో అంతస్తుపై ఉండే శిఖరం నుంచి గర్భగుడిలోని విగ్రహంపై ప్రసరిస్తాయి. ఆలయం నిర్మాణం పూర్తయిన తర్వాతే సూర్య తిలకం ఆవిష్కృతం అవుతుంది అని CBRI సైంటిస్టు ధర్మరాజు  చెప్పారు. 


అయోధ్య రామ మందిరంలో ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ పనులు మాత్రమే పూర్తి చేశారు.  వచ్చే  2025 డిసెంబర్‌లో మొత్తం 3 అంతస్థులు పూర్తి అవుతాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్  తెలిపింది.


Also Read Luckiest Zodiac Signs: అయోధ్య రాముడి అనుగ్రహంతో ఈ 4 రాశులవారికి లాభాలే..లాభాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter