Luckiest Zodiac Signs: అయోధ్య రాముడి అనుగ్రహంతో ఈ 4 రాశులవారికి లాభాలే..లాభాలు..

Top 4 Most Luckiest Zodiac Signs: ఈ రోజు జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగంతో పాటు అనేక యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2024, 09:30 AM IST
Luckiest Zodiac Signs: అయోధ్య రాముడి అనుగ్రహంతో ఈ 4 రాశులవారికి లాభాలే..లాభాలు..

Top 4 Most Luckiest Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చంద్ర గ్రహం వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం చేయబోతోంది. ఇదే సమయంలో శుక్ల పక్ష మాసంలోని ఎంతో ప్రాముఖ్యత కలిగిన తిథులు ఏర్పడబోతున్నాయి. అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, రవియోగం, బ్రహ్మయోగాలు ఏర్పడబోతున్నాయి. అలాగే ఆయోధ్యలోని శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కూడా జరగబోతోంది. కాబట్టి ఈ రోజుకి చాలా ప్రాముఖ్య ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్రత్యేక యోగాల కారణంగా 5 రాశులవారికి వ్యక్తిగత జీవితంలో ఊహించని మార్పులు వస్తాయని వారంటున్నారు. అంతేకాకుండా ఈ రాశులవారికి శ్రీ అయోధ్య రాముడి అనుగ్రహం కూడా లభించబోతోంది. అయితే ఈ సమయంలో ఏయే రాశివారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వృషభ రాశి:
ఈ రోజు ఏర్పడే ప్రత్యేక యోగాల కారణంగా వృషభ రాశి జనవరి 22 ఎంతో శుభప్రదం, ఫలప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  ఈ సమయంలో వృషభ రాశి వారు సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా ఈ సమయంలో పాత పెట్టబడులన్నీ సులభంగా తిరిగి వస్తాయి. దీంతో పాటు వీరికి సమయంలో ఇమేజ్‌ కూడా పెరుగుతుంది. అలాగే భక్తి పట్ల విశేష ఆసక్తి కూడా పెరగుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఎలాంటి పనులు ప్రారంభించిన విజయాలు సాధిస్తారు. ఇక ఈ ప్రత్యేక యోగ సమయాల్లో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా తీసుకు రుణాలు కూడా సులభంగా తిరిగి చెల్లిస్తారు. ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. 

కన్య రాశి:
జనవరి 22 కన్య రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు ఇంట్లో శ్రేయస్సు, ఆనందం కూడా పెరుగుతుంది. ఈ రోజు కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. కెరీర్‌లో సులభంగా విజయాలు సాధించేందుకు ప్రణాళికలు కూడా పొందుతారు. అంతేకాకుండా అన్ని పనుల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దీంతో ఆటు మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వైవాహిక జీవితంలో కూడా ఊహించని మార్పులు వస్తాయి. ఈ సమయంలో  భాగస్వామి పై ప్రేమ రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో కష్టపడి పని చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 

తులారాశి:
తులారాశి వారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో తెలివిగా, విచక్షణతో వ్యవహరిస్తారు. దీంతో పాటు వీరు స్నేహితులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ సమయంలో తులా రాశివారు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. అలాగే కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఈ ప్రత్యేక యోగాల కారణంగా ఆస్తులు లేదా వాహనాలు కూడా కొనుగోలు చేయోచ్చు. ఈ సమయంలో మీ భాగస్వామి మద్దతు లభించడం కారణంగా ఎంతో ఉత్సహంగా ఉంటారు. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

ధనుస్సు రాశి:
ధనుస్సు రాశివారికి ఈ సమయంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మానసిక సమస్య నుంచి ఉపశమనం లభించి ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి  పెరుగుతుంది. ఈ రోజు పెద్ద మొత్తంలో పెట్టబడులు కూడా పెట్టొచ్చు. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అంతేకాకుండా మీ ప్రియమైనవారి నుంచి కూడా బహుమతులు పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో అధికారుల నుంచి సపోర్ట్‌ లభించి ప్రమోషన్స్‌ కూడా పొందుతారు. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News