Dead Persons Photos Asper Vastu: మనలో ప్రతిఒక్కరికి పెద్దవాళ్ల మీద గౌరవం, భక్తి ఉండాలి. అదే విధంగా ఏజ్ ఫ్యాక్టర్ వల్ల లేదా హెల్త్ సమస్యల వల్ల కొందరు మనవాళ్ల అకాలమరణం చెందుతారు. అయితే.. వీరిపైన కొందరు విపరీతమైన ప్రేమను కల్గిఉంటారు. ఎప్పుడు తమలో ఉండేలా ఫోటోలు పెట్టుకుంటారు. మరికొందరు ఏకంగా గుడిలోని దేవుళ్ల పక్కన పోయిన వారి ఫోటోలు పెట్టి మరీ పూజిస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also: Vastu Tips: ఇంటి మెయిన్ డోర్ ఆ దిశలో ఉంటే అడక్కు తినాల్సిందేనట.. వాస్తు ప్రకారం ఏ దిక్కు సరైనదంటే..


అయితే.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఇంట్లో పోయిన వారి ఫోటోలు పెట్టడం మంచిదే.. కానీ దేనికైన ఒక లిమిట్ ఉంటుంది. కొన్ని వాస్తు నియమాలు ఉంటాయి. వాటిని తప్పకుండా అందరు పాటించాలి. లేకపోతే ఇంట్లో మానసిక అశాంతి నెలకొంటుంది.  ముఖ్యంగా పోయిన వారి ఫోటోలను మనం పూజలు చేసే గదిలో అస్సలు పెట్టకూడదు. అదే విధంగా.. పోయిన వారి ఫోటోలను గుమ్మం ఎదురుగా పెట్టకూడదు.


ఎవరైన రాగానే మొదట కన్పించేలా కూడా పెట్టకూడదు. ఇంట్లో దక్షిణం వైపున పోయిన వారి ఫోటోలను పెట్టాలి. ఆ దిక్కుకు యముడు అధిపతి. ఆయన భూమిపై నూకలు చెల్లిపోయిన వారిప్రాణాలను తీసుకెళ్తుంటారు. అదే విధంగా పోయిన వారి తిథులను గుర్తుపెట్టుకుని, పిండప్రదానాలు చేయాలి. అంతే కానీ.. ఫోటోలు పెట్టేసి, విగ్రహలు ఏర్పాటు చేసి పెట్టుకుంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వస్తుందంటారు.


Read Also: Marriage Remedies: పెళ్లి కావడం లేదా? చివరగా ఈ ఒక్కప్రయత్నం చేయండి.. త్వరగా మ్యాచ్ ఫిక్స్ అవుతుంది..


అదే విధంగా.. పోయిన వారిమీద అంతే ప్రేమ ఉంటే వారి పోయిన రోజు గుర్తుపెట్టుకుని అన్నదానాలు చేయాలి. చక్కగా దానధర్మాలు చేయాలి. గతించిన వారికి ఏంచేస్తే ఆనందంగా ఫీలయ్యేవారో అలాంటిపనులను చేయాలి. ముఖ్యంగా మనుషులు ఉన్న వరకు చక్కగా చూసుకొవాలి. పోయాక ఫోటోలకు ఎన్నిదండలు వేసిన, ఎంతగా బాధపడిన పోయిన వాళ్లు తిరిగి మాత్రం రావు. అందుకే పోయిన వారిని ఫోటోలను ఇంట్లో దక్షిణం వైపుకు ఉండేలా చూసుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Media ధృవీకరించలేదు.)



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook