Janmashtami 2022 Remedies: శ్రీ కృష్ణ జన్మాష్టమి అంటే కృష్ణుడు పుట్టినరోజు. జన్మాష్టమిగా పిల్చుకునే ఆ రోజున కృష్ణుడిని బాల గోపాలుడి రూపంలో విధి విధానాలతో పూజిస్తారు. అలా చేస్తే అంతులేని ధన సంపదలు లభిస్తాయని ప్రతీతి. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భాద్రపద మాసం అష్టమి రోజున శ్రీ కృష్ణుడి జన్మదినం. ప్రతి ఏటా ఈ రోజున జన్మాష్టమి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది జన్మాష్టమి ఆగస్టు 18, 19 రెండ్రోజులు జరుపుకుంటారు. ఎందుకంటే అష్టమి ఆగస్టు 18 రాత్రి ప్రారంభమై..ఆగస్టు 19 రాత్రి వరకూ ఉంటుంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో ఆగస్టు 18 న జరుపుకుంటే..మరి కొన్నిప్రాంతాల్లో ఆగస్టు 19న జరుపుతారు. 


జన్మాష్టమి రోజున శీ కృష్ణ భగవానుడిని బాల గోపాలుడి రూపంలో పూజిస్తారు. శ్రీ కృష్ణుడి జన్మం భాద్రపద మాసంలోని కృష్ణపక్షం అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో జరిగింది. అందుకే ప్రతియేటా ఈ పండుగ దేశంలోని ప్రతి ప్రాంతంలో అత్యంత ఘనంగా జరుపుతారు. జన్మాష్టమి రోజున కొన్ని పద్ధతులు పాటిస్తే అంతులేని ధన సంపదలు లభిస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 


జన్మాష్టమి రోజున ఏం చేస్తే లాభం


మీ ఇంట్లో ధన సంపదలు, ఆదా అవాలని ఆలోచిస్తుంటే కృష్ణ జన్మాష్టమి రోజున కన్హయ్యను పూజించేటప్పుడు ఒక పాన్ ఆకును కృష్ణుడికి సమర్పించాలి. ఈ ఆకుపై శ్రీ యంత్రం అని రాసి..ఖజానాలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎప్పటికీ దారిద్ర్యం లేదా డబ్బు కొరత రాదగు. దాంతాపాటు డబ్బు ఆదా అవుతుంది. జన్మాష్టమి నాడు కృష్ణుడిని బాల గోపాలుడి రూపంలో పూజిస్తారు. సంతానం లేని దంపతులు ఈ రోజున పూర్తి భక్తి శ్రద్ధలతో పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ రోజున సంతానం లేని దంపతులు తమ ఇంట్లో ఆవు పిల్లల విగ్రహాలు లేదా చిత్రపటం అమర్చుకుని పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల త్వరలోనే ఆ ఇంట్లో సంతానం లభిస్తుంది. 


మరోవైపు జన్మాష్టమి రోజున 7 పాయసాలు లేదా 7 స్వీట్స్ తీసుకుని..7మంది కన్యలకు పంచాలి. జన్మాష్టమినాడు ఇలా ప్రారంభించి..వరుసగా 5 శుక్రవారాలు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఉద్యోగంలో పదోన్నతి, ఆదాయంలో వృద్ధి జరుగుతుంది. 


Also read: Raksha Panchami 2022: రక్షా బంధన్ రోజున సోదరులకు రాఖీ కట్టలేకపోతే.. ఈ రోజు కట్టొచ్చు ఇది మీకు తెలుసా.?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook