Janmashtami 2022: ఈ రోజే జన్మాష్టమి.. ఈ 4 రాశులవారికి గోల్డెన్ డేస్ మెుదలు..!
Janmashtami 2022 Date: ఈ ఏడాది జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలనే విషయంపై ప్రజల్లో గందర గోళం నెలకొంది. కొంత మంది ఈ రోజు జరుపుకుంటుంటే.. మరికొందరు రేపు జరుపుకోనున్నారు. ఈ రోజున పవిత్రమైన యోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
Janmashtami 2022 Date: ఈ ఏడాది జన్మాష్టమి నాడు చాలా శుభయోగం ఏర్పడుతోంది. ఇది 4 రాశుల వారికి అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది. శ్రీకృష్ణుడు జన్మించిన జన్మాష్టమి (Janmashtami 2022) నాడు రోహిణి నక్షత్రం లేనప్పటికీ, ఆగస్టు 19 అర్ధరాత్రి చాలా శుభ యోగం ఏర్పడుతోంది. కాలచక్ర గణన ప్రకారం 19వ తేదీ అర్ధరాత్రి చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తాడు. కావున ఈ యోగంలో పూజలు చేయడం శుభప్రదం అవుతుంది.
ఈ రాశుల వారికి జన్మాష్టమి శుభప్రదం
వృషభం (Taurus): ఈ సమయం వృషభరాశి వారికి చాలా మేలు చేస్తుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. మతపరమైన పనుల్లో చురుకుగా ఉంటారు.
కర్కాటకం (Cancer): కర్కాటక రాశి వారికి ఈ జన్మాష్టమి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. జీవితంలో సౌకర్యాలు మెరుగుపడుతాయి. మీరు కొత్త ఇల్లు, కొత్త కారు లేదా విలువైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. సంపద పెరుగుతుంది. అదృష్టం మీకు తోడవుతుంది. దానధర్మాలు చేయండి.
సింహం (Leo): ఈ జన్మాష్టమి సింహ రాశి వారికి మేలు చేస్తుంది. కెరీర్‌లో విజయాన్ని అందిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఏ పని అయినా కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఈ రోజు శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల గొప్ప ప్రయోజనాన్ని పొందుతారు.
Also Read: Dahi Handi 2022: దహీ హండి పండుగ అంటే ఏమిటి? ఇది ఎప్పుడు, దీని విశిష్టత ఏంటి?
వృశ్చికం (Scorpio): జన్మాష్టమి నాడు ఏర్పడే ఈ శుభ యోగం వృశ్చిక రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. స్నేహితుల వల్ల ప్రయోజనం ఉంటుంది. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆఫీసులో సహచరుల మద్దతు ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. పాత సమస్యలు పరిష్కారమవుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook