Guru Gochar 2023: దేవతలకు గురువు అయిన బృహస్పతి తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. గురు బృహస్పతి యొక్క రాశి మార్పు మొత్తం 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ధనుస్సు మరియు మీన రాశులకు బృహస్పతి అధిపతి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఏప్రిల్ 22, 2023న తెల్లవారుజామున 3.33 గంటలకు బృహస్పతి తన సొంత రాశి అయిన మీన రాశిని వదిలి తన మిత్ర రాశి అయిన మేషరాశిలోకి (Jupiter transit in Aries 2023) ప్రవేశిస్తాడు. దేవగురు బృహస్పతి అస్తమించే దశలో మీన రాశిలోకి వెళ్తాడు. గురు బృహస్పతి యొక్క ఈ స్థాన మార్పు ఏ రాశివారికి అనుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బృహస్పతి సంచారం ఈ రాశులకు శుభప్రదం 
మేషరాశి (Aries): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రాశి వారికి తొమ్మిదవ మరియు పన్నెండవ ఇంటికి బృహస్పతి అధిపతి. ఈ సమయంలో మేషరాశి వారు శుభవార్తలను వింటారు. ఆఫీసులో మీకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. 


మిధునరాశి (Gemini): మిథునరాశి యెుక్క ఏడవ మరియు పదవ ఇంటికి బృహస్పతి అధిపతి. ఈ రాశి యెుక్క పదకొండవ ఇంట్లో గురుడు సంచరిస్తాడు. మిథునరాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు వ్యాపారంలో భారీగా లాభాలను గడిస్తారు.  ఈ సమయంలో మీ బిజినెస్ విస్తరిస్తుంది. 


సింహరాశి (Leo): సింహ రాశి యెుక్క ఐదవ మరియు ఎనిమిదవ ఇంటికి బృహస్పతి అధిపతి. ఈరాశి యెుక్క తొమ్మిదవ ఇంట్లో గురుడు సంచరించనున్నాడు. మీకు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు అనేక విజయాలు సాధిస్తారు. మీకు సంతాన భాగ్యం కలుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలను సాధిస్తారు. మీరు వృత్తిలో పురోగతిని సాధిస్తారు. 


Also Read: Guru Gochar 2023: 'హన్స్ పంచ మహాపురుష రాజయోగం' చేస్తున్న బృహస్పతి.. ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.