Guru Gochar 2023: 'హన్స్ పంచ మహాపురుష రాజయోగం' చేస్తున్న బృహస్పతి.. ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..

Guru Gochar 2023: మేషరాశిలో బృహస్పతి యొక్క వల్ల అరుదైన హన్స్ పంచ మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఇది మూడు రాశులకు శుభప్రదంగా ఉంటుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2023, 12:35 PM IST
Guru Gochar 2023: 'హన్స్ పంచ మహాపురుష రాజయోగం' చేస్తున్న బృహస్పతి.. ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..

Guru Gochar In Mesh 2023: జ్యోతిష్యశాస్త్రంలో బృహస్పతిని దేవతల గురువు అంటారు. దీనిని శుభప్రదమైన గ్రహంగా భావిస్తారు. జ్యూపిటర్ గ్రహం యెుక్క కదలికలు ప్రతి ఒక్కరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. బృహస్పతి గ్రహం మీనరాశిని విడిచి ఏప్రిల్‌లో మేషరాశిలోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా హన్ష్ పంచమహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. వీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించడంతోపాటు భారీ మెుత్తంలో డబ్బును సంపాదిస్తారు. 

మకర రాశిచక్రం (Capricorn): పంచ మహాపురుష రాజయోగం వల్ల ఈరాశివారు అపారమైన సంపదను పొందుతారు.  ఎందుకంటే మీ సంచార జాతకంలో నాల్గవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. మీకు భౌతిక సుఖాలు పెరుగుతాయి. ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. విదేశీ కంపెనీతో పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. 

సింహ రాశి (Leo): పంచ మహాపురుష రాజయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశితో అదృష్ట స్థానంలో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీ అదృష్టం పెరుగుతుంది. వ్యాపారవేత్తలు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులు కోరిక నెరవేరుతుంది. మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఫ్యామిలీతో మంచి సమయం గడుపుతారు. ఈ టైంలో మీరు రూబీ రాయిని ధరించడం వల్ల మీకు లక్ వస్తుంది. 

ధనుస్సు రాశిచక్రం (Sagittarius): 2023 సంవత్సరం ధనుస్సు రాశి వరకు మేలు చేస్తుంది. ఎందుకంటే జనవరి 17న శనిదేవుడు సంచరించిన వెంటనే మీరు సడే సతి నుండి విముక్తి పొందబోతున్నారు. మీ రాశి నుండి ఐదవ ఇంట్లో పంచ మహాపురుష రాజయోగం కూడా ఏర్పడబోతోంది. మీరు కోర్టు కేసుల్లో విజయం  సాధిస్తారు. పెళ్లికాని యువతీయువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. 

Also Read: Mercury Rise 2023: న్యూ ఇయర్ లో ఈ 3 రాశులపై బుధుడి ప్రత్యేక అనుగ్రహం... ఇక వీరికి తిరుగుండదు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News