Jupiter Restograde 2022: మరో 5 రోజుల్లో గురు గ్రహం రాశిని మార్చబోతుంది. జూలై 29న బృహస్పతి మీనంలోకి తిరోగమనం (Jupiter Retrograde in Pisces 2022) చేయనుంది. దీని శుభ, అశుభ ప్రభావాలు మెుత్తం 12 రాశులపై ఉంటుంది. ఆస్ట్రాలజీలో బృహస్పతి శుభగ్రహంగా పరిగణిస్తారు. జ్ఞానం, విద్య మరియు అదృష్టానికి కారకుడు గురుడు. మీనంలో గురుడు సంచారం 5 రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మకరం (Capricron) - గురు సంచారం మకర రాశి వారికి చాలా మేలు చేస్తుంది. ఈ సమయం ఈ రాశివారికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. వీరు అదృష్టంతో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఆఫీస్ లో సహచరుల సపోర్టు లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. 


కర్కాటకం (Cancer)- ఈ రాశిచక్రం యొక్క తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి తిరోగమనం చేయనున్నాడు.  దీంతో అదృష్టం వీరి వెన్నంటే ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు. నిరుద్యోగులు శుభవార్త వింటారు.  ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కొత్తగా బిజినెస్ ప్రారంభించాలనుకునేవారికి ఇదే మంచి సమయం. 


వృశ్చికం (Scorpio)- ఈ రాశి వారికి ఉద్యోగంలో పురోగతితో పాటు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో వ్యాపారులు లాభపడతారు. మీరు పెట్టుబడి పెట్టిన డబ్బుకు రెట్టింపు ప్రయోజనం పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 


సింహం (Leo)- ఈ రాశి వారికి బృహస్పతి తిరోగమనం చేయగానే శుభ సమయం మెుదలవుతుంది.  వ్యాపారులకు లాభం చేకూరుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 


Also read: Shadashtak Yog: త్వరలో శని-శుక్ర 'షడష్టక యోగం'.. ఈ 4 రాశులవారి లైఫ్ ఖతం! 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook