Guru Vakri 2022 effect on Zodiac Signs:  బృహస్పతి గ్రహం... విద్య, జ్ఞానం, సంపద, దాతృత్వానికి కారకుడిగా ఆస్ట్రాలజీలో చెప్పబడింది. గురుడు రేపు తన రాశిని మార్చబోతున్నాడు. జూలై 29న బృహస్పతి మీనంలో తిరోగమనం (Jupiter Retrograde in Pisces 2022) చేయబోతున్నాడు. మీనంలో గురుడు యెుక్క రివర్స్ కదలిక మెుత్త 12 రాశులపై పెను ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఈ తిరోగమన గురువు ఎఫెక్ట్ మాత్రం 3 రాశుల వారికి బంపర్ బెనిఫిట్స్ అందించనుంది. రాబోయే 4 నెలలు బృహస్పతి తిరోగమనంలో ఉంటాడు. ఈ నాలుగు నెలలు ఈ రాశులవారికి అపారమైన డబ్బు, కెరీర్లో పురోగతిని ఇస్తాడు గురుడు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus) - బృహస్పతి తిరోగమనం వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది. జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు లాభపడతారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. 


మిథునరాశి (Gemini) - తిరోగమన గురువు మిథునరాశి వారికి అనేక ప్రయోజనాలను ఇస్తాడు. ఉద్యోగంలో మార్పు, పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం విస్తరించబడుతుంది. ఈ సమయంలో మార్కెటింగ్ లేదా మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. 


కర్కాటకం (Cancer)- కర్కాటక రాశి వారికి బృహస్పతి యొక్క రివర్స్ కదలిక అదృష్టమని చెప్పాలి. వీరికి అదృష్టం తోడై ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.  ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి. నిలిచిపోయిన ధనం మీకు అందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 


Also Read: Mercury transit Effect: సింహరాశిలో బుధ సంచారం.. ఈ 5 రాశులవారిపై డబ్బు వర్షం! 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook