Jupiter Transit 2022:  జ్యోతిషశాస్త్రంలో దేవగురు బృహస్పతి చాలా శుభ గ్రహంగా పరిగణించబడుతుంది. ఈ గ్రహం అనుగ్రహం ఉంటే...ఆ వ్యక్తి  ప్రతి పనిలోని విజయం సాధిస్తాడు. గురు దయ ఉంటే మన అభివృద్ధి చాలా వేగంగా ఉంటుంది. అధిక మెుత్తంలో డబ్బు వస్తుంది. అంతేకాకుండా మన వైవాహిక జీవతం అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం గురుడు తన సొంత రాశి అయిన మీన రాశిలో (Jupiter Transit in Pisces 2022) ఉన్నాడు. ఏప్రిల్ 22 2023 వరకు ఆయన అదే స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో ఆయన అనుగ్రహం 3 రాశులపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ రాశులేంటో చూద్దాం.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus): వృషభ రాశి వారికి బృహస్పతి రాబోయే సంవత్సరం వరకు శుభ ఫలితాలను ఇస్తాడు. వీరు తమ వృత్తిలో పురోగతిని సాధిస్తారు. బాస్ మీ పని పట్ల సంతృప్తిగా ఉంటాడు. ప్రమోషన్, కొత్త ఉద్యోగం లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో డబ్బు వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారుల పెద్ద ఒప్పందాలు చేసుకోవచ్చు. ఈ ఒప్పందం భవిష్యత్తులో చాలా ప్రయోజనాలను తెస్తుంది. ఒంటరి వ్యక్తులు వివాహం చేసుకునే బలమైన అవకాశాలు ఉన్నాయి. 


మిథునం (Gemini): మిథున రాశి వారికి వచ్చే ఏడాది చాలా శుభప్రదం. వీరు కొత్త ఉద్యోగం పొందవచ్చు. ప్రమోషన్-ఇంక్రిమెంట్ ఉండవచ్చు. ఈ సమయం మిధున రాశికి చెందిన వ్యాపారులకు పెద్ద ప్రయోజనాలను ఇస్తుంది. అతని వ్యాపారం బాగా పెరుగుతుంది. 


కర్కాటకం (Cancer): బృహస్పతి సంచారం కర్కాటక రాశి వారికి అపారమైన ఆనందాన్ని మరియు శ్రేయస్సును ఇస్తుంది. వీరికి అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారంలో డీల్ లేదా కొత్త ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్న వారి నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఏదైనా జబ్బు మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఇప్పుడు అది కూడా నయమవుతుంది.


Also Read: Vastu tips for money: మీరు ఇలా చేస్తే...రూ. 1 నాణెం మీ సమస్యలన్నింటినీ తొలగిస్తుంది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook