Vastu tips for money: మీరు ఇలా చేస్తే...రూ. 1 నాణెం మీ సమస్యలన్నింటినీ తొలగిస్తుంది!

Vastu tips for money: ప్రతి వ్యక్తి జీవితంలో హెచ్చు తగ్గులు కామన్. కొంత మంది కష్టపడి డబ్బులు సంపాదించినా నెలాఖరు వారి దగ్గర ఏమీ మిగలదు. వారి జాతకంలో వాస్తు దోషాలు లేదా దోషాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతుంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : May 23, 2022, 08:46 AM IST
Vastu tips for money: మీరు ఇలా చేస్తే...రూ. 1 నాణెం మీ సమస్యలన్నింటినీ తొలగిస్తుంది!

Vastu tips for money: కొంత మంది డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడతారు. కానీ వారు ఎంత కష్టించిన వారి దగ్గర డబ్బు నిలవదు. జ్యోతిష్య శాస్త్రం (Astrology) ప్రకారం, ఇది కుండలి దోషం లేదా వాస్తు దోషం వల్ల జరగవచ్చు. అటువంటి పరిస్థితిలో, ఒక వ్యక్తి డిప్రెషన్‌లో వెళ్లిపోతాడు. అయితే 1 రూపాయి నాణెం (1 rupee coin) మీకు ఉన్న సమస్యలన్నింటినీ తొలగిస్తుంది. దీని ద్వారా మీరు త్వరలో ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతాడు. దీనికి సంబంధించి కొన్ని ప్రత్యేక నివారణలు తెలుసుకుందాం.

కష్టాలను అంతం చేయడానికి..
పిడికెడు బియ్యం, 1 రూపాయి నాణెంతో ఏదైనా ఆలయానికి వెళ్లండి. దేవుడికి మీ కష్టాలు చెప్పుకున్న తర్వాత..ఆ గుడిలోని ఏదో ఒక మూలలో వాటిని ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ సమస్యల నుంచి త్వరలోనే గట్టెక్కుతారు. 

ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి..
ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే శుక్రవారం రోజున మీ ఇంట్లోని దేవుడి ముందు ఒక స్తంభం పెట్టి.. దానిపై ఒక కలశం ఉంచండి. ఆ కలశంపై కుంకుమతో స్వస్తిక్ తయారు చేసి, దానిపై రూ.1 నాణెం వేయండి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు త్వరగా తొలగిపోయి... ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. 

పేదరికం తొలగిపోవడానికి..
ప్రతిరోజూ సాయంత్రం పూజ చేసిన తరువాత, ఇంటి ప్రధాన ద్వారం మూలలో నాలుగు ముఖాల నెయ్యి దీపాన్ని వెలిగించి, ఈ దీపంలో ఒక రూపాయి నాణెం వేయండి. ఇలా చేయడం వల్ల ఇంటి దారిద్ర్యం తొలగిపోవడంతో పాటు ఇంటిలోని నెగెటివ్ ఎనర్జీ కూడా పోతుంది.

అదృష్టం కోసం..
మీ అదృష్టాన్ని బలోపేతం చేయడానికి, నెమలి ఈకలను మరియు 1 రూపాయల నాణాన్ని మీ జేబులో ఎల్లప్పుడూ ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల అదృష్టం బలపడుతుంది. జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి. అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశాలు కూడా ఏర్పడతాయి. 

Also Read: Astro Remedies: మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే.. ఈ 5 పనులు చేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News