Jupiter Vakri In Pisces: గ్రహాలు అవి ఉన్న దిశలోనే కాకుండా వివిధ రకాల స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి. వాటి స్థానాల నుంచి 12 గ్రహాల్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అయితే దీని వల్ల 12 రాశిచక్ర వారు తమ జీవితాల్లో పలు రకాల మార్పులు ఉత్పన్నమవుతాయి. అయితే ఈ దశలో కొందరికీ మంచి పరిణామాలు ఏర్పడితే.. మరి కొందరకీ నష్టలు వాటిల్లే అవకాశాలుంటాయి. అయితే ఈ సారి బృహస్పతి గ్రహం 12 సంవత్సరాల తర్వాత సొంత రాశి అయిన మీనంలో తిరోగమనం చెందనుంది. ఈ స్థితి ప్రభావం నవంబర్ 24 వరకు ఉండబోతున్నట్లు సమాచారం. అయితే దీని ప్రభావం 12 రాశులపై పడనుంది. ముఖ్యంగా ఈ కింద పేర్కొన్న మూడు రాశులపై తీవ్ర ప్రభావవం పడనుందని సమాచారం. అయితే బృహస్పతి తిరోగమనంతో ఈ మూడు రాశుల వారు మంచి లాభాలు పొందుతారని సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశుల వారి డబ్బే డబ్బు:


వృషభ రాశి:
బృహస్పతి తన సొంత రాశైనా మీనరాశిలోకి ప్రవేశించనునున్నాడు. కాబట్టి  ఈ రాశులకు మంచి రోజులు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. ఈ రాశిచక్రం నుంచి బృహస్పతి 11వ స్థానంలో తిరోగమనం చెందుతున్నాడు కాబట్టి..వృషభ రాశి వారి ఆదాయాల్లో మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వీరు వ్యాపారాల్లో చాలా లాభాలు పొందే అవకాలున్నాయి. ముఖ్యంగా ఈ రాశుల వారు ఈ సమయాల్లో వ్యాపారాలను ప్రారంభించడం వల్ల ఊహించిన స్థాయిలలో లాభాలు పొందుతారు. అయితే వీరు వాహనాలు, ఆస్తులను కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి అధిపతి  గురుడని.. దీని వల్ల దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారు సులభంగా వీటిని నుంచి బయటపడనున్నారు.


మిథునం రాశి:
ఈ రాశి వారు తిరోగమనం కారణంగా వ్యాపారంలో ఆశించిన విజయాన్ని పొందుతారు. ఇదే క్రమంలో మిథునం రాశి వారు ఉద్యోగం, వ్యాపారం రంగాల్లో మార్పులు కూడా చూడబోతున్నారు. అయితే ఈ తిరోగమనం వీరికి లాభాదాయకంగా ఉండొచ్చు. ముఖ్యంగా వీరు వ్యాపారలను ప్రారంభించాలనుకుంటే ఇదే శుభ సమయం.. ఈ క్రమంలో అన్ని రకాల వ్యాపారాలను ప్రారంభించుకోవచ్చు. అంతేకాకుండా ప్రారంభ దశలో కూడా చాలా లాభాలు పొందే అవకాశాలున్నాయి. ఈ రాశుల వారు కొత్త జాబ్ ఆఫర్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరు  ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందనున్నారు. అంతేకాకుండా కోర్టు కేసులలో విజయాలు కూడా సాధిస్తారు.


కర్కాటకం:
బృహస్పతి తిరోగమనం వల్ల ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఇది వీరు అదృష్టంగా భావించవచ్చు.  విదేశీ ప్రయాణాలు చేయాలకున్న వారు సులభంగా చేయగలుగుతారు. నిలిచిపోయిన పనిలన్ని ఈ క్రమంలో తీరిపోతాయి. అంతేకాకుండా ఆ పనుల్లో విజయాలు కూడా సాధిస్తారు. అంతేకాకుండా వీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారానికి సంబంధించి వీరు మంచి ఫలితాలు కూడా పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలీక వ్యాధులతో బాధపడుతున్నవారు అన్ని సమస్యల నుంచి ఉపశమనం కలుగనుంది. అంతేకాకుండా వీరిలో ధైర్యం, శక్తి పెరుగుతుంది.


Also Read: Telugu Movies this Week: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలివే!


Also Read: Amala Paul on Tollywood: టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్.. నెపోటిజం, రొట్ట సినిమాలు అంటూ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి