Kamika Ekadashi 2022: శ్రావణ మాసంలో తొలి కామికా ఏకాదశి జూలై 24, ఆదివారం వస్తుంది. ఈరోజున శ్రీమహావిష్ణువును (Lord Shiva) పూజించడం వల్ల పాపాలు నశించి మరణానంతరం మోక్షం లభిస్తుంది. కామిక ఏకాదశి వ్రతం (Kamika Ekadashi Vrat 2022) రోజున మూడు శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ మూడు యోగాల్లో ఏ పని చేసినా సత్ఫలితాలు లభిస్తాయి. అయితే ఈ యోగాల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కామికా ఏకాదశి 2022 ముహూర్తం
ప్రారంభం: జూలై 23, శనివారం, ఉదయం 11:27
ముగింపు: జూలై 24, ఆదివారం, మధ్యాహ్నం 01:45 గంటలకు
ద్విపుష్కర యోగా ప్రారంభం: జూలై 23, రాత్రి 10 గంటలకు
ద్విపుష్కర్ యోగా ముగింపు: జూలై 24, ఉదయం 05:38 గంటలకు
వృద్ధి యోగం: ఉదయం 02:02 వరకు
ధ్రువ యోగం: మధ్యాహ్నం 02:02 నుండి
పారణ సమయం: జూలై 25, ఉదయం 05:38 నుండి 08:22 వరకు.


వృద్ధి యోగం: ఈ యోగంలో శ్రీహరిని పూజించడం వల్ల మీ పుణ్యం రెట్టంపు అవుతుంది.  
ధ్రువ యోగం: మీరు ఈ యోగంలో చేసే ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. ఈ యోగం భవన నిర్మాణం మొదలైన వాటికి మంచిదని భావిస్తారు.
ద్విపుష్కర యోగం: ఈ యోగంలో పనిచేస్తే.. మీకు రెట్టింపు ధనం లభిస్తుంది.  ఈ యోగంలో విలువైన వస్తువులను కొనుగోలు చేయడం మంచిదని భావిస్తారు. 


వ్రత ప్రాముఖ్యత
కామికా ఏకాదశి వ్రతం గురించి... శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి చెప్పాడు. ఈ వ్రతం చేయడం వల్ల అన్ని తీర్థ ప్రదేశాలలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని చెప్పాడు. ఈ వ్రత కథ వింటే పాపాలు నశిస్తాయి. కామికా ఏకాదశి వ్రతాన్ని ఖచ్చితంగా పాటించి, విష్ణువును పూజించే ఏ వ్యక్తి అయినా మరణానంతరం మోక్షాన్ని పొందుతాడు.


Also Read: Sun-Mercury Conjunction in Cancer: కర్కాటక రాశిలో బుధాదిత్య యోగం.. ఈ 4 రాశులవారికి అపారమైన లాభం! 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook