Sun-Mercury Conjunction in Cancer: కర్కాటక రాశిలో బుధాదిత్య యోగం.. ఈ 4 రాశులవారికి అపారమైన లాభం!

Surya Budh Yuti 2022:  కర్కాటక రాశిలో సూర్యుడు మరియు బుధుడు కలిసి ఉన్నారు. దీని వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది 4 రాశుల వారికి ప్రయోజనకరంగా ఉండనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 19, 2022, 09:18 AM IST
  • కర్కాటక రాశిలో సూర్యుడు, బుధుడు కలయిక
  • ఈ 4 రాశులవారి కెరీర్ కేక
Sun-Mercury Conjunction in Cancer: కర్కాటక రాశిలో బుధాదిత్య యోగం.. ఈ 4 రాశులవారికి అపారమైన లాభం!

Surya Budh Yuti 2022: జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. అదే రోజు రాత్రే బుధుడు కూడా కర్కాటకంలోకి వెళ్లాడు. ఈ రాశిలో సూర్యుడు, బుధుడు కలయిక (Sun-Mercury Conjunction 2022) వల్ల బుధాదిత్య యోగం ఏర్పడింది. అయితే దీనినే వర్గోత్తమ బుద్దిత్య రాజయోగం అని కూడా అంటారు. ఈ రాజయోగం (Budhaditya Rajyog 2022) 4 రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉండనుంది. బుధుడు జూలై 31 వరకు కర్కాటక రాశిలోనే ఉంటాడు. అప్పటి వరకు ఈ 4 రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది. 

మేషం (Aries): బుధాదిత్య యోగం మేష రాశి వారికి చాలా లాభంగా ఉంటుంది. ఈ సమయంలో వారు ఆస్తి మురియు కొత్త వాహనాలు కొనుగోలు చేయవచ్చు. కొత్త జాబ్ వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.  ధనం లాభదాయకంగా ఉంటుంది.  జీవితంలో సౌకర్యాలు పెరుగుతాయి. 

కర్కాటకం (cancer): ఈ రాజయోగం కర్కాటక రాశి వారికి చాలా డబ్బును ఇస్తుంది. ఈ వ్యక్తులకు ఆకస్మిక ధన లాభం ఉంటుంది. వీరికి ప్రతి విషయంలోనూ అదృష్టం ఉంటుంది. వ్యాపారుల లాభాలు పెరుగుతాయి.  

కన్య (Virgo): సూర్య-బుధుల కలయికతో ఏర్పడిన వర్గోత్తం బుధాదిత్య రాజయోగం కన్యా రాశి వారికి లాభిస్తుంది. ఆదాయంలో పెరుగుదల ఉండటంతో..వీరి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ధనం లాభం ఉంటుంది.  ఆదాయ వనరులు పెరుగుతాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. 

తుల (Libra): బుధాదిత్య రాజయోగం తుల రాశి వారి కెరీర్ దూసుకుపోయేలా చేస్తుంది. కొత్త జాబ్ వస్తుంది.  సమాజంలో గౌరవం పెరుగుతుంది.  ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 

Also Read: Shri Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణ జన్మాష్టమి ఎప్పుడో తెలుసా? శుభ సమయం, పూజా విధానం 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News