Karthika Pournami 2022 Date And Time: ఈ రోజు నుంచి నవంబర్‌ మాసం ప్రారంభం కాబోతోంది. అయితే ఈ నెలకు చాలా ప్రత్యేక ఉంది. ఎందుకంటే ఈ నెలలో కార్తీక మాసానికి సంబంధించిన శుభ సమయాలు ఎక్కువగా రోజులుంటాయి. అంతేకాకుండా ఈ క్రమంలో తులసి  మాత వివహా కార్యక్రమం ఉంటుంది. అయితే తులసి వివాహం తర్వాత వివాహ కార్యక్రమాలు జరుగుతాయి. కానీ ఈ సంవత్సరం క్యాలెండర్‌లో పలు రకాల మార్పులు రావడంతో వివాహ సమయాల్లో మార్పులు వచ్చాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సంవత్సరంలో  శుక్ర నక్షత్రం లేకపోవడం వల్ల వివాహాలకు సంబంధించిన ముహూర్తాలు లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఈ నెలలోనే చంద్రగ్రహణం రావడంతో పలు రకాల మార్పులు రాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా కొన్ని పండగలు కూడా ముందుగానే వస్తున్నాయి. అవి తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నవంబర్ 2022 పండుగల జాబితా:
>>నవంబర్ 4, 2022 (శుక్రవారం) - ఏకాదశి
>>5 నవంబర్ 2022 (శనివారం) - తులసి వివాహం.(ఈ రోజు  హిందువులకు ఎంతో ప్రముఖ్యమైనది.)
>>5 నవంబర్ 2022 (శనివారం) - ప్రదోష ఉపవాసం
>>నవంబర్ 7, 2022 (సోమవారం) - దేవ్ దీపావళి, (చంద్రగ్రహణం) అయితే చంద్ర గ్రహణం కారణంగా దేవ్‌ దీపావళీని ముందుగానే జరుపుకుంటున్నారు.
>>8 నవంబర్ 2022 (మంగళవారం) - చంద్రగ్రహణం
>>8 నవంబర్ 2022 (మంగళవారం) - గురునానక్ జయంతి
>>8 నవంబర్ 2022 (మంగళవారం) - కార్తీక పూర్ణిమ
>>16 నవంబర్ 2022 (బుధవారం) - కాలాష్టమి, వృశ్చిక సంక్రాంతి అంతేకాకుండా ఈ రోజున సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు.
>>20 నవంబర్ 2022 (ఆదివారం) - ఉత్తాన ఏకాదశి
>>21 నవంబర్ 2022 (సోమవారం) - ప్రదోష ఉపవాసం
>>23 నవంబర్ 2022 (బుధవారం) - మార్గశీర్ష అమావాస్య
>>27 నవంబర్ 2022 (ఆదివారం) - వినాయక చతుర్థి
>>30 నవంబర్ 2022 (బుధవారం) - మాస దుర్గాష్టమి
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


 


Also Read :Manjima Mohan Lovestory : నా బతుకు అయిపోయిందన్న టైంలో వచ్చావ్!.. బాయ్ ఫ్రెండ్‌ను పరిచయం చేసిన మంజిమా మోహన్


Also Read : ఆ సినిమాపై పెట్టుబడి పెట్టడానికి ఏ నిర్మాత ముందుకు రాడు.. కృష్ణవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook