Kartik Purnima 2022: హిందూ సాంప్రదాయం ప్రకారం కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రముఖ్యత ఉంది. అయితే ఈ రోజూ నిరుపేదలకు వస్తువులను దానం చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కార్తీక పూర్ణిమకు ప్రత్యేక రోజున లక్ష్మిదేవి పూజించి దాన కార్యక్రమాలు చేయడం వల్ల లక్ష్మి దేవి అనుగ్రహంతో విష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కార్తీక పూర్ణిమ రోజున స్నానం, దానం గురించి ప్రత్యేక ప్రాముఖ్యతను పేర్కొన్నారు. అయితే కార్తీక పౌర్ణమి రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల అన్ని పాపాల నుంచి విముక్తి లభిస్తుందని హిందువులు నమ్ముతారు. అంతేకాకుండా కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల విశేష ఫలాలు లభిస్తాయి. కార్తీక పూర్ణిమ రోజున ఎలాంటి దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..


పాల దానం:
జ్యోతిష్య శాస్త్రంలో కార్తీక పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని, విష్ణువును పూజించడం ఆనవాయితిగా వస్తోంది. ఈ రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిని దానం చేస్తే..శుభ ఫలితాలు లభిస్తాయని జోతిష్య శాస్త్ర నిపుణుల తెలుపుతున్నారు. లక్ష్మి దేవికి తెల్లని రంగంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున పాలు దానం చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలె తొలగిపోయి.. అన్ని రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదని శాస్త్రంలో పేర్కొన్నారు. కార్తీక పూర్ణిమ రోజున దానం చేసేటప్పుడు.. సాయంత్రం పాలు దానం చేయకూడదని జోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.


బట్టల దానం:
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. కార్తీక పూర్ణిమ రోజున వస్త్రదానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగు పడుతుంది. కాబట్టి ఈ క్రమంలో బట్టలు దానం చేయడం చాలా మంచిది.


ధాన్య దానం:
అన్నదానం మహాదానమంటారు పెద్దలు. వీలైనంత వరకు అన్నదానం చేస్తూనే ఉండాలని పురాణాలు పేర్కొన్నాయి. ఇలా దానం చేయడం వల్ల పరమ క్షేమం లభించి మనిషి జీవితంలో శాంతి లభిస్తుంది. అంతేకాకుండా జీవితాంతం ఆహార కొరత ఉండదు.


బెల్లం దానం:
కార్తీక మాసంలో పౌర్ణమి రోజున బెల్లం దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ సంవత్సరంలో చంద్రగ్రహణం కారణంగా పౌర్ణమి రోజు దానధర్మాల చేయండ వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. బెల్లం దానం చేయడం వల్ల పేదరికం కూడా తొలగిపోతుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


Also Read: India Vs Bangladesh Preview: లైట్ తీసుకుంటే షాక్ తప్పదు.. బంగ్లాకు చుక్కలు చూపియాల్సిందే..! 


Also Read: Betel leaves Benefits: ఆ ఆకులతో అల్సర్, మధుమేహం, మలబద్ధకం సమస్యకు చెక



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి