Ketu Gochar 2023: ప్రతి సంవత్సరం ఎన్నో గ్రహాల సంచారాలు జరుగుతూ ఉంటాయి. దీని తీవ్ర ప్రభావం అన్ని రాశులవారిపై పడుతుంది. ఎన్నో నెలల తర్వాత కేతువు తన రాశిని వదిలి ఇతర రాశిలోకి సంచారం చేయబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా పలు రాశులవారిపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్‌ ఉంది. కేతువు స్థాన చలనం వల్ల అన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు జరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ 
సంచారం అక్టోబర్‌ నెలలో జరుగుతుంది. కాబట్టి అన్ని రాశులవారికి అక్టోబర్‌ 30 నుంచి మంచి జరగబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ రాశి సంచారం కారణంగా ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో, ఏయే నివారణల కారణంగా కేతు చెడు ప్రభావం దూరమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారిపై కేతు శుభ, ఆశుభ ప్రభావం:
అక్టోబర్‌ నెలలో జరిగే కేతు సంచారం కారణంగా సింహం, వృషభం, ధనుస్సు రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు ఆర్థికంగా, సామాజికంగా ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఈ కేతు సంచార సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్స్‌ పొందే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.  


Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?


ఈ రాశులవారు ప్రయోజనాలు పొందడానికి సుదీర్ఘ ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. అంతేకాకుండా భవిష్యత్తులో ఊహించని ధనలాభాలు కూడా పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో నిలిచిపోయిన పనులు కూడా సులభంగా తీరుతాయి. రిలేషన్ షిప్‌లో ఉన్నవారికి కూడా కేతు సంచారం లాభదాయకంగా ఉండబోతోంది.


వృషభం, ధనుస్సు రాశులవారు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. ఈ క్రమంలో భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని భారీ లాభాలు కూడా పొందుతారు. అంతేకాకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మేష, మిథున, మకర రాశుల వారికి కేతు సంచారం ఆశుభ స్థానంలో జరగబోతోంది. దీని కారణంగా ఈ రాశులవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ కింది నివారణలు పాటించడం వల్ల కేతు చెడు ప్రభావం నుంచి ఉపశమనం పొందవచ్చు.



కేతు గ్రహం చెడు ప్రభావ నివారణలు:
✽ భైరవుడిని పూజించి..పూజలో భాగంగా భైరవ చాలీసాను జపించాల్సి ఉంటుంది.
✽ కుక్కలకు ఆహారం పదార్థాలను తినిపించడం వల్ల కూడా కేతు చెడు ప్రభావం నుంచి విముక్తి లభిస్తుంది.
✽ ఓం శ్రీ శ్రీ శ్రీ కేత్వే నమః అనే మంత్రాన్ని పఠించడం వల్ల కూడా సులభంగా కేతు చెడు ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది.


Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి