Ketu Transit 2024: జ్యోతిష్య శాస్త్రంలో కేతువు గ్రహాన్ని అంతుచిక్కని గ్రహంగా పిలుస్తారు. అయితే ఈ గ్రహం చాలా స్లోవ్‌గా రాశి సంచారం చేస్తూ ఉంటుంది. ఈ గ్రహం 2023 సంవత్సరంలోని అక్టోబర్‌ నెలలో కన్యా రాశిలోకి సంచారం చేసింది. ఈ కేతువు అప్పుడప్పుడు కదలికలను జరుపుతుంది. దీని కారణంగా ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ గ్రహం 286 రోజులు కన్యారాశిలో సంచార దశలోనే ఉండబోతున్నాడు. అంతేకాకుండా 2025లో కేతువు రివర్స్‌లో కదులికలు జరిపే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ  286 రోజుల పాటు ఈ కింది రాశులవారు విపరీతమైన లాభాలు పొందుతారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

286 రోజుల పాటు ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి 286 రోజుల కేతువు శుభ స్థానంలో ఉంటాడు. దీని కారణంగా వీరికి ఈ సమయంలో ఎలాంటి కొత్త పనులు ప్రారంభించిన చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కుటుంబంలో గొడవలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు డబ్బు సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే వీరు ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌లకు వెళ్లే ఛాన్స్‌ ఉంది. ఈ సమయంలో ఎంతో ఆనందంగా ఉంటారు. దీంతో పాటు ఈ రాశివారికి కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌ ఉంది. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.


మేష రాశి:
మేష రాశి వారికి కేతువు కన్యా రాశిలో ఉండడం వల్ల ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరికి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. దీంతో పాటు  జీవిత భాగస్వామితో మరింత క్లోజ్‌ అవుతారు. దీని కారణంగా ఇద్దరి మధ్య ఉన్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యాపారాలు చేస్తున్నవారికి దీర్ఘమైన లాభాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యులతో కూడా ఆనందకరమైన జీవితాన్ని గడిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారు విదేశి ఒప్పందాలు కూడా పొందే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. అలాగే తల్లిదండ్రుల నుంచి సపోర్ట్‌ లభించి అనుకున్నపనులు కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. దీంతో పాటు ఖర్చులు కూడా పెరిగే ఛాన్స్‌ ఉంది. కాబట్టి తప్పకుండా ఈ సమయంలో వాటిని నియంత్రించుకోవడం చాలా మంచిది. దీంతో పాటు తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి