Krishna Chhati 2022: కృష్ణ ఛతీ అంటే ఏమిటి? దీనిని ఎందుకు జరుపుకుంటారు?
Krishna Chhati 2022: శ్రీకృష్ణుడు జన్మించిన ఆరు రోజుల తర్వాత ఆరో వేడుకలు లేదా కృష్ణ ఛతీని జరుపుకునే సంప్రదాయం ఉంది. దీని యెుక్క విశిష్టత గురించి తెలుసుకుందాం.
Krishna Chhati 2022: హిందూ మతంలో బిడ్డ పుట్టిన ఆరు రోజుల తర్వాత ఛతీని జరుపుకుంటారు. అదే విధంగా శ్రీకృష్ణుడు జన్మించిన ఆరు రోజుల తర్వాత ఆరో పూజ లేదా కృష్ణ ఛతీని (Krishna Chhati 2022) జరుపుకుంటారు. దీనిని ప్రతి ఏడాది ఆగస్టు 24న జరుపుకోనున్నారు. దీని పూజ విధానం గురించి తెలుసుకుందాం.
కృష్ణుడు జన్మించిన ఆరు రోజుల తర్వాత కృష్ణ ఛతీ చేస్తారు. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత చిన్ని కృష్ణుడికి పంచామృతంతో స్నానం చేయిస్తారు. దీని తర్వాత దక్షిణావర్తి శంఖంలో గంగాజలం నింపి మళ్లీ బాలగోపాలుడుకి అభిషేకం చేస్తారు. కృష్ణుడికి ఇష్టమైన పసుపు రంగు దుస్తులు వేసి అతనికి రింగ్ పెట్టండి. గంధంతో దూపం వేయండి. అనంతరం కృష్ణుడికి మఖన్ మిశ్రీని నైవేద్యంగా పెట్టండి.
ఆరవ రోజున షష్ఠి దేవిని పూజిస్తారు. షష్టిదేవిని పిల్లల దేవత అంటారు. అందుకే బిడ్డ పుట్టిన ఆరవ రోజున షష్ఠి దేవిని పూజించడం వల్ల పిల్లలకు ఏమీ జరగదు మరియు బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. గ్రంథాల ప్రకారం, ఆరవ రోజున నవజాత శిశువుకు కొత్త బట్టలు ధరిస్తారు. ఆరో రోజు కూర అన్నం చేసే సంప్రదాయం ఉంది.
Also Read: Hartalika Teej 2022: హర్తాళికా తీజ్ ఎప్పుడు? శుభ సమయం, పూజ సామాగ్రి గురించి తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook