Red Chilli-Lemon: ఇంటి బయట ఎండుమిర్చి-నిమ్మకాయ ఎందుకు కడతారో తెలుసా, శాస్త్రీయ కారణమేంటి
Red Chilli-Lemon: చాలామంది ఇళ్ల బయట..ఆఫీసుల బయట గుమ్మంలో నిమ్మకాయ ఎండిమిర్చి కడుతుంటారు. ఇలా ఎందుకు చేస్తారు, దీనివెనుక ఉన్న కారణమేంటి
Red Chilli-Lemon: చాలామంది ఇళ్ల బయట..ఆఫీసుల బయట గుమ్మంలో నిమ్మకాయ ఎండిమిర్చి కడుతుంటారు. ఇలా ఎందుకు చేస్తారు, దీనివెనుక ఉన్న కారణమేంటి
మన చుట్టూ సమాజంలో ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు, పద్ధతులు, నమ్మకాలుంటాయి. ఇందులో భాగంగా చాలామంది ఇళ్ల బయట, ఆఫీసు బయట గుమ్మాల్లో నిమ్మకాయ, ఎండిమిర్చిలు వేలాడదీస్తుంటారు. చెడు దృష్టి నుంచి తప్పించుకునేందుకు ఇలా చేస్తుంటారు. నిమ్మకాయ-ఎండిమిర్చిని ఇలా వేలాడదీయడం వల్ల చెడు దృష్టి పడదని..నెగెటివ్ ఎనర్జీ ప్రభావం ఉండదని అంటారు. జ్యోతిష్యశాస్త్రంలో వీటి గురించి విపులంగా ప్రస్తావన ఉంది. కొంతమంది ఈ అలవాట్లను మూఢ నమ్మకాలుగా పిలుస్తారు. కానీ జ్యోతిష్యశాస్త్రంలో దీని వెనుక ఓ ముఖ్య కారణం ఉంది.
చెడు దృష్టి నుంచి కాపాడుకునేందుకు నిమ్మకాయను విరివిగా ఉపయోగిస్తారు. నిమ్మకాయ అనేది పులుపుగానూ, ఎండుమిర్చి కారంగానూ ఉంటుంది. ఈ రెండు కలవడం వల్ల ఒకరి ఏకాగ్రత, ధ్యాసను మరల్చవచ్చని అంటారు. ఒకవేళ ఇళ్లు లేదా దుకాణం బయట ఈ రెండింటినీ కట్టి వేలాడదీస్తే చెడుదృష్టితో చూసేవారి ఏకాగ్రతకు భంగం కలుగుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం నిమ్మకాయ-ఎండుమిర్చిలో కీటకాల్ని నాశనం చేసే గుణాలుంటాయి. గుమ్మం వద్ద కట్టడం వల్ల వాతావరణం పరిశుభ్రంగా ఉంటుంది.
నిమ్మకాయ-ఎండుమిర్చి వెనుక సైన్స్..
నిమ్మ-ఎండుమిర్చి కట్టడం వెనుక శాస్త్రీయమైన కారణం కూడా ఉంది. నిమ్మకాయ పులుపు, మిర్చిలోని కారం రెండూ కలిస్తే తీవ్రమైన వాసన వస్తుంది. అంతేకాకుండా గుమ్మం వద్ద వేలాదీయడం వల్ల దోమలు కూడా ఇంట్లో ప్రవేశించలేవు.
మత గ్రంధాల ప్రకారం ఇళ్లు లేదా ఆఫీసు లేదా దుకాణం బయట నిమ్మకాయ-ఎండుమిర్చి కట్టడం శుభం. ప్రత్యేకించి ఏదైనా కొత్త ఇళ్లు లేదా కొత్త ఆఫీసు అయితే తప్పకుండా కట్టాలంటారు జ్యోతిష్య పండితులు.నిమ్మకాయ-ఎండుమిర్చి కట్టడం వల్ల చెడు దృష్టి నుంచి తప్పించుకోవచ్చు. నెగెటివ్ శక్తులు ప్రసరించకుండా కాపాడుకోవచ్చు.
Also read: Numerology : ఈ ర్యాడిక్స్ కలిగిన పిల్లలు చాలా లక్కీ.. వీరి పుట్టుకతో ఇంటి జాతకమే మారిపోతుంది...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook