Lord Ganesh Favourite Rashi: హిందూ సాంప్రదాయంలో ఏ శుభ కార్యమైనా వినాయకుని పూజతోనే మెుదలవుతుంది. అందుకే గణేశుడిని విఘ్నహర్త అని కూడా పిలుస్తారు. గణేశుని అనుగ్రహం ఉన్నవారికి అష్టఐశ్వర్యాలకు, సుఖ సంతోషాలకు లోటు ఉండదు. ఆస్ట్రాలజీలో ఉన్న మెుత్తం 12 రాశిచక్రాలలో గణేశుడికి నాలుగు రాశులవారు అంటే చాలా ఇష్టం. ఈ రాశులపై వినాయకుడి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. గణపతికి ఇష్టమైన ఆ రాశులేవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్య రాశి
కన్యా రాశి వారికి గణేశుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. కన్యా రాశికి అధిపతి బుధ గ్రహం. మెర్క్యూరీ ప్రభావం వల్ల ఈ రాశివారు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అంతేకాకుండా మీ కెరీర్ లోని అడ్డంకులన్నీ తొలగిపోయి.. విజయలక్ష్మీ మిమ్మల్ని వరిస్తుంది. 


మకరరాశి
మకర రాశి వారికి గణపతి అనుగ్రహం ఉంటుంది. వీరిు ప్రతి పనిని ఆలోచించి చేస్తారు. ఈరాశికి అధిపతి శనిదేవుడు. దీంతో మకరరాశి వారికి వినాయకుడి కృపతోపాటు శనిదేవుడు అనుగ్రహం కూడా ఉంటుంది. మీరు తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలను పొందుతారు.  గణేశుడి దయ వల్ల వీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. 


మేషరాశి
వినాయకునికి ఇష్టమైన రాశిచక్రాలలో మేషం కూడా ఒకటి. కుజుడు మేష రాశికి అధిపతి. దీంతో ఈ రాశి వారికి ధైర్యంతోపాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఈ వ్యక్తులపై గణేశుడి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. మీరు ఎంతటి కార్యన్నైనా సులభంగా సాధిస్తారు. మేషరాశి వారు ప్రతిరోజూ గణేశుడిని పూజించి, దుర్వా గడ్డి సమర్పించడం వల్ల శుభం చేకూరుతుంది. 


Also Read: Shani Vakri 2023: శని తిరోగమనంతో ఈ 4 రాశుల జీవితం నాశనం.. ఇందులో మీరున్నారా?


మిధునరాశి
మిథునరాశి వారికి గణేశుడి కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. పైగా ఈ రాశిని బుధుడు పాలిస్తాడు. వినాయకుడి అనుగ్రహంతో ఈ రాశి వారు జీవితంలో మంచి పొజిషన్ కు వెళతారు. డబ్బుతోపాటు కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. మిథునరాశి వారు బుధవారం నాడు తప్పనిసరిగా గణేశుడిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది. 


Also Read: Budh Uday 2023: కర్కాటక రాశిలో ఉదయించబోతున్న బుధుడు..ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook