Shani Vakri 2023: జూన్ 17న కుంభరాశిలో తిరోగమనం చేయనున్న శని.. ఈ 4 రాశుల జీవితం నాశనం

Saturn Retrograde 2023: మరో మూడు రోజుల్లో శనిదేవుడు తిరోగమనం చేయనున్నాడు. దీని వల్ల కొన్ని రాశులవారి జీవితం అల్లకల్లోలంగా మారనుంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 16, 2023, 05:00 PM IST
Shani Vakri 2023: జూన్ 17న కుంభరాశిలో తిరోగమనం చేయనున్న శని.. ఈ 4 రాశుల జీవితం నాశనం

Saturn Retrograde 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని మేజిస్ట్రేట్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇతడు కర్మల ప్రకారం ఫలాలను ఇస్తాడు. 30 ఏళ్ల తర్వాత శనిదేవుడు తన సొంత రాశి కుంభరాశిలో జూన్ 17న తిరోగమనం చేయనున్నాడు. నవంబరు 04 వరకు శనిదేవుడు ఇదే స్థితిలో ఉండనున్నాడు. శనిదేవుడి వ్యతిరేక కదలిక కొందరి జీవితాల్లో కల్లోలం సృష్టించనుంది. ఆ దురదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.

శని తిరోగమనం ఈ రాశులకు నష్టం

సింహ రాశి - శని వ్యతిరేక కదలిక సింహ రాశి వారికి కొన్ని ఇబ్బందులను కలిగిస్తుంది. ఈ సమయంలో ఏ నిర్ణయమైనా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. వ్యాపారులు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు అస్సలు కలిసిరాదు.

కర్కాటకం- శని తిరోగమనం కర్కాటక రాశి వారికి కష్టాలను పెంచుతుంది. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. మీకు ధన నష్టం వాటిల్లుతుంది. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం మానుకోండి. మీకు పని భారం పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో అనవసర ప్రయాణాలు మానుకోండి. 

Also Read: Surya Gochar 2023: జూన్ 15 నుండి ఈ రాశులకు మంచి రోజులు మెుదలు.. ఇందులో మీ రాశి ఉందా?

వృశ్చికం - వృశ్చిక రాశి వారు రాబోయే 4 నెలలు జాగ్రత్తగా ఉండాలి. శని యొక్క రివర్స్ కదలిక మీకు హాని కలిగిస్తుంది. మీకు ధన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఉద్యోగ-వ్యాపారాలలో నష్టాలు రావచ్చు. మీ సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంది. 

మీనం - శని తిరోగమనం మీన రాశి వారికి ఆర్థిక, మానసిక మరియు శారీరక సమస్యలను కలిగిస్తుంది. మీ కుటుంబంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. ఈసమయంలో మీరు ఓపికతో ఉండటం వల్ల మీకు మేలు జరుగుతుంది.

Also Read: Moon Transit 2023: అంగారకుడి రాశిలో అదృష్ట యోగం.. ఈ 3 రాశులకు కలిసి రానున్న కాలం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News